నా ఉద్యమం నుంచి మరో కేజ్రీవాల్ పుట్టడు: అన్నా హజారే
న్యూఢిల్లీ: తన ఉద్యమం నుంచి మరో కేజ్రీవాల్ పుట్టుకు రారని సామాజిక ఉద్యమ నేత అన్నా హజారే అన్నారు. 2011లో హజారే చేపట్టిన అవినీతి వ్యతిరేక ఉద్యమంలో ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ కీలక ప్రాత పోషించిన విషయం తెలిసిందే.
అనంతరం కేజ్రీవాల్ ఉద్యమం నుంచి విడిపోయి రాజకీయాల్లోకి వచ్చారు. సామాన్యుల కోసమంటూ ఆమ్ ఆద్మీ పార్టీని స్థాపించారు. ఢిల్లీ సీఎం అయ్యారు. ఈ నేపథ్యంలో హజారే స్పందించారు.

తాజాగా ఆగ్రాలో జరిగిన ఓ సమావేశానికి హాజరయ్యారు. కేజ్రీవాల్‌పై విమర్శలు గుప్పించారు. ఇకపై తన ఉద్యమం నుంచి మరో కేజ్రీవాల్ పుట్టడని, ఆ నమ్మకం తనకుందన్నారు.












Click it and Unblock the Notifications