డేరాబాబా దత్తపుత్రిక హనీప్రీత్ డైరీలో సంచలన విషయాలు
Recommended Video

న్యూఢిల్లీ: ఇద్దరు సాధ్వీలపై అత్యాచార కేసులో 20 ఏళ్ళపాటు జైలులో ఉన్న గుర్మీత్ రామ్ రహీం దత్త పుత్రిక హనీప్రీత్‌కు చెందిన డైరీలో పలు ఆసక్తికర విషయాలు వెలుగు చూస్తున్నాయి. జాతీయ మీడియా ఛానల్ ఈ విషయాన్ని బయటపెట్టింది.
సుమారు 20 ఏళ్ల క్రితం, అంటే తన పెళ్లికి ఓ ఏడాది ముందు 1998లో ఆమె రాసుకున్న డైలీ ఒకటి లభ్యమైంది.ఈ డైరీలో హనీప్రీత్ కు చెందిన పలు నిజాలు ఉన్నాయని చెబుతూ, ఓ టీవీ చానల్ డైరీని చూపింది.

ఈ డైరీలో రాతలు ఆమె స్వయంగా రాసిందా? అన్న విషయమై స్పష్టత లేనప్పటికీ, తన పేరు ప్రియాంకా తనేజా ఉరఫ్ అను అని రాసుకుంది.
అను (ఏఎన్ యూ) అంటే అట్రాక్టివ్, నాటీ, ఆన్ఫార్చ్యునేట్లీ గర్ల్ అని రాసుకుంది. కాబోయే భర్త విశ్వాస్ గుప్తాను ప్రస్తావించింది. కాజోల్ ఫోటో అతికించుకుంది. అప్పటి సల్మాన్ చిత్రం 'జబ్ ప్యార్ కిసీసే హోతా హై' పోస్టర్ ను అతికించుకుంది.
రామ్ రహీంపై తన అభిమానాన్ని తెలుపుతూ ఓ గీతాన్ని రాసింది. కొన్ని కవితలు కూడా ఈ డైరీలో ఉన్నాయి. డైరీలోని మొత్తం 103 పేజీలు తమకు లభ్యమైనాయని సదరు చానల్ వెల్లడించింది.












Click it and Unblock the Notifications