స్వలింగ సంపర్కం పాపం... వారికి దేవుడి ఆశీర్వాదాలు ఉండవన్న వాటికన్ -News reel

స్వలింగ సంపర్కుల మధ్య వివాహాలను ఆశీర్వదించే అధికారం క్యాథలిక్ చర్చికి లేదని వాటికన్లో చర్చి నిబంధనావళిని రూపొందించే 'కాంగ్రిగేషన్ ఫర్ ది డాక్ట్రిన్ ఆఫ్ ది ఫెయిత్ (సీడీఎఫ్) అని వ్యవహరించే క్రైస్తవ మతాధిపతుల బృందం స్పష్టం చేసింది.
ఆ పాపపు పనిని దేవుడు ఆశీర్వదించడని మత పెద్దలు సోమవారం నాడు వెల్లడించారు. స్వలింగ సంపర్కులైన వ్యక్తుల మధ్య వివాహాలను చర్చి సమర్ధిస్తుందా అన్న ప్రశ్నకు 'లేదు' అని సీడీఎఫ్ సమాధానమివ్వగా, ఈ స్పందనను పోప్ ఆమోదించారు.
స్వలింగ సంపర్కులు పెళ్లి చేసుకోవడాన్ని అనుమతించ వచ్చని గత అక్టోబర్‌లో పోప్ ఫ్రాన్సిస్ ఓ డాక్యుమెంటరీలో పేర్కొన్నారు.
ఇటీవలి కాలంలో అమెరికా, జర్మనీ సహా పలు దేశాలలోని చర్చి సంఘాలు స్వలింగ సంపర్కుల మధ్య వివాహాలను ఆమోదిస్తున్నాయని, స్వలింగ సంపర్కులను కూడా చర్చికి రప్పించడంలో భాగంగా ఇలా చేస్తున్నట్లు రాయిటర్స్ వార్తా సంస్థ తెలిపింది.
అయితే స్త్రీ, పురుషుల మధ్య వివాహాలే పవిత్రమైనవని, ఒకే లింగానికి చెందిన వ్యక్తుల మధ్య సంబంధాలు అపవిత్రమని సీడీఎఫ్ స్పష్టం చేసింది.
స్వలింగ సంపర్కులను ఆమోదించడానికి నిరాకరించడానికి తానెవరినని 2013 లో పోప్ ఫ్రాన్సిస్ సంచలన వ్యాఖ్యలు చేశారు.
గత ఏడాది ఓ డాక్యుమెంటరీలో మాట్లాడుతూ "ఒక కుటుంబంగా ఏర్పడటానికి స్వలింగ సంపర్కులకు అన్ని హక్కులు ఉన్నాయి, వారు కూడా దేవుడి బిడ్డలే. వారిని పక్కనబెట్టలేం.'' అని వ్యాఖ్యానించారు.
పోప్ వేరే సందర్భంలో చేసిన వ్యాఖ్యలను తప్పుగా అన్వయించారని ఆ తర్వాత చర్చి దీనిపై వివరణ ఇచ్చింది.
ఇవి కూడా చదవండి:
- సైన్యంలో చేరాలని రెండు సార్లు ఫెయిలైన వ్యక్తి ఇప్పుడు దేశాన్నే గుప్పిట్లో పెట్టుకున్నాడు
- పాకిస్తాన్: ఫ్రెండ్స్ సమక్షంలో పువ్వులతో ప్రపోజ్ చేసి, హగ్ చేసుకున్న ప్రేమ జంట... బహిష్కరించిన లాహోర్ యూనివర్సిటీ
- మోదీకి జగన్ లేఖ: విశాఖ ఉక్కు కోసం అఖిలపక్షంతో వస్తాను.. అపాయింట్మెంట్ ఇవ్వండి
- 'నేను లెస్బియన్‌ని అని చెబుతున్నా బలవంతంగా అబ్బాయితో పెళ్లి చేసేశారు’
- సంస్కృతం: భాష నేర్చుకోవడానికి భారత్ వచ్చి యూనివర్సిటీ టాపర్‌గా నిలిచిన ఎయిర్ హోస్టెస్
- రివెంజ్ పోర్న్: నమ్మినవారే ఆన్లైన్లో అవమానాలకు గురిచేశారు, వేధింపులు భరించిన యువతుల కథ
- BBC ISWOTY: బీబీసీ ఇండియన్ స్పోర్ట్స్ వుమన్ ఆఫ్ ది ఇయర్-2020 అవార్డు విజేత... కోనేరు హంపి
- దిల్లీ అల్లర్లలో మరణించిన అంకిత్ శర్మ, రతన్‌లాల్ కుటుంబాలు ఇప్పుడెలా ఉన్నాయి
- 'రెండు కాళ్లూ కట్టేసి గోళ్లు పీకేశారు.. మూడు రోజుల పాటు నిద్రపోనివ్వలేదు’
- ప్రపంచవ్యాప్తంగా అందరికీ కోవిడ్-19 వ్యాక్సీన్ అందుబాటులోకి రావడం సాధ్యమేనా?
- భారత్ నుంచి వెళ్లే పెట్రోల్‌ను నేపాల్‌లో అంత చౌకగా ఎలా అమ్ముతున్నారు
- ఇంటి పనులు చేసిన భార్యకు రూ. 5.6 లక్షలు చెల్లించాలని భర్తను ఆదేశించిన కోర్టు
(బీబీసీ తెలుగును ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి)
-
సికింద్రాబాద్ స్టేషన్ సిద్దం, ప్రధాని మోదీ ప్రారంభం - ముహూర్తం ఫిక్స్..!! -
మకరరాశి వార్షిక జాతకం ఇలా.. ఈ ఏడాది విశేష లాభాలు! -
రైతు భరోసా నిధులు జమ కాలేదా, ఇలా చేయండి- వెంటనే..!! -
విజయ్‌కు షాకిచ్చిన సర్వే!: ఆ పార్టీకి 180+ సీట్లు -
"నాకు అమ్మా నాన్న లేరు సార్ మీరే నాకు అమ్మా నాన్న.. పాస్ చేయండి సార్" -
తెలంగాణ ఉద్యోగులకు సర్కార్ గుడ్ న్యూస్-అసెంబ్లీలో ప్రకటన..! -
సికింద్రాబాద్- విశాఖ ఎక్స్ ప్రెస్ ఇక విజయవాడ వెళ్లదు- డైవర్షన్ రూట్ -
తెలంగాణ నుంచి తిరుపతి వెళ్లే వారికి గుడ్ న్యూస్.. అందుబాటులోకి కొత్త ఎన్ హెచ్ 565 -
చైనా బంగారు కవచం.. ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో ప్రకంపనలు! -
ఆ భూములు ఇక వారికే, నిషేధం ఎత్తివేత - ప్రభుత్వం సంచలన ఉత్తర్వులు..!! -
అమెరికాలో విమాన ప్రమాదం: రన్ వే పై అడ్డంగా -
కొంపలు అంటుకున్నాయ్: 4 నెలల కనిష్టానికి బంగారం ధరలు












Click it and Unblock the Notifications