లిప్ట్‌లో ఇరుక్కుపోయిన కేంద్ర హోం మంత్రి, పైకప్పు తొలగించి బయటకు తీశారు
న్యూఢిల్లీ: కేంద్ర హోం మంత్రి రాజ్‌నాథ్ సింగ్ ఓ కార్యక్రమంలో పాల్గొనడానికి వెళ్లి లిప్ట్‌లో ఇరుక్కుపోయారు. ఓపెన్ చేయడం సాధ్యం పడక పోవడంతో పై కప్పును తొలగించిన ఆయనను బయటకు తీశారు. ఈ సంఘటన గురువారం నాడు న్యూఢిల్లీలోని వసంత్ కుంజ్‌లో చోటు చేసుకుంది.
వివరాల్లోకి వెళితే, వసంత్ కుంజ్‌లోని సెంటర్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్ (సీఆర్పీఎఫ్) కార్యాలయంలో 'శౌర్య దివస్' కార్యక్రమానికి హాజరయ్యేందుకు ఆయన వెళ్లారు. లిఫ్ట్ ఎక్కిన తర్వాత కొంత దూరం వెళ్లి ఆగిపోయింది. లిప్ట్‌లో ఆయనతో పాటు హోం శాఖ సహాయ మంత్రి కిరణ్ రిజిజు, సీఆర్పీఎఫ్ డైరెక్టర్ జనరల్ ఉన్నారు.

దీంతో లిప్ట్ పైకప్పును తొలగించి వారందరినీ బయటకు తీశారు. లిప్ట్ నుంచి బయట పడిన తర్వాత ఆడియన్స్‌కు ఆయనే స్వయంగా ఈ విషయాన్ని వెల్లడించారు.












Click it and Unblock the Notifications