కటింగ్ చేసుకుని స్కూల్ కు రమ్మనందుకు ప్రిన్సిపల్ ను లేపేశారు.. ఇలా తయారయ్యారేంట్రా..?
ప్రస్తుతం యువత పరిస్థితి ఆందోళన కలిగిస్తోంది. ఓ వైపు సోషల్ మీడియా, రీల్స్, లవ్స్.. మరోవైపు డ్రగ్స్, గంజాయి, మర్డర్స్, రేప్స్ తో విచ్చల విడిగా తయారవుతున్నారు. చదువు మీద ధ్యాస పెట్టాల్సిన వయసులో ఫోన్ పిచ్చిలో.. మద్యం మత్తులో పడి నలిగిపోతున్నారు. అటు తల్లిదండ్రులనూ.. ఇటు గురువులనూ అంతమొందించే స్థాయికి చేరారు. తాజాగా ఇలాంటి ఓ షాకింగ్ ఘటన హరియాణాలోని హిస్సార్ లో జరిగింది.

జుట్టు బాగా పెరిగింది.. కటింగ్ చేసుకుని స్కూల్ కు రావాలని అని టెన్త్ చదువుతున్న ఆ ఇద్దరు స్టూడెంట్స్ ను ప్రిన్సిపల్ జగ్ బీర్ సింగ్ పన్నూ మందలించారు. స్కూల్ లో మీ ప్రవర్తన సరిగా లేదని.. తోటి విద్యార్థులతో సక్రమంగా నడుచుకోవాలని సూచించాడు. అయితే ఇది మనసులో పెట్టుకున్న ఆ ఇద్దరు మైనర్ విద్యార్థులు ప్రిన్సిపల్ జగ్ బీర్ పై కక్ష పెంచుకున్నారు. స్కూల్ ఆవరణలోనే కత్తితో దారుణంగా పొడిచి చంపారు. ఈ షాకింగ్ ఘటన హరియాణా హిస్సార్ జిల్లా నార్నౌడ్ టైన్, బాస్ గ్రామంలోని కర్తార్ మెమోరియల్ స్కూల్ లో జరిగింది.
Hisar, Haryana | Hansi SP Amit Yashvardhan says, "Two minor students of Kartar Memorial School in Bas village of Narnaund town, stabbed their School Principal to death in anger, after the principal told the children to come to school with cut hair and maintain discipline. The…
— ANI (@ANI) July 10, 2025
హిస్సార్ ఎస్పీ యశ్ వర్థన్ తెలిపిన వివరాల ప్రకారం.. "ఇద్దరూ మైనర్ విద్యార్థులే. కటింగ్ చేయించుకోమని ప్రిన్సిపల్ జగ్ బీర్ సింగ్ పన్నూ హెచ్చరించిన నేపథ్యంలో ఆయనపై కక్ష పెంచుకున్నారు. స్కూల్ ఆవరణలో కత్తితో దారుణంగా పొడిచి చంపారు. బాలురు ఇద్దరూ మైనర్స్ కావడంతో కేసు నమోదు చేయలేదు. పోలీసుల అదుపులోనే నిందితులు ఉన్నారు. ఈ ఘటనలో మృతి చెందిన ప్రిన్సిపల్ జగ్ బీర్ సింగ్ పన్నూ మృతదేహాన్ని పోస్ట్ మార్టమ్ నిమిత్తం ఆస్పత్రికి తరలించాం. ఈ ఘటనపై పూర్తి స్థాయిలో దర్యాప్తు చేస్తున్నాం" అని హిస్సార్ ఎస్పీ యశ్ వర్థన్ తెలిపారు.
-
సికింద్రాబాద్ స్టేషన్ సిద్దం, ప్రధాని మోదీ ప్రారంభం - ముహూర్తం ఫిక్స్..!! -
తెలంగాణ నుంచి తిరుపతి వెళ్లే వారికి గుడ్ న్యూస్.. అందుబాటులోకి కొత్త ఎన్ హెచ్ 565 -
బంగారం ధరలు అధోగతి- కనీవినీ ఎరుగనంత పతనం -
PM Modi: అన్నింటికీ సిద్దం అయిపోండి..! ప్రధాని మోడీ షాకింగ్ పిలుపు..! -
సికింద్రాబాద్- విశాఖ ఎక్స్ ప్రెస్ ఇక విజయవాడ వెళ్లదు- డైవర్షన్ రూట్ -
ప్రతీ ఇంటికీ రెండు ఫ్రీ గ్యాస్ సిలెండర్లు-ఇరాన్ వార్ వేళ సర్కార్ ఆఫర్..! -
రైతు భరోసా నిధులు జమ కాలేదా, ఇలా చేయండి- వెంటనే..!! -
మకరరాశి వార్షిక జాతకం ఇలా.. ఈ ఏడాది విశేష లాభాలు! -
ఏపీలో ఉద్యోగులకు సర్కార్ గుడ్ న్యూస్..! ఇకపై ఈ మార్పు..! -
తమిళనాడులో సీన్ రివర్స్-తాజా సర్వేలో హోరాహోరీ-ఎడ్జ్ మాత్రం..! -
విజయ్‌కు షాకిచ్చిన సర్వే!: ఆ పార్టీకి 180+ సీట్లు -
ధనుస్సు రాశి, మకర రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం












Click it and Unblock the Notifications