Hit list: ఒక్క హత్యతో మ్యాటర్ మొత్తం లీక్, హిందూ లీడర్స్ కు భారీ భద్రత, హిట్ లిస్ట్ లో వీళ్లే !
బెంగళూరు: భజరంగ్ దళ్ కార్యకర్త హర్షా హత్య కేసులో అరెస్టు అయిన నిందితులు ఇచ్చిన సమాచారంతో పోలీసులు అలర్ట్ అయ్యారని తెలిసింది. భజరంగ్ దళ్ కార్యకర్త హర్షా హత్య తరువాత కొందరు హిందూ సంఘ, సంస్థల కార్యకర్తలను హత్య చెయ్యడానికి స్కెచ్ వేశామని హర్షా హత్య కేసులో పోలీసులకు చిక్కిన ఓ నిందితుడు సమాచారం ఇచ్చాడని వెలుగు చూసింది. నిందితులు ఇచ్చిన సమాచారం మేరకు కొందరు హిందూ సంఘ, సంస్థలకు చెందిన వ్యక్తులకు స్థానిక పోలీసులు కట్టుదిట్టమైన భద్రత ఏర్పాటు చేశారు. భజరంగ్ దళ్ కార్యకర్త హర్షా హత్యతోనే ఈ గొడవలకు చెక్ పెట్టాలని, మరో హిందూ సంఘ, సంస్థ నాయకుడు కాని, కార్యకర్త కాని హత్యకు గురైతే పరిస్థితులు వేరుగా ఉంటాయని పోలీసు అధికారులు అంచనా వేశారు. హర్షా హత్య కేసులో పోలీసులకు చిక్కిన నిందితులు ఇచ్చిన సమాచారం మేరకు వారి హిట్ లిస్టులో ఉన్న వ్యక్తులకు బెంగళూరు పోలీసులు కట్టుదిటమైన భద్రతా ఏర్పాట్లు చేశారని తెలిసింది.

ఒక్క హత్యతో లీడర్ మ్యాటర్ లీక్
శివమొగ్గలో భజరంగ్ దళ్ కార్యకర్త హర్షా హత్య కేసులో ఇప్పటికే అరెస్టు అయిన నిందితులు ఇచ్చిన సమాచారంతో పోలీసులు అలర్ట్ అయ్యారని తెలిసింది. భజరంగ్ దళ్ కార్యకర్త హర్షా హత్య తరువాత కొందరు బీజేపీ నాయకులు, హిందూ సంఘ, సంస్థల నాయకులు, కార్యకర్తలను హత్య చెయ్యడానికి స్కెచ్ వేశామని హర్షా హత్య కేసులో పోలీసులకు చిక్కిన ఓ నిందితుడు సమాచారం ఇచ్చాడని వెలుగు చూసింది.

ఖాసీఫ్ ఇచ్చిన సమాచారం
శివమొగ్గ భజరంగ్ దళ్ కార్యకర్త హర్షా హత్య కేసులో ఇప్పటికే ఖాసీఫ్ అనే యువకుడిని పోలీసులు అరెస్టు చేశారు. పోలీసుల విచారనలో ఖాసీఫ్ పలు విషయాలు బయటకు చెప్పాడని తెలిసింది. భజరంగ్ దళ్ కార్యకర్త హర్షాను హత్య చెయ్యడానికి ఇప్పటికే ఆర్థిక సహాయం చేసిన వారి వివరాలను పోలీసులు బయటకు లాగుతున్నారని తెలిసింది.

లీడర్స్ కు కట్టుదిట్టమైన భద్రత
హర్షా హత్య కేసులో నిందితులు ఇచ్చిన సమాచారం మేరకు కొందరు హిందూ సంఘ, సంస్థలకు చెందిన వ్యక్తులకు స్థానిక పోలీసులు కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాటు చేశారు. భజరంగ్ దళ్ కార్యకర్త హర్షా హత్యతోనే ఈ గొడవలకు చెక్ పెట్టాలని, మరో హిందూ సంఘ, సంస్థ నాయకుడు కాని, కార్యకర్త కాని హత్యకు గురైతే పరిస్థితులు వేరుగా ఉంటాయని పోలీసు అధికారులు అంచనా వేశారు.
Recommended Video

హిట్ లిస్ట్ లో బెంగళూరు బీజేపీ ఎంపీ
హర్షా హత్య కేసులో అరెస్టు అయిన నిందితులు ఇచ్చిన సమాచారం మేరకు బెంగళూరుకు చెందిన ఓ బీజేపీ ఎంపీతో పాటు మొత్తం నలుగురు బీజేపీ నాయకులు హిట్ లిస్టులో ఉన్నారని పోలీసుల విచారణలో వెలుగు చూసింది. ఇప్పటికే హిందూ సంఘం నాయకుడు తేజస్ గౌడ బెంగళూరు దక్షిణ విభాగం డీసీపీ హరీష్ పాండే కలిసి తనకు భద్రత కల్పించాలని మనవి చేశారు. హర్షా హత్య కేసులో పోలీసులకు చిక్కిన నిందితులు ఇచ్చిన సమాచారం మేరకు వారి హిట్ లిస్టులో ఉన్న వ్యక్తులకు బెంగళూరు పోలీసులు కట్టుదిటమైన భద్రతా ఏర్పాట్లు చేశారని తెలిసింది.












Click it and Unblock the Notifications