షాక్: ఐటీ హబ్స్‌లో తగ్గిన ఇంటి అద్దెలు, ఎందుకంటే?
ఐటీ కంపెనీల్లో నియామకాలు తగ్గిపోవడం, వేతన పెంపు ఆగిపోవడం ఇటు టెక్కీలకు మాత్రమేకాక, ఇంటి యజమానులకు ప్రతికూల పరిస్థితులను తెచ్చిపెడుతున్నాయి.
బెంగుళూరు: ఐటీ కంపెనీల్లో నియామకాలు తగ్గిపోవడం, వేతన పెంపు ఆగిపోవడం ఇటు టెక్కీలకు మాత్రమేకాక, ఇంటి యజమానులకు ప్రతికూల పరిస్థితులను తెచ్చిపెడుతున్నాయి.
ఇండస్ట్రీలో నెలకొన్న అనిశ్చిత పరిస్థితుల నేపథ్యంలో ఐటీ హబ్స్‌లోని ఇంటి యజమానులు అద్దెలను తగ్గించేస్తున్నారు. బెంగుళూరు, హైద్రాబాద్, చెన్నై, పూణే, నోయిడా, గుర్గావ్, ఎన్‌సీఆర్ ప్రాంతాల్లోని ఐటీ హబ్‌లలో వచ్చే మూడు క్వార్టర్‌లలో ఇంటి అద్దెలు భారీగా తగ్గే అవకాశం ఉందని అసోచామ్ అంచనావేస్తోంది.
ఈ తగ్గింపు ఎక్కువగా పూణెలో 20శాతానికిపైగా ఉంటుందని అధ్యయన నివేదిక వెల్లడించింది. బెంగుళూరుచ చెన్పై, హైదరాబాద్ ప్రాంతాల్లో మున్ముందు కాలంలో ఇళ్ళ అద్దెలు 10నుండి 15 శాతం తగ్గిపోనున్నాయి.

పూణెలో ఎక్కువగా 20 శాతానికిపైగా తగ్గనున్నాయి. అదేవిధంగా గుర్గావ్, నోయిడాలో కూడ ఇదే పరిస్థితి నెలకొంటుందని అసోచామ్ అధ్యయన నివేదిక ప్రకటించింది. బెంగుళూర్‌లోని ఇంటి యజమానాలు సిలికాన్ వ్యాలీకి ఉన్నంతపేరు ఉంది. అద్దెలు తగ్గిసతూ మంచి పౌకర్యాలతో అద్దెదారులను ఆకట్టుకొనేందుకు ప్రయత్నిస్తున్నారు.
నెలకు రూ.50వేలకంటే ఎక్కువగా చెల్లించేవారికి అన్నిరకాల సదుపాయాలు అందిస్తున్నామన్నారు. రానున్నకాలంలో ప్రతి ఏటా వేలకొద్ది ఉద్యోగులను ఐటీ సంస్థలు నియమించుకొనేవి. ఆ నియామకాల ప్రకారంగా బెంగుళూర్‌లో అద్దె ఇళ్ళకు డిమాండ్ భారీగా పెరిగేది.
నెట్‌బేసిస్‌లో కంపెనీలు ఉద్యోగులను నియమించుకొంటున్నప్పటికీ అంత ఆకర్షణీయంగా లేవని అధ్యయన నివేదిక తెలిపింది. 30 నుండి 45 ఏళ్ళ మధ్య వయస్సున్న ఐటీ, ఐటీ ఎనాబుల్ సర్వీసుల ఫ్రోఫెషనల్స్ వేతనం సగటున వార్షికంగా 20 లక్షల నుండి 50 లక్షలుంటే, వారు అద్దెలు రూ.50 వేల నుండి రూ.రూ1.15 లక్షల వరకు చెల్లిస్తున్నారు.
రూ.15 వేల నుండి రూ.16 వేల మధ్యలో కూడ అద్దెలున్నాయన్నారు. ఈ అన్ని సెగ్మెంట్లలో అద్దెలు తగ్గిపోయే అవకాశాలున్నాయని ఆ నివేదిక వెల్లడించింది.












Click it and Unblock the Notifications