చలికాలంలో హనీమూన్ ప్లాన్ చేస్తున్నారా..? బెస్ట్ ప్లేస్ లు ఇవే..
ప్రస్తుతం పెళ్లిళ్ల సీజన్ కొనసాగుతున్న సంగతి తెలిసిందే. అయితే వివాహం తర్వాత కొత్త జంటలు హనీమూన్ కు ప్లాన్ చేస్తుంటాయి. తమకు ఇష్టమైన పర్యాటక ప్రాంతంలో దంపతులు ఏకాంతంగా గడపాలని కోరుకుంటారు. ఇక ప్రస్తుతం చలికాలం కావడంతో చాలా మంది హనీమూన్ కు సిమ్లా-మనాలీ, రాజస్థాన్ వంటి ప్రాంతాలకు వెళుతుంటారు. అయితే అవే కాకుండా మనదేశంలోనే బెస్ట్ రొమాంటిక్ హనీమూన్ ప్లేసెస్ చాలానే ఉన్నాయి. వాటిలో ఉత్తర సిక్కింలోని లాచెన్ అలాగే తంగు లోయ ప్రాంతాలకు చాలా తక్కువ మంది జంటలు వెళ్తుంటాయి. దానికి కారణం ఈ ప్రాంతం చలికాలంలో ఇంత అద్భుతంగా ఉంటుందని తెలియకపోవడమే..
ప్రసిద్ధమైన హిమాలయ పర్యటక ప్రాంతాల్లో సిక్కింలోని లాచెన్ అలాగే తంగు లోయ ప్రాంతాలు చాలా ప్రత్యేకమైనవి. అక్టోబర్ నుంచి మార్చి నెలల్లో ఈ ప్లేస్ స్వర్గాన్ని తలపిస్తుందనడంలో ఎలాంటి సందేహం లేదు. కొత్తగా పెళ్లయిన జంటలకు ఇది స్వర్గధామం అని చెప్పొచ్చు. సిక్కింలోని గురుడోంగ్మార్ సరస్సు, చోప్టా సరస్సుకు వెళ్లే మార్గంలో ఈ లోయ ఉంటుంది. ఈ తంగు లోయ 3950 మీటర్ల ఎత్తులో 13000 అడుగుల ఎత్తులో ఉంటుంది. అందుకే ఎల్లప్పుడూ మంచు కురుస్తూ ఆహ్లాదకరమైన వాతావరణాన్ని కలిగి ఉంటుంది.
ఇక పశ్చిమ్ బెంగాల్ లోని డార్జిలింగ్ ప్రముఖ హనీమూన్ డెస్టినేషన్స్ లో ఒకటిగా ఉంది. ఈ ప్రాంతానికి సాధారణ జంటల నుంచి సెలబ్రిటీస్ వరకూ అందరూ వస్తుంటారు. డార్జిలింగ్ ను క్వీన్ ఆఫ్ ది హిల్స్ గా పిలుస్తారు. ఇక్కడి టైగర్ హిల్, కాంచనజంగా పర్వతం అందాలు, డార్జిలింగ్ హిమాలయన్ రైల్వే, డార్జిలింగ్ టీ చాలా ఫేమస్ అయిన సంగతి తెలిసిందే. డార్జిలింగ్ ప్రాంతాన్ని సందర్శించేందుకు నవంబర్ నుంచి అనువైన సమయంగా చెబుతారు.

మరో ముఖ్యమైన టూరిస్ట్ ప్రాంతం మనాలి. ఈ ప్రాంతం హిమాచల్ ప్రదేశ్ లో ఉంది. మంచుతో కప్పబడిన పర్వతాలు.. పచ్చని లోయలు, నదులు, జలపాతాలతో పర్యాటకులను ఆకర్షిస్తుంది. ఇది పర్యాటకులు, హనీమూన్ జంటలకే కాదు.. సాహస ప్రియులకు కూడా ఒక ప్రముఖమైన గమ్య స్థానంగా ఉంది. మనాలికి దగ్గరలోని సజ్లా గ్రామం.. షాంఘర్ గ్రామం.. రాణి నాలా.. పాండు రోపా తదితర ప్రాంతాలు ప్రకృతి ప్రేమికులకు ప్రత్యేకంగా ఆకర్షిస్తున్నాయి. కొత్త జంటలకు ఈ టూరిస్ట్ ప్రాంతాలు మరచిపోలేని అనుభూతిని కలిగిస్తాయి.












Click it and Unblock the Notifications
