శాడిస్ట్ డాక్టర్: కుక్కను ఐదో అంతస్థు నుంచి....(వీడియో)
న్యూఢిల్లీ: ప్రస్తుతం ఓ భయంకరమైన వీడియో సోషల్ మీడియాలో బాగా షేర్ అవుతోంది. ఓ శాడిస్ట్ విశ్వాసానికి మారుపేరైన ఓ కుక్కను మేడపై నుంచి విసిరేసిన వీడియో ఫేస్‌బుక్, వాట్సప్‌లలో చక్కర్లు కొడుతోంది. ఈ దుర్మార్గుడిని గుర్తించాలంటూ పలువురు జంతు ప్రేమికులు సోషల్ మీడియా ద్వారా కోరుతున్నారు.
ఈ వీడియో వైరల్ కావడంతో కుక్కను విసిరేసిన ఆ వ్యక్తి ఎవరనేదానిపై పోలీసులు కూడా దృష్టి సారించారు. హృదయంలేని ఆ వ్యక్తిని కఠినంగా శిక్షించాలంటూ నెటిజన్లు డిమాండ్ చేస్తున్నారు.
అంత ఎత్తైన మేడపై నుంచి కుక్కును విసిరేయడం పలువురిని కలిచి వేసింది. అంత ఎత్తు నుంచి కిందపడటంతో ఆ కుక్క బతికిందో చనిపోయిందో కూడా తెలియదు. పలువురు జంతు ప్రేమికులు ఇంత దారుణంగా ప్రవర్తించిన సదరు వ్యక్తిని పట్టిస్తే నగదు రివార్డు ఇస్తామంటూ కూడా ప్రకటించారు.
సల్లీ కన్నన్ అనే ఇంటర్నేషనల్ హ్యూమన్ సొసైటీ ఔట్ రీచ్ కన్సల్టెంట్ సదరు వీడియోను షేర్ చేసి ఆ దుర్మార్గుడిని పట్టిస్తే రూ. లక్ష రివార్డును ప్రకటించారు.
ఆ దుర్మార్గుడు ఓ మెడికల్ విద్యార్థే
కాగా, ఈ వీడియోలో కుక్క పట్ల అమానవీయంగా ప్రవర్తించిన వ్యక్తిని గౌతమ్‌గా గుర్తించారు. అతడు ఓ మెడికల్ స్టూడెంట్ అని తెలిసింది. చెన్నైకి చెందిన ఇతడిపై నెటిజన్లు తీవ్ర స్థాయిలో విరుచుకుపడుతున్నారు.












Click it and Unblock the Notifications