Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

కేంద్ర మంత్రి షిండేకు ట్రాక్టర్: ఆయన భార్యకు టెంపో

Home minister owns a tractor, his wife a tempo
షోలాపూర్ (మహారాష్ట్ర): కేంద్ర హోం మంత్రి సుశీల్ కుమార్ షిండే చరాస్థుల్లో ట్రాక్టర్ ఉండగా, ఆయన సతీమణి ఉజ్వలకు టెంపో ఉంది. ఉజ్వల వ్యవసాయం చేస్తుంటారు. ఆమె సామాజిక కార్యకర్త కూడా. వాటితో పాటు షిండేకు 4.7 లక్షల విలువ చేసే ఓ జనరేటర్ ఉంది. ఆయన పది లక్షల రూపాయలకు ఇటీవలే ఓ టయోటా ఫార్చూనర్ కొన్నారు.

మహారాష్ట్రలోని షోలాపూర్ లోకసభ స్థానం నుంచి కాంగ్రెసు అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేసిన షిండే తన ఆస్తుల వివరాలను తెలుపుతూ అఫిడవిట్ దాఖలు చేశారు. తనకు 6.18 కోట్ల రూపాయల విలువ చేసే చరాస్థులు ఉన్నట్లు, తన భార్యకు 2.4 కోట్ల రూపాయల విలువ చేసే చరాస్తులు ఉన్నట్లు ఆయన తెలిపారు. ఇందులో 30 లక్షల రూపాయల విలువ చేసే ఆభరణాలు కూడా ఉన్నాయి.

షిండే కుబోటా ట్రాక్టర్ 2011 మోడల్. దాని విలువ 5.72 లక్షల రూపాయలు. ఆయన భార్య పేరు మీద ఉన్న టెంపో విలువ 7.3 లక్షల రూపాయలు. షిండే స్థిరాస్తుల్లో వ్యవసాయ భూమి, ఫామ్ హౌస్‌లు, ఫ్లాట్స్, నివేశన స్థలాలు ఉన్నాయి.

తన పేరు మీద మొత్తం 5.8 కోట్ల రూపాయల విలువ చేసే ఆస్తులు, భార్య పేరు మీద 9.08 కోట్ల రూపాయల విలువ చేసే ఆస్తులు ఉన్నట్లు షిండే తెలిపారు. షిండేకు 1.5 లక్షల అప్పు ఉంది. తన వృత్తిని వ్యవసాయం, సామాజిక సేవగా ఆయన పేర్కొన్నారు. ఆయనకు ఎల్ఎల్‌బి డిగ్రీ ఉంది.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+