హిట్ నుంచి సూపర్ హిట్: ప్రధాని మోడీ ‘తొలి’ పాలసీని ప్రశంసించిన నేపాల్ ప్రధాని ప్రచండ
న్యూఢిల్లీ: భారత్-నేపాల్ మధ్య సంబంధాలను హిమాలయాలంత ఉన్నతంగా తీసుకెళ్లేందుకు కృషి చేస్తూనే ఉంటామని ప్రధాని నరేంద్ర మోడీ పేర్కొన్నారు. సరిహద్దు సమస్యలతోపాటు అనేక అంశాల పరిష్కారానికి ప్రయత్నిస్తామన్నారు. భారత పర్యటనకు వచ్చిన నేపాల్ ప్రధాని పుష్పకమల్ దహల్ ప్రచండతో గురువారం ప్రధాని మోడీ కీలక చర్చలు జరిపారు. అనంతరం ఇరుదేశాధినేతలు మీడియాతో మాట్లాడారు.
రెండు దేశాల మధ్య భాగస్వామ్యం హిట్ అయ్యిందని.. భవిష్యత్తులో దీన్ని సూపర్ హిట్ చేసే దిశగా అనేక కీలక నిర్ణయాలు తీసుకున్నట్లు తెలిపారు ప్రధాని నరేంద్ర మోడీ. వాణిజ్యం, రవాణా, పెట్టుబడులు, విద్యుత్, నీటిపారుదల, పెట్రోలియం పైప్ లైన్ విస్తరణ, అనుసంధానత వంటి అంశాల్లో రెండు దేశాల మధ్య పరస్పర సహకారాన్ని మరింత పటిష్టం చేసుకునే మార్గాలపై చర్చించినట్లు ఇరుదేశాధి నేతలు తెలిపారు. ఈ సందర్భంగా రవాణా, పెట్రోలియం పైప్ లైన్ విస్తరణ, సమీకృత చెక్ పోస్టుల అభివృద్ధి, జలవిద్యుత్ తదితర రంగాల్లో ఏడు ఒప్పందాలపై సంతకాలు చేశారు.

భారతదేశంలోని రూపయిడిహా, నేపాల్‌లోని నేపాల్ గంజ్‌లో సమీకృత చెక్ పోస్టులను వర్చువల్‌గా ప్రారంభించారు. బీహార్‌లోని బథ్‌నాహా నుంచి నేపాల్ కస్టమ్ యార్డ్ వరకు ఓ సరుకు రవాణా రైలుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. భారత్-నేపాల్ ద్వైపాక్షిక సంబంధాలు ఎవరెస్ట్ అంతా ఎత్తుకు ఎదగాలని ఆకాంక్షించారు ప్రధాని మోడీ. 2014లో ప్రధానిగా బాధ్యతలు చేపట్టిన మూడు నెలల్లో నేపాల్‌లో పర్యటించానని.. ఆ సమయంలో ఇరుదేశాల మధ్య సంబంధాల విషయంలో హిట్(హైవేస్, ఐ-వేస్, ట్రాన్స్‌వేస్) ఫార్ములా ఇచ్చానని ప్రధాని మోడీ తెలిపారు. తమ భాగస్వామ్యం హిట్ అయ్యింందన్నారు.
विगत केही वर्षमा भारत– नेपाल सम्बन्धमा भएको प्रगति र भारत–नेपालबीचको सहकार्यलाई थप बलियो बनाउने उपायबारे म र प्रधानमन्त्री @cmprachanda बीच फलदायी वार्तालाप भयो । विशेष गरी वाणिज्य, ऊर्जा, संस्कृति र पूर्वाधार जस्ता प्रमुख क्षेत्रहरुबारे गहन छलफल भयो। @PM_nepal_ pic.twitter.com/q1V40KyXC8
— Narendra Modi (@narendramodi) June 1, 2023
సాంస్కృతిక, మతపరమైన అనుబంధాన్ని మరింత పెంపొందించుకునేందుకు గానూ.. రామాయణ సర్క్యూట్‌కు సంబంధించిన ప్రాజెక్టులను వేగవంతం చేయాలని నిర్ణయించినట్లు తెలిపారు. భారత్ అవలంభిస్తోన్న 'పొరుగుదేశానికి తొలి ప్రాధాన్యం' విధానాన్ని ప్రచండ ఈ సందర్భంగా కొనియాడారు. నాలుగు రోజుల పర్యటన నిమిత్తం ఆయన బుధవారం భారత్ చేరుకున్నారు.
కాగా, నేపాల్ ప్రధానిగా ప్రచండ భారత్‌లో పర్యటించడం ఇది నాలుగోసారి. ఆయన సెప్టెంబరు 2008లో ఇక్కడికి వచ్చారు. ఆ తర్వాత 2018 సెప్టెంబర్, అక్టోబరులో కూడా పర్యటించారు. ఆయన శుక్రవారం మధ్యప్రదేశ్‌కు బయలుదేరి అక్కడ నుంచి శనివారం నేపాల్ రాజధాని ఖాట్మండుకు బయలుదేరివెళతారు.
-
ఏలినాటి శని వెంటాడుతోందా? 'పొంగు శని'ని దర్శించుకుంటే అష్టైశ్వర్యాలే! -
బంగారం ధరల్లో లాభాల మోత -
బెంగళూరు, మైసూర్ కు ప్రత్యేక రైళ్లు- ఏపీలో హాల్ట్ స్టేషన్లు -
జీవన్ రెడ్డికి కేసీఆర్ బిగ్ టాస్క్, ఆపరేషన్ బిగిన్..!! -
భానుడి భగభగలు, పిడుగులతో భారీ వర్షాలు - ఈ ప్రాంతాలకు తాజా హెచ్చరికలు..!! -
Vaibhav Sooryavanshi: బుడ్డోడు మరో వరల్జ్ రికార్డు-కేవలం రెండో బ్యాటర్..! -
'డెకాయిట్'లో అసలైన ట్విస్ట్ ఇదే! -
PM-Rahat: యాక్సిడెంట్ బాధితులకు క్యాష్ లెస్ ట్రీట్మెంట్-ఆస్పత్రులకు ఆదేశాలు..! -
Tamil Nadu polls: చివరి 'బ్రహ్మాస్త్రం' ప్రయోగించిన విజయ్.. ఇక సైకిల్ టూ సీఎం సీటే..! -
Video: ఇదెక్కడి మాస్ రా మావా. బటన్ నొక్కితే బండి నంబర్ ప్లేట్ ఛేంజ్ -
SRH కొంపముంచిన క్లాసెన్ జిడ్డు బ్యాటింగ్ -
రేపే రాజ పంచక కాలం ప్రారంభం











Click it and Unblock the Notifications