ఘోరం: హెచ్ఐవీ ఉన్న తండ్రి కూతురిపై మూడేళ్లపాటు రేప్

ఈ ఉదంతం సూరత్‌లోని సచిన్ ఇండస్ట్రియల్ ఏరియాలో జరిగింది. బాధితురాలి ఫిర్యాదు పోలీసులు ఫిర్యాదు చేశారు. పోలీస్ ఇనస్పెక్టర్ చెప్పిన వివరాల ప్రకారం.. 42 ఏళ్ల హెచ్ఐవీ పాజిటివ్ వ్యక్తి ఇప్పటికే రెండుసార్లు వివాహం చేసుకున్నాడు. రెండో భార్యకు పుట్టిన కూతురిపై మూడేళ్ళుగా అత్యాచారం చేస్తున్నాడు.
ఎవరికైనా చెబితే చంపేస్తానని బెదిరిస్తూ వస్తుండటంతో ఆమె ఎవరికీ చెప్పలేదు. బాధిత బాలిక వయస్సు 15 ఏళ్లు. బాధితురాలు పోలీసులకు చెప్పిన వివరాల మేరకు.. ఆమెకు 12 ఏళ్ల వయస్సు ఉన్నప్పుడు ఆ దుర్మార్గపు తండ్రి మొదటిసారి ఆమె పైన అత్యాచారానికి పాల్పడ్డాడు. అప్పటి నుండి పలుమార్లు ఆమె పైన అత్యాచారం చేశాడు.
అతను బెదిరించడంతో బాలిక ఎవరికీ చెప్పలేదు. అయితే, ఇటీవల ధైర్యం తెచ్చుకున్న బాలిక తన తల్లితో కలిసి పోలసులకు ఫిర్యాదు చేసింది. వారి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు. పోస్కో యాక్ట్ సహా పలు సెక్షన్ల కింద అతని పైన కేసు నమోదు చేశారు.












Click it and Unblock the Notifications