హనీట్రాప్.. సోదరుడిని చంపిన వ్యక్తిపై ప్రేమ వల.. బాలీవుడ్ మూవీని తలదన్నేలా..

దేశ ఆర్థిక రాజధాని ముంబైలో ఓ హనీట్రాప్ వెలుగుచూసింది. తన సోదరుడిని చంపిన వ్యక్తిపై యువతి ప్రేమ వల విసిరింది. సోషల్ మీడియా ద్వారా దగ్గరై.. ముంబై పిలిపించి కిడ్నాప్ చేసింది. అయితే అతన్ని పట్టుకెళ్లగా మరొకరు చూసి పోలీసులకు సమాచారం ఇవ్వడం.. మరో వ్యాన్‌లో తరలించడంతో చెక్ చేయగా దొరికిపోయారు. సస్పెన్స్ థ్రిల్లర్ మూవీని తలపించిన ఘటనను ముంబై కాప్స్ రివిల్ చేశారు.

ఇలా గొడవ.. హత్య...

ఇలా గొడవ.. హత్య...

ముంబై మలాద్ ప్రాంతంలో వాహనాల పార్కింగ్ విషయంలో గత జూన్ నెలలో రెండు గ్రూపుల మధ్య గొడవ జరిగింది. మహ్మద్ సాధిక్ అనే వ్యక్తి అల్తాఫ్‌ను హత్య చేశాడు. తర్వాత సాధిక్ ఢిల్లీకి పారిపోయాడు. సోదరుడు అల్తాఫ్ హత్యపై ప్రతీకారం తీర్చుకోవాలని అతని సోదరి యాస్మీన్ నిర్ణయించుకుంది. అల్తాఫ్ స్నేహితులు ఫరూక్, ఒవైస్, మనీస్, జాకీర్ ఖాన్, సత్యంపాండే సహాయం తీసుకుంది. సాధిక్‌ను చంపాలని యాస్మిన్ నిర్ణయించుకుంది.

నెల తర్వాత.. వలపు వల

నెల తర్వాత.. వలపు వల

అల్తాఫ్ హత్య జరిగిన నెల రోజుల తర్వాత యాస్మిన్.. అల్తాఫ్ స్నేహితులను మాల్వాలో కలిసింది. సాధిక్‌ను చంపడానికి కుట్ర పన్నారు. సాధిక్‌ను ఢిల్లీ నుంచి ముంబైకు రప్పించేందుకు హనీట్రాప్ చేయాలని నిర్ణయించారు. నకిలీ ఇన్‌స్టాగ్రామ్ ఖాతాను యాస్మిన్ తెరిచారు. సాధిక్ తో ఛాటింగ్ చేయడం ప్రారంభించింది. సాధిక్ ఆమెను నమ్మి ప్రేమలో పడ్డాడు. ఢిల్లీలో ఉన్న సాధిక్ యాస్మిన్‌ను కలవడానికి ముంబైలో వాలాడు. ఆరేలోని చోటా క్మీర్ ప్రాంతానికి యాస్మిన్ పిలిచింది. సాధిక్ అక్కడకు చేరుకున్న సమయంలో అల్తాఫ్ ఐదుగురు స్నేహితులు అంబులెన్సులో ఉన్నారు.

Recommended Video

    Jammu Kashmir : Meet Pooja Devi, First Woman Bus Driver In J&K | Oneindia Telugu
    కిడ్నాప్ చేసి తరలింపు.. సమాచారంతో..

    కిడ్నాప్ చేసి తరలింపు.. సమాచారంతో..

    సాధిక్ రాగానే కిడ్నాప్ చేసి వసాయినైగావ్ లోని అటవీ ప్రాంతానికి తీసుకెళ్లి చంపాలని అనుకొన్నారు. సాధిక్‌ను అంబులెన్సులో ఎక్కించగా స్థానికుడు చూసి పోలీసులకు సమాచారం అందించాడు. ముంబై పోలీసులు అప్రమత్తమై అంబులెన్సును గుర్తించారు. ఇంతలో అంబులెన్సులో పెట్రోలు అయిపోవడంతో వారు మరో కారును అద్దెకు తీసుకున్నారు. కారులో వెస్ట్రన్ జాతీయ రహదారిపై వెళుతుండగా దహిసర్ చెక్ నాకా గుండా వెళుతుండగా పోలీసులు పట్టుకున్నారు. ఆ కారులో యాస్మిన్ కూడా ఉన్నారు. హత్యాయత్నం కేసులో వీరిని.. అల్తాఫ్ హత్య కేసులో సాధిక్‌ను పోలీసులు అరెస్టు చేశారు.

    Notifications
    Settings
    Clear Notifications
    Notifications
    Use the toggle to switch on notifications
    • Block for 8 hours
    • Block for 12 hours
    • Block for 24 hours
    • Don't block
    Gender
    Select your Gender
    • Male
    • Female
    • Others
    Age
    Select your Age Range
    • Under 18
    • 18 to 25
    • 26 to 35
    • 36 to 45
    • 45 to 55
    • 55+