Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

Income Tax: ఆదాయపు పన్నుపై సోషల్ మీడియాలో హాట్ డిబేట్.. భారీగా పేలుతున్న మాటల తూటాలు

Viral post: సోషల్ మీడియాని ఎంటర్‌టైన్‌మెంట్‌లా చూసేవారు కొందరున్నారు. అయితే మరికొందరు తమకు జరిగుతున్న అన్యాయాన్ని ప్రశ్నించడానికి ఓ ఆయుధంగా వాడుతున్నారు. సామాజిక సమస్యలపై ఇతరులకు అవగాహన పెంచడంలో, నలుగురికీ జ్ఞానం పంచడంలో సోషల్ మీడియా కీలక పాత్ర పోషిస్తోంది. యాప్‌లో సమస్యను లేవనెత్తితే రోజుల తరబడి స్పందించని కొన్ని సంస్థలు.. సోషల్ మీడియా హ్యాండిల్స్‌లో వెంటనే సమాధానం ఇస్తున్నాయంటే దాని పవర్ ఏంటో ఇట్టే అర్థం చేసుకోవచ్చు.

నవీన్ కొప్పరం అనే సోషల్ మీడియా వినియోగదారుడు సగటు భారతీయుడు ఎదుర్కొంటున్న సమస్యపై X వేదికగా ఓ పోస్ట్ చేశారు. అదికాస్తా ఇప్పుడు నెట్టింట వైరల్‌గా అవుతోంది. తన ఇంటి దగ్గరల్లో ఉండే ఓ దోశ విక్రయదారుడు రోజుకు 20 వేల కంటే ఎక్కువ సంపాదిస్తున్నాడని తెలిపారు. అంటే నెలకు దాదాపు 6 లక్షలు తన ఆదాయం అని వెల్లడించారు. అందులో నుంచి అతనికయ్యే ఖర్చులు తీసివేసిన తర్వాత కూడా నెలకు సుమారు 3 నుంచి 3.5 లక్షలు ఆర్జిస్తున్నాడన్నారు.

Hot debate in social media about no income tax to Dosa vendor

'ఆ రేంజ్‌లో సంపాదిస్తున్నప్పటికీ ఒక్క రూపాయి కూడా ఆదాయపు పన్ను చెల్లించడు' అని చెప్పి ఒక్కసారిగా అందరినీ ఆలోచించచేశారు. ఇది దేశంలోని ఆదాయపు పన్ను నిబంధనల గురించి తీవ్ర చర్చకు దారితీసింది. దీంతో విక్రేతలు మరియు వేతన జీవుల ప్రయోజనాల గురించి పెద్ద డిబేట్‌ జరుగుతోంది. నెలకు 60 వేలు సంపాదించే ప్రైవేట్ సంస్థ ఉద్యోగి 10 శాతం ట్యాక్స్ పే చేయడం, నెలకు 3 లక్షలు ఆర్జించినా దోశ విక్రేత ఏమాత్రం పన్ను చెల్లించకపోవడం పట్ల దుమారం చెలరేగింది.

ఈ క్రమంలో మరో వినియోగదారుడు ఇంకో విషయాన్ని లేవనెత్తడం జరుగుతున్న డిబేట్‌కి మరింత ఆజ్యం పోసింది. 'దోశ విక్రేతను పక్కన పెడితే డాక్టర్లు, లాయర్లు మరియు గ్యారేజీల సంగతి ఏమిటి? వారిలో చాలామంది విదేశాలకు సైతం వెకేషన్స్‌కు వెళతారు, భారీ ఇళ్లను నిర్మించుకుంటారు మరియు ఏటా కొత్త వాహనాన్ని కొనుగోలు చేస్తారు. అయినప్పటికీ పన్నులు చెల్లించరు. ఎలా మరియు ఎందుకు?' అని ప్రశ్నించడంతో పలువురు తమదైన శైలిలో కామెంట్స్ వర్షం కురిపిస్తున్నారు.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+