180 హోటల్ బిల్లు.. కస్టమర్‌ను చంపిన యజమాని
లక్నో : మనుషులు మనీ చుట్టూ తిరుగుతున్నారు. డబ్బు కోసం ఎంతకైనా తెగిస్తున్నారు. కోట్లు కాదు లక్షలు కాదు.. కేవలం వందల రూపాయల కోసం ప్రాణాలు తీస్తున్న ఘటనలు వెలుగుచూస్తున్నాయి. అదే కోవలో కేవలం 180 రూపాయల కోసం మర్డర్ జరిగిన ఘటన కలకలం రేపుతోంది.
ఉత్తరప్రదేశ్‌లోని బాదోహీ జిల్లాలో దారుణం చోటు చేసుకుంది. హోటల్‌లో 180 రూపాయల బిల్లు చెల్లించలేదని కస్టమర్‌ను హత్య చేసిన ఘటన వెలుగు చూసింది. విశాల్ దూబే, సూరజ్ అనే ఇద్దరు యువకులు స్నేహితులు. తరచుగా వీరిద్దరు హోటల్‌కు వెళ్లి భోజనం చేస్తుంటారు. అదే క్రమంలో బుధవారం నాడు కూడా అలాగే ఓ హోటల్‌కి వెళ్లారు.

భోజనం చేసిన తర్వాత వెయిటర్ 180 రూపాయల బిల్లు తీసుకొచ్చాడు. అయితే బిల్లు విషయంలో సదరు హోటల్ యజమాని గుర్మల్ సింగ్‌తో వీరిద్దరికి వాగ్వాదం జరిగింది. అయితే చిన్న విషయానికే హోటల్ యజమాని సీరియస్‌గా తీసుకున్నట్లు తెలుస్తోంది. ఆ క్రమంలో హోటల్‌లో పనిచేసే కొందరు యువకులు.. వీరిద్దరిపై దాడికి దిగారు. ఇనుప రాడ్లతో తీవ్రంగా కొట్టారు. విశాల్ తప్పించుకోగా.. సూరజ్‌కు మాత్రం తీవ్ర గాయాలయ్యాయి.
కేవలం 180 రూపాయల కోసం జరిగిన గొడవ ముదిరి చివరకు ప్రాణాల మీదకు తెచ్చింది. తీవ్ర గాయాల పాలైన సూరజ్ చికిత్స పొందుతూ ఆసుపత్రిలో కన్నుమూశాడు. ఈ ఘటనపై లోకల్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. హోటల్ యజమాని గుర్మల్ సింగ్‌తో పాటు ఆయన కొడుకు సురేంద్ర సింగ్‌ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. మరో ఇద్దరు నిందితుల కోసం గాలింపు ముమ్మరం చేశారుజ
-
సికింద్రాబాద్ స్టేషన్ సిద్దం, ప్రధాని మోదీ ప్రారంభం - ముహూర్తం ఫిక్స్..!! -
తెలంగాణ నుంచి తిరుపతి వెళ్లే వారికి గుడ్ న్యూస్.. అందుబాటులోకి కొత్త ఎన్ హెచ్ 565 -
బంగారం ధరలు అధోగతి- కనీవినీ ఎరుగనంత పతనం -
PM Modi: అన్నింటికీ సిద్దం అయిపోండి..! ప్రధాని మోడీ షాకింగ్ పిలుపు..! -
సికింద్రాబాద్- విశాఖ ఎక్స్ ప్రెస్ ఇక విజయవాడ వెళ్లదు- డైవర్షన్ రూట్ -
ప్రతీ ఇంటికీ రెండు ఫ్రీ గ్యాస్ సిలెండర్లు-ఇరాన్ వార్ వేళ సర్కార్ ఆఫర్..! -
రైతు భరోసా నిధులు జమ కాలేదా, ఇలా చేయండి- వెంటనే..!! -
మకరరాశి వార్షిక జాతకం ఇలా.. ఈ ఏడాది విశేష లాభాలు! -
ఏపీలో ఉద్యోగులకు సర్కార్ గుడ్ న్యూస్..! ఇకపై ఈ మార్పు..! -
తమిళనాడులో సీన్ రివర్స్-తాజా సర్వేలో హోరాహోరీ-ఎడ్జ్ మాత్రం..! -
విజయ్‌కు షాకిచ్చిన సర్వే!: ఆ పార్టీకి 180+ సీట్లు -
ధనుస్సు రాశి, మకర రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం












Click it and Unblock the Notifications