అందమై గృహిణి ఇంటి ముందే కిడ్నాప్, వేశ్యవాటికకు విక్రయించడానికి ప్రయత్నించి!

Posted By:
Subscribe to Oneindia Telugu

మైసూరు: అందమైన గృహిణిని కిడ్నాప్ చేసి వేశ్యవాటిక కేంద్రంలో విక్రయించడానికి ప్రయత్నించిన ముగ్గురు ముఠా సభ్యులను కర్ణాటక పోలీసులు అరెస్టు చేశారు. మైసూరు సమీపంలోని హణసూరు తాలుకా టిప్పునగర్ నివాసి సయ్యద్, మధు, రవి అనే నిందితులను అరెస్టు చేశామని పోలీసులు అన్నారు.

హుణసూరు తాలుకా రామేనహళ్ళిలో 25 ఏళ్ల అందమైన గృహిణి నివాసం ఉంటున్నది. సంవత్సరం క్రితమే ఈమెకు పెళ్లి అయ్యింది. అందమైన గృహిణిని కిడ్నాప్ చేసి వేశ్యవాటిక కేంద్రంలో విక్రయిస్తే రూ. లక్షలు ఇస్తారని, మనం జల్సా చెయ్యవచ్చని సయ్యద్, రవి, మధు ప్లాన్ వేశారు.

రెండు రోజుల క్రితం గృహిణి ఇంటి ముందు పని చేసుకుంటున్న సమయంలో కారులో వెళ్లిన నిందితులు చాకచక్యంగా ఆమెను కిడ్నాప్ చేసి పారిపోయారు. విషయం తెలుసుకున్న ఆమె భర్త, గ్రామస్తులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు నిందితుల కోసం గాలించారు.

Housewife kidnap and tried to sell three were arrested in Mysuru

మహిళను ఓ ఇంటిలో నిర్బంధించిన నిందితులు ఆమెను వేశ్యవాటిక కేంద్రంలో విక్రయించడానికి బేరం మాట్లాడుకుంటున్నారు. పోలీసులకు అనుమానం రావడంతో నిందితులను అదుపులోకి తీసుకుని బెండ్ తియ్యడంతో అసలు విషయం తెలిసింది.

బాధితురాలు ఉన్న ఇంటిని గుర్తించిన పోలీసులు ఆమెను రక్షించి కుటుంబ సభ్యులకు అప్పగించారు. ఇంతకు ముందు ఎంత మంది మహిళలను వీరు కిడ్నాప్ చేసి వేశ్యవాటిక కేంద్రాల్లో విక్రయించారు ? అనే విషయం తెలుసుకోవడానికి పోలీసులు విచారణ ముమ్మరం చేశారు. కర్ణాటకలో మహిళల మిస్సింగ్ కేసులు ఏమైనా ఉన్నాయా ? ఆని ఆరా తీస్తున్నారు.

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
House wife kidnap and tried to sell Three were arrested near Mysuru in Karnataka.
Please Wait while comments are loading...