Wife: ఉద్యోగానికి వెళ్లిన ఫస్ట్ భార్య, ఇంట్లో శవమై కనిపించిన భర్త, రెండో భార్య !
చెన్నై/ తిరువళ్లూరు: వివాహం చేసుకున్న వ్యక్తికి భార్య ఇద్దరు పిల్లలు ఉన్నారు. కొన్ని సంవత్సరాలు భార్యతో అతను సంతోషంగా కాపురం చేశాడు. తరువాత మరో మహిళను లవ్ మ్యారేజ్ చేసుకున్నాడు. ఇద్దరు భార్యల ముద్దుల మొగుడు ఫుల్ హ్యాపీగా ఎంజాయ్ చేస్తున్నాడు. ఇద్దరు భార్యలు, పిల్లలతో కలిసి ఒకే ఇంటిలో కాపురం పెట్టాడు. మొదటి భార్య ఉద్యోగానికి వెళ్లింది, పిల్లలు స్కూల్ కు వెళ్లారు. సాయంత్రం ఇంటి తలుపులు తీసి చూస్తే భర్త, అతని రెండో భార్య ఇంట్లో శవమై కనిపించారు. రెండో భార్య చేతులు వెనక్కి కట్టేసి శవమై కనిపించడం, భర్త ఫ్యాన్ కు వేలాడుతూ కనిపించడం కలకలం రేపింది.

భార్య, పిల్లలు
తమిళనాడులోని తిరువళ్లూరు జిల్లాలోని పూనమల్లి సమీపంలోని క్వీన్ విక్టోరియా రోడ్డులోని అంబుల్ ఏరియాలో పాండియన్ (40) అనే వ్యక్తి నివాసం ఉంటున్నాడు. కొన్ని సంవత్సరాల క్రితం భువనేశ్వరి అనే యువతిని పాండియన్ వివాహం చేసుకున్నాడు. పాండియన్, భువనేశ్వరి దంపతులకు ఇద్దరు పిల్లలు ఉన్నారు.

లవ్ చేసి సెకండ్ మ్యారేజ్
భువనేశ్వరిని వివాహం చేసుకున్న తరువాత ఆమెతో సంతోషంగా కాపురం చేస్తున్న పాండియన్ కొన్ని సంవత్సరాల తరువాత పరిమల అనే మహిళను ప్రేమించి ఆమెను లవ్ మ్యారేజ్ చేసుకున్నాడు. మొదటి భార్య భువనేశ్వరితో, పరిమలతో పాండియన్ సంతోషంగా కాపురం చెయ్యడం మొదలుపెట్టాడు.

ఒకే ఇంటిలో ఇద్దరు భార్యలు
పాండియన్ అతని ఇద్దరు భార్యలు భువనేశ్వరి, పరిమల, ఇద్దరు భార్యల పిల్లలతో కలిసి ఒకే ఇంటిలో కాపురం పెట్టాడు. భువనేశ్వరి ఉద్యోగం చేస్తోంది. ఉదయం భువనేశ్వరి ఉద్యోగానికి వెళ్లింది. అంతకు ముందే భువనేశ్వరి, పరిమల పిల్లలు స్కూల్ కు వెళ్లిపోయారు. ఇంట్లో పాండియన్, అతని రెండో భార్య పరియల మాత్రమే ఉన్నారు.

ఇంట్లో శవాలైన దంపతులు
సాయంత్రం స్కూల్ నుంచి పిల్లలు ఇంటికి వెళ్లారు. ఆ సందర్బంలో పాండియన్, అతని రెండో భార్య పరిమల ఇద్దరూ శవాలై కనిపించారు. పరిమల రెండు చేతులు వెనక్కి కట్టేసిన స్థితిలో శవమై కనిపించింది. పాండియన్ కూడా ఫ్యాన్ కు వేలాడుతూ శవమై కనిపించాడు. రెండో భార్య పరిమలను హత్య చేసిన పాండియన్ ఆత్మహత్య చేసుకున్నాడా ?, ఇద్దరిని ఎవరైనా హత్య చేశారా ? అని ఆరా తీస్తున్నామని పోలీసు అధికారులు తెలిపారు.
-
వంట గ్యాస్ బుక్ చేసినా రావటం లేదా, ఇలా చేయండి.. వెంటనే..!! -
హిట్ కొట్టాడురా సామీ!.. మిస్టరీ థ్రిల్లర్ అదిరిపోయింది..! -
ఈ సినిమా చూస్తే ఈఎంఐల జోలికే పోరు సామి! -
today rashiphalalu: మీనరాశిని వదిలిపెట్టని ముఖ్యగ్రహాలు.. వీరి పంట పండుతుంది! -
హైదరాబాద్ జూపార్క్ లో వింత జంతువు.. భారీగా తరలివస్తున్న పర్యటకులు -
మెగాస్టార్ కొత్త మూవీ షూటింగ్ షురూ.. క్లాప్ కొట్టిన పవన్ !! -
‘బాహుబలి2’, ‘పుష్ప2’లో నిజమైన ఇండస్ట్రీ హిట్ ఏది? -
కాచిగూడ మీదుగా తిరుపతికి వెళ్లే మరో ప్రత్యేక రైలు.. ఇకపై: ఏపీలో హాల్ట్ స్టేషన్లు -
అమెరికన్ కరెన్సీ ఇకపై.. !! -
సమ్మర్ స్పెషల్ 'పెసరపప్పు చారు'.. ఇదొక్కటి యాడ్ చేస్తే టేస్ట్ అద్దిరిపోద్ది..! -
వంట గ్యాస్ ఇక బుక్ చేయాలంటే, ఇలా తప్పనిసరి - తాజా మార్గదర్శకాలు..!! -
రామ్చరణ్ నా ప్రాణం కంటే ఎక్కువ: అల్లు అర్జున్












Click it and Unblock the Notifications