స్వలింగ సంపర్కం సహజ బహుమతి: గోవా సిఎం
పానాజీ: స్వలింగ సంపర్కం సహజమైన బహుమతి గోవా ముఖ్యమంత్రి లక్ష్మీకాంత్ పర్సేకర్ అన్నారు. స్వలింగ సంపర్కులకు చికిత్స అందించాలని క్రీడలు, యువజన సర్వీసుల మంత్రి రమేష్ తవాడ్కర్ చేసిన వ్యాఖ్య వివాదం కావడంతో నష్టనివారణ చర్యగా ముఖ్యమంత్రి ఆ ప్రకటన చేశారు. మంత్రి అజ్ఞనంతో ఆ వ్యాఖ్య చేశాడని ఆయన అన్నారు.
ఎల్‌జిబిటీలు (లెస్పెయన్లు, గే, బైసెక్సువల్, ట్రాన్స్‌జెండర్స్) ఏ వ్యాధితోనూ బాధపడడం లేదని, వారిని సాధారణ స్థితికి తేవడానికి ప్రభుత్వం వద్ద ఏ విధమైన విధానం లేదని ముఖ్యమంత్రి మంగళవారంనాడు మీడియా ప్రతినిధులతో అన్నారు. మద్యం బానిసలకు మాదిరిగానే స్వలింగ సంపర్కులకు చికిత్స చేయడానికి కేంద్రాలను తెరిచే ఆలోచన ఉందని రమేష్ తవాడ్కర్ సోమవారం అన్నారు.

ఎల్‌జిబిటీ యువతను సాధారణ స్థితికి తెస్తామని, మద్యం బానిసలకు ఏర్పాటు చేసినట్లుగానే వారి కోసం కేంద్రాలు ఏర్పాటు చేస్తామని, వారికి శిక్షణ ఇస్తామని, మందులు ఇస్తామని తవాడ్కర్ అన్నారు. యువజన విధానాన్ని ప్రకటిస్తూ ఆయన ఆ ప్రకటన చేశారు. అయితే, మంత్రి మంగళవారంనాడు మాట మార్చారు.
మీడియా తన మాటలను వక్రీకరించిందని, తాను గే కమ్యూనిటీ గురించి మాట్లాడలేదని, మద్యం బానిసల గురించి మాత్రమే చెప్పానని ఆయన మంగళవారంనాడు అన్నారు. మీడియా వివాదం సృష్టిస్తోందని ఆయన అన్నారు.












Click it and Unblock the Notifications