ఇంటిలో ప్రియుడితో రోమాన్స్: యువతి ఫ్యామిలీ చూసింది: కత్తిరించి కాలువలో విసిరేశారు !

Posted By:
Subscribe to Oneindia Telugu

మొరాదాబాద్(ఉత్తరప్రదేశ్): యువతి తన లవర్ తో తిరుగుతున్న విషయం గుర్తించిన ఆమె కుటుంబ సభ్యులు సహనం కోల్పోయారు. తమకు ఇష్టం లేని యువకుడితో తిరగరాదని కుమార్తెను హెచ్చరించారు. అయితే ఆమె తల్లిదండ్రుల మాట లెక్కచెయ్యలేదు.

నాతో ఒక్క రాత్రి పడుకో: రూ. లక్షలు వద్దు, స్మగ్లర్ భార్య అందానికి, పోలీసు ఆఫీసర్ ఆఫర్ !

కుటుంబ సభ్యుల కళ్లుకప్పి ఆమె తనకు నచ్చిన యువకుడితో తిరగడం మొదలుపెట్టింది. చివరికి విషయం చెయ్యిదాటి పోతుందని తెలుసుకున్న ఆమె కుటుంబ సభ్యులు తెగించారు. పరువు కోసం ఎవ్వరూ చెయ్యని పని చేసి ఇప్పుడు జైలుపాలైన ఘటన ఉత్తరప్రదేశ్ లో జరిగింది.

యువతి యువకుడు !

యువతి యువకుడు !

మొరాదాబాద్ జిల్లాలోని ఠాకూర్ దావ్రా ప్రాంతంలో 20 ఏళ్ల కుసుమ్ అనే యువతి నివాసం ఉంటోంది. ఆమె అదే ప్రాంతంలోని 24 ఏళ్ల యువకుడితో ప్రేమలో పడింది. ఇద్దరూ కుటుంబ సభ్యుల కళ్లుకప్పి రహస్యంగా కలుసుకుంటున్నారు.

తెగించి ఇంటిలో ?

తెగించి ఇంటిలో ?

ఓ రోజు ఇంటిలో ఎవరూ లేరని, నువ్వు రావాలని కుసుమ్ తన ప్రియుడికి చెప్పింది. తరువాత అతను కుసుమ్ ఇంటికి వెళ్లాడు. ఇంటిలో ఏకాంతంగా గడుపుతున్న సమయంలో యువకుడి సోదరుడు ఇంటిలోకి వచ్చాడు. విషయం గుర్తించిన ప్రియుడు చాకచక్యంగా తప్పించుకుని పారిపోయాడు.

కుసుమ్ కు వార్నింగ్ !

కుసుమ్ కు వార్నింగ్ !

ఇంటికి వచ్చిన తండ్రి తౌఫిక్ కు తన కుమార్తె కుసుమ్ వేరే యువకుడితో తిరుగుతోందని కుమారుడు చెప్పడంతో సహనం కోల్పోయాడు. వెంటనే అతన్ని మరిచిపోవాలని, లేదంటే ప్రాణాలు తీస్తానని కుమార్తె కుసుమ్ ను హెచ్చరించాడు.

డోంట్ కేర్ అంటూ !

డోంట్ కేర్ అంటూ !

కుటుంబ సభ్యులు అందరూ హెచ్చరించినా కుసుమ్ మాత్రం మనసు మార్చుకోలేదు. తనకు నచ్చిన వాడితోనే తిరగడం మొదలు పెట్టింది. ఈ విషయం ఆ పరిసరప్రాంతాల వారికి తెలిసిపోవడంతో తౌఫిక్, అతని కుటుంబ సభ్యులు అవమానం జరిగిందని ఆవేదన చెందారు.

కుమార్తెను చంపేశారు !

కుమార్తెను చంపేశారు !

జూన్ 5వ తేదీన ఇంటిలో నిద్రపోతున్న కుమార్తె కుసుమ్ ను నరికి అతి దారుణంగా హత్య చేశారు. మృతదేహాన్ని తీసుకెళ్లి కమల్ పూరీ సమీపంలోని నదీ కాలువలో విసిరివేశారు. తన కుమార్తె కనపడటం లేదని, ఆమె ప్రియుడే చంపేసి ఉంటాడని తౌఫిక్ పోలీసులకు ఫిర్యాదు చేశారు.

కుసుమ్ మృతదేహం !

కుసుమ్ మృతదేహం !

పోలీసులు నదీ కాలువలో కుసుమ్ మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని ఆమె ప్రియుడిని అరెస్టు చేసి విచారణ చేశారు. పోలీసుల విచారణలో తాను కుసుమ్ ను హత్య చెయ్యలేదని, ఆమెను ప్రేమించానని, పెళ్లి చేసుకోవాలని నిర్ణయించానని జరిగిన స్టోరీ మొత్తం వివరించారు.

వేరు అమ్మాయిని రేప్ చేసి !

వేరు అమ్మాయిని రేప్ చేసి !

పోలీసులు కుసుమ్ తండ్రి తౌఫిక్ ను అదుపులోకి తీసుకుని విచారించగా అసలు విషయం చెప్పాడు. కుసుమ్ ప్రేమించిన యువకుడు గతంలో వేరే అమ్మాయిని రేప్ చేసి సంవత్సరం జైల్లో ఉండి బెయిల్ మీద బయటకు వచ్చాడని, అతన్ని తన కుమార్తె ప్రేమించడం జీర్ణించుకోలేకపోయానని అంగీకరించాడు.

పరువు హత్య !

పరువు హత్య !

బంధువులలో పరువు పోతోందని తామే నిద్ర పోతున్న కుసుమ్ ను హత్య చేశామని తౌఫిక్ అంగీకరించాడు. తౌఫిక్ తో పాటు కుసుమ్ తల్లి, ఆమె సోదరుడిని అరెస్టు చేశామని, యువకుడిని విడుదల చేశామని మొరాబాద్ జిల్లా ఎస్పీ మనోజ్ తివారి మీడియాకు చెప్పారు.

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
In yet another case of honour killing in Uttar Pradesh, an underage girl was killed by her family members in Thakurdwara district in Moradabad allegedly over her love affair with a person.
Please Wait while comments are loading...