సల్మాన్‌‌కు షాక్: రూ.10 కోట్లు ఇవ్వాలని రేప్ విక్టిమ్ హెచ్చరిక

ముంబై: బాలీవుడ్ నటుడు సల్మాన్ ఖాన్‌కు మరో షాక్ తగిలింది. 'సుల్తాన్‌' షూటింగ్‌ విషయమై సల్మాన్ చేసిన రేప్‌ వ్యాఖ్యల సెగ రోజురోజుకీ పెరిగిపోతోంది. తాజాగా ఓ అత్యాచార బాధితురాలు సల్మాన్‌ చేసిన వ్యాఖ్యలకి రూ.10 కోట్లు ఇవ్వాల్సిందిగా డిమాండ్‌ చేసింది. అంతేగాక, ఇందుకోసం సల్మాన్‌కు లీగల్‌ నోటీసు పంపింది.

హర్యానాలోని హిసార్‌ ప్రాంతానికి చెందిన ఆ యువతి.. సల్మాన్‌కు పెద్ద అభిమాని కావడం గమనార్హం. అయితే అత్యాచార బాధితులను కించపరిచేలా సల్మాన్‌ వ్యాఖ్యలు చేయడంపై మండిపడింది. తమను కించపరిచేలా మాట్లాడినందుకు రూ.10కోట్లు చెల్లించాలని లేకపోతే క్రిమినల్‌, సివిల్‌ కేసులు పెట్టాల్సి వస్తుందని నోటీసులో పేర్కొంది.

Hisar gangrape victim demands Rs 10 crore from Salman Khan over rape remark

'ఒకప్పుడు సల్మాన్‌కి వీరాభిమానిని. సల్మాన్‌ అన్న మాటలకి ఇప్పుడు అతనంటేనే ద్వేషం కలుగుతోంది. మాలాంటి వారు అనుభవిస్తున్న బాధను అర్థంచేసుకోకుండా సల్మాన్‌ మాపై జోక్స్‌ వేశాడు' అని యువతి పేర్కొంది. అయితే సల్మాన్‌ ఖాన్ ఇప్పటివరకు ఈ నోటీసుపై స్పందించలేదు.

కాగా, నాలుగేళ్ల క్రితం సదరు యువతి సామూహిక అత్యాచారానికి గురైందని, ఈ కేసులో హిసార్‌ న్యాయస్థానం నలుగురు దోషులకు యావజ్జీవ కారాగార శిక్ష విధించిందని, ఇప్పటికీ ఈ కేసు విచారణలో ఉందని బాధితురాలి తరపు న్యాయవాది రజత్‌ కల్సన్‌ తెలిపారు. తన కూతురుపై సామూహిక అత్యాచారం నేపథ్యంలో ఆమె తండ్రి అవమాన భారంతో ఆత్మహత్య చేసుకున్నాడు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+