అయ్యో.. కాలేజీకి వెళ్తున్న ఇంటర్ స్టూడెంట్ పై గ్యాంగ్ రేప్‌..

సమాజంలో రోజురోజుకూ మహిళలపై దాష్టీకాలు పెరిగిపోతునే ఉన్నాయి. చిన్నాపెద్దా అన్న తేడా లేకుండా కొన్ని మానవ మృగాలు ఇష్టం వచ్చినట్లు ప్రవర్తిస్తున్నాయి. ఆడపిల్ల అయితే చాలు అన్న విధంగా కొందరు మృగాళ్ల మాదిరి రెచ్చిపోతున్నారు. అయితే వావి వరసల్ని మరచి అత్యాచారాలకు పాల్పడుతున్న వారు మరోవైపు ఉన్నారు. తమ కామ వాంఛ తీర్చుకోవడం కోసం ఎన్నో కుటుంబాలను ఛిన్నాభిన్నం చేస్తున్నారు. మరోవైపు ప్రభుత్వాలు పోక్సో, నిర్భయ, దిశ లాంటి ఎన్ని కఠిన చట్టాలు తెచ్చినా.. కఠినంగా శిక్షించినా ఇలాంటి ఘటనలు మాత్రం ఇంకా పెరుగుతూనే ఉన్నాయి.

తాజాగా రాజస్థాన్ లోని బికనీర్ జిల్లాలో షాకింగ్ ఘటన జరిగింది. కాలేజీకి వెళ్తున్న ఓ యువతిపై కొందరు మృగాలు గ్యాంగ్ రేప్ కు పాల్పడ్డారు. జనవరి 6న జరిగిన ఈ విషాద ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. బాధితురాలి తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు పోలీసులు ఈ ఘటనపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

రాజస్థాన్ లోని బికనీర్ జిల్లాలోని నపాసర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని ఓ గ్రామానికి చెందిన ఇంటర్ చదివే యువతి రోజూ లాగే జనవరి 6 న కాలేజీకి వెళ్లింది. అయితే యువతి కాలేజీకి వెళ్తుండగా ఇద్దరు యువకులు వచ్చి ఆమెను బలవంతంగా తమ కారులో ఎక్కించుకున్నారు. అలా కొన్ని గంటలపాటు కారులో అటూ ఇటూ తిరుగుతూ ఆమెపై అత్యాచారానికి పాల్పడ్డారు. అలా కారు ఓ గ్రామంలోకి సమీపించిన నేపథ్యంలో ఆ గ్రామస్థులు అనుమానం వచ్చి ఆపారు.

Horror in Bikaner Intermediate Girl Gang-Raped on Way to College in Rajasthan

దీంతో కారులోంచి ఆ యువతిని బయటకు నెట్టేసి అక్కడి నుంచి ఆ ఇద్దరు యువకులు పారిపోయారు. యువతి ఇచ్చిన సమాచారం మేరకు గ్రామస్థులు యువతి కుటుంబానికి సమాచారం ఇచ్చారు. బాధితురాలి కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు పోలీసులు జనవరి 11 న కేసు నమోదు చేసుకున్నారు. ప్రస్తుతం నిందితుల కోసం గాలింపు చర్యలు చేపట్టారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+