జమ్మూలో గ్రెనేడ్ దాడి వెనక ఈ ఉగ్రవాద సంస్థ హస్తం... ఉగ్రవాది యాసిర్ భట్ అరెస్టు
జమ్మూ బస్టాండ్‌లో జరిగిన గ్రెనేడ్ దాడి వెనక హిజ్బుల్ ముజాహిద్దీన్ హస్తం ఉందన్నారు పోలీసులు. ఈ దాడికి సంబంధించి మొహ్మద్ షరీక్ అనే వ్యక్తిని అరెస్టు చేసినట్లు ఐజీపీ మనీష్ కె.సిన్హా తెలిపారు. దాడికి పాల్పడిన వ్యక్తిని యాసిర్ భట్‌గా పోలీసులు గుర్తించారు. జమ్మూ బస్టాండ్‌లో గ్రెనేడ్ విసరాల్సిందిగా కుల్గాం జిల్లా హిజ్బుల్ ముజాహిద్దీన్ కమాండర్ ఫరూఖ్ అహ్మద్ భట్ తనకు ఆదేశాలు ఇచ్చినట్లు యాసిర్ భట్ పోలీసులకు తెలిపాడు.
గ్రెనేడ్ దాడికి పాల్పడి అక్కడి నుంచి పారిపోయిన యాసిర్ భట్‌ను సీసీ టీవీ ఫుటేజీలు, ప్రత్యక్ష సాక్షులు ఇచ్చిన సమాచారంతో కేవలం 5 గంటల్లోనే నగ్రోటా టోల్ ప్లాజా వద్ద యాసిర్‌ను అరెస్టు చేసినట్లు ఐజీపీ సిన్హా తెలిపారు. విచారణ సందర్భంగా తాను కుల్గాంలోని ఫరూఖ్ భట్ నుంచి గ్రెనేడ్లు తీసుకుని గురువారం ఉదయం జమ్మూకు వచ్చినట్లు ఒప్పుకున్నాడని సిన్హా వెల్లడించారు.

ఇదిలా ఉంటే గురువారం ఉదయం బిజీగా ఉన్న జమ్మూ బస్టాండులో యాసిర్ భట్ గ్రెనేడ్ దాడికి పాల్పడటంతో ఒక వ్యక్తి మృతి చెందగా 30 మంది గాయపడ్డారు. మృతి చెందిన వ్యక్తిని ఉత్తరాఖండ్‌కు చెందిన 17 ఏళ్ల మొహ్మద్ షారిక్‌గా గుర్తించారు. గాయపడిన వారిలో నలుగురి పరిస్థితి విషమంగా ఉంది. వారి ప్రాణాలను కాపాడేందుకు వైద్యులు శ్రమిస్తున్నారు. ఇక గాయపడిన వారిలో 11 మంది కశ్మీరీలు, ఇద్దరు బీహార్‌కు చెందినవారు, ఒకరు చత్తీస్‌గఢ్, మరొకరు హర్యానాకు చెందిన వారిగా గుర్తించారు. గత 10 నెలల్లో జమ్మూ బస్టాండ్ సమీప ప్రాంతంలో మూడో సారి బాంబు పేలుళ్లు జరిగాయి. ఇక జమ్మూ కశ్మీర్‌లో శాంతి భద్రతలకు విఘాతం కలిగించేందుకే ఈ దాడులు పాల్పడుతున్నారని ఐజీపీ సిన్హా చెప్పారు. ప్రస్తుతం పరిస్థితి అదుపులోకి వచ్చిందని అంతా సాధారణ స్థాయికి చేరుకుందని చెప్పారు.
-
తులా రాశి, వృశ్చిక రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
PM Modi: అన్నింటికీ సిద్దం అయిపోండి..! ప్రధాని మోడీ షాకింగ్ పిలుపు..! -
బంగారం ధరలు అధోగతి- కనీవినీ ఎరుగనంత పతనం -
సికింద్రాబాద్ స్టేషన్ సిద్దం, ప్రధాని మోదీ ప్రారంభం - ముహూర్తం ఫిక్స్..!! -
ఇరాన్ ను లేపేద్దాం రండి: ప్రపంచ దేశాలకు నెతన్యాహు పిలుపు -
మహేష్ బాబు కాకుండా ఆ హీరో అంటే చాలా ఇష్టం - కృష్ణ -
క్రికెట్ రాజకీయాలకు బలైన రియల్ లైఫ్ 'ధురంధర్' ఆదిత్య ధర్! -
విజయ్ సంచలనం.. టీవీకే అభ్యర్థుల ఫుల్ జాబితా విడుదల.. -
తులారాశి వార్షిక ఫలం 2026-27: ఈ ఏడాది వీరికి తిరుగేలేదు.. ఈ విషయంలో జాగ్రత్త! -
మకరరాశి వార్షిక జాతకం ఇలా.. ఈ ఏడాది విశేష లాభాలు! -
రైతు భరోసా నిధులు జమ కాలేదా, ఇలా చేయండి- వెంటనే..!! -
India Post GDS 2nd merit list 2026: పోస్టల్ జాబ్స్ సెకండ్ మెరిట్ లిస్ట్ పై అప్డేట్..!












Click it and Unblock the Notifications