• search
  • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

Company Boss: స్టార్ హోటల్ లో ఉద్యోగినితో ఊగిపోయాడు, వీడియో, దూలతీరింది ఎదవకి, కింగ్ పిన్ !

|

కొచ్చి/ తిరువనంతపురం: తన కంపెనీలో ఉద్యోగం చేస్తున్న యువతి మీద కన్ను వేసిన ఆ సంస్థ యజమాని ఆమెను వలలో వేసుకున్నాడు. అప్పటి నుంచి ఆఫీసులోనే కాకుండా విలాసవంతమైన హోటల్స్, రిసార్టుల్లో యువతితో ఆ వ్యాపారవేత్త ఎంజాయ్ చేస్తున్నాడు. అనుకోకుండా ఓ సారి హోటల్ లో యువతితో ఆ వ్యాపారవేత్త నగ్నంగా ఎంజాయ్ చేస్తున్న సమయంలో ఎంట్రీ ఇచ్చిన నలుగురు వ్యక్తులు వీడియోలు, ఫోటోలు తీసి బ్లాక్ మెయిల్ చేశారు. వ్యాపారవేత్తను కిడ్నాప్ చేసి చేతికి చిక్కిన డబ్బులు లాక్కొన్నారు. అనుకోకుండా నిందితులు అందరూ ఓ ప్రాంతంలో స్థానికులకు చిక్కిపోయారు. హనీట్రాప్ తో వ్యాపారవేత్త కిడ్నాప్ కేసులో 25 ఏళ్ల యువతి కింగ్ పిన్ అని వెలుగు చూడటంతో వ్యాపారవేత్తతో పాటు పోలీసులు షాక్ కు గురైనారు.

Bedroom effect:తల్లికి తాటి బెల్లం, కూతురికి ?ఇన్ స్టాగ్రామ్ ఫ్రెండ్, బెడ్ రూమ్ లోకి తల్లి ఎంట్రీతో

 బిగ్ షాట్ కంపెనీ

బిగ్ షాట్ కంపెనీ

కేరళలోని మూవట్టుపుజలో ముళయం కొటిల్ అనే వ్యక్తి రెండు కంపెనీలు నిర్వహిస్తున్నాడు. ఆ కంపెనీలతో పాటు అనేక వ్యాపారాలు చేస్తున్న కొటిల్ డబ్బులు బాగా సంపాధిస్తున్నాడు. కొటిల్ కంపెనీలో ఆర్య అలియాస్ ఆర్యశ్రీ (25) అనే యువతి ఉద్యోగం చేస్తున్నది. ఆర్యశ్రీకి పెళ్లి కాకపోవడం, ఆర్యశ్రీ ఛామనచాయలో ఉన్నా చూడటానికి చాలా అందంగా ఉండటంతో కొటిల్ ఆమె మీద మనసుపడ్డాడు.

 మంచి రోజు వలలో పడింది

మంచి రోజు వలలో పడింది

కంపెనీలో ఉద్యోగులు అందరూ వెళ్లిపోయిన తరువాత కొటిల్ ఆర్యశ్రీ పట్టుకున్నాడు. డబ్బులు బాగా సంపాధిస్తూ తనకు జీతం ఇస్తున్న యజమాని కోరిక తీర్చడానికి ఆరోజు ఆర్యశ్రీ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. అయితే ఆర్యశ్రీ స్కెచ్ వేరే ఉంది అని ఆ బాస్ కొటిల్ గుర్తించలేకపోయాడు. అంతే అప్పటి నుంచి బాస్ కొటిల్, ఉద్యోగి ఆర్యశ్రీతో టైమ్ చిక్కిప్పుడుల్లా ఎంజాయ్ చేస్తూ పండగ చేసుకున్నాడు.

 స్టార్ హోటల్ లో రూమ్ !

స్టార్ హోటల్ లో రూమ్ !

గురువారం యజమాని కొటిల్, ఆర్య కలిసి ఎంజాయ్ చెయ్యాలని డిసైడ్ అయ్యారు. అంతే తెలిసిన ఫ్రెండ్ కు చెందిన కోఠమంగళంలోని విలాసవంతమైన హోటల్ లో రూమ్ బుక్ చేసుకున్న కొటిల్ తన కంపెనీలో పని చేస్తున్న ఆర్యశ్రీని అక్కడికి రావాలని చెప్పాడు. కొటిల్, ఆర్యశ్రీ హోటల్ లోని రూమ్ కు చేరుకున్నారు.

 అనుకోకుండా బాయ్స్ ఎంట్రీ

అనుకోకుండా బాయ్స్ ఎంట్రీ

ఆర్యశ్రీ తన వయ్యారాలతో బాస్ కొటిల్ ను రాసలీలలు మొదలుపెట్టి రంగంలోకి దింపింది. ఇద్దరూ ఒంటిమీద నూలుపోగుకూడా లేకుండా హోటల్ రూమ్ లో ఎంజాయ్ చెయ్యడం మొదలుపెట్టారు. అదే సమయంలో ఇద్దరు వ్యక్తులు హోటల్ రూమ్ లోకి ఎంట్రీ ఇవ్వడంతో వ్యాపారవేత్త కొటిల్ షాక్ కు గురైనాడు. ఎవరు మీరు ? ఎందుకు వచ్చారు ? అంటూ వ్యాపారవేత్త కొటిల్ ప్రశ్నించే సమయంలోనే నిందితులు ఇద్దరూ జోబులో నుంచి రెండు కత్తులు బయటకు తీసి నోరు ముయ్యరా, లేదంటే లేపేస్తాం అంటూ వార్నింగ్ ఇచ్చారు.

 10 నిమిషాల్లో రచ్చరచ్చ

10 నిమిషాల్లో రచ్చరచ్చ

వ్యాపారవేత్త కొటిల్, ఆమెతో పాటు ఉన్న ఆర్యశ్రీని బెదిరించిన నిందితులు వారిని బెడ్ మీద నగ్నంగా పడుకొని ఫోజులు ఇవ్వాలని కత్తులతో బెదిరించి మొబైల్ ఫోన్లలో వీడియోలు, ఫోటోలు తీశారు. 10 నిమిషాల పాటు హోటల్ రూమ్ లోని వివిద చోట్ల వారిని నిలబెట్టి ఫోటోలు తీశారు. నీ ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియాలో పోస్టు చేస్తామని, నీ కథ, నీ వ్యాపారల కథ క్లోజ్ అవుతాయని, అలా జరగకూడదు అంటే మాకు రూ. 4 లక్షలు ఇవ్వాలని వ్యాపారవేత్త కొటిల్ ను బెదిరించారు. ఇంత జరుగుతున్నా బాస్ కొటిల్ కు అనుమానం రాకుండా ఆర్యశ్రీ బాగా నటించింది.

 కిడ్నాప్ చేసి ఏటీఎంతో !

కిడ్నాప్ చేసి ఏటీఎంతో !

తన దగ్గర డబ్బులు లేవని, తరువాత ఇస్తానని వ్యాపారవేత్త కొటిల్ నిందితులను వేడుకున్నాడు. ఆ సమయంలో బాస్ పక్కనే ఉన్న ఆర్యశ్రీ భయపడినట్లు నటించడంతో ఆ వ్యాపారి మరింత హడలిపోయాడు. వ్యాపారవేత్త దగ్గర ఉన్న రూ. 35 వేలు లాక్కొన్న నిందితులు అతని ఏటీఎం కార్డు లాక్కొన్నారు. ఇంటి దగ్గర డబ్బులు ఇస్తానని చెప్పడంతో కొటిల్ ను అతని కారులోనే కిడ్నాప్ చేశారు. నలుగురు కలిసి కారులో బయలుదేరి వెలుతున్న టైమ్ లో మార్గం మధ్యలో మరో ఇద్దరు వారి కారులో ఎక్కి దర్జాగా కుర్చున్నారు. వ్యాపారవేత్త కొటిల్ ఇంటి వైపుకు కారును ఓ నిందితుడు వేగంగా నడిపాడు.

 వామ్మో కిలాడీ నువ్వేనా !

వామ్మో కిలాడీ నువ్వేనా !

కారు కొట్టపాడి కాలేజ్ సమీపంలో వెలుతున్న సమయంలో తనకు షుగర్ ఉందని, వెంటనే మూత్రవిసర్జన చెయ్యాలని వ్యాపారవేత్త కొటిల్ నిందితులకు చెప్పాడు. కారు నిలిపిన వెంటనే మూత్రవిసర్జన చేస్తున్నట్లు నటించిన కొటిల్ గట్టిగా కేకలు వెయ్యడంతో స్థానికులు గుమికూడి నిందితులను పట్టుకున్నారు. జరిగిన విషయం తెలుసుకున్న స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. పోలీసులు ఇద్దరిని అదుపులోకి తీసుకోవడంతో మరో ముగ్గురు పరారైనారు. పోలీసుల విచారణలో వ్యాపారవేత్త కొటిల్ ను హనీట్రాప్ పేరుతో రంగంలోకి దింపి నగ్నంగా వీడియోలు, ఫోటోలు తీసి బ్లాక్ మెయిల్ చేయించింది అతని కంపెనీలో పని చేస్తున్న ఆర్యశ్రీ అని వెలుగు చూసింది. తరువాత పారిపోయిన మరో ముగ్గురిని పోలీసులు పట్టుకున్నారు.

 రంకులాడి ఏం ప్లాన్ వేసింది ?

రంకులాడి ఏం ప్లాన్ వేసింది ?

తన కంపెనీ ఉద్యోగి ఆర్యశ్రీ ఇంత స్కెచ్ వేసింది అని తెలుసుకున్న కొటిల్ షాక్ కు గురైనాడు. పోలీసులు నిందితుల దగ్గర ఉన్న మొబైల్ ఫోన్లు సీజ్ చేశారు. హనీట్రాప్ కేసులో కింగ్ పిన్ అయిన యువతి ఆర్యశ్రీతో పాటు ఆమె సన్నిహితుడు అశ్విన్, వీరికి సహకరించిన రిజ్వాన్, ఆసీఫ్, యాసిన్ అనే నిందితులను పోలీసులు అరెస్టు చేశారు. కోర్టు ఆదేశాలతో నిందితులను సెంట్రల్ జైలుకు పంపించారు. నిందితుల్లో ఒకరికి కరోనా వైరస్ పాజిటివ్ అని వెలుగు చూడటంతో అతన్ని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించామని పోలీసులు తెలిపారు.

English summary
Honey trap case: Three more accused arrested for trying to extort money from businessman in Moovattupuzha in Kerala.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X