బ్రిజ్ భూషణ్ పై బీజేపీ ప్రేమ వెనుక ఆ సాయం? గోవాలో అధికారం ఇప్పించిన ఘనుడు!
మహిళా రెజ్లర్లపై లైంగిక వేధింపుల ఆరోపణలు ఎదుర్కొంటున్న భారత రెజ్లింగ్ సమాఖ్య అధ్యక్షుడు బ్రిజ్ భూషణ్ శరణ్ సింగ్ ను ఆ పదవి నుంచి తప్పించాలనే ఒత్తిడి అంతకంతకూ తీవ్రమవుతోంది. అయినా కేంద్రం మాత్రం ఆ ఒక్క నిర్ణయం తీసుకోలేకపోతోంది.
ముఖ్యంగా బీజేపీ పెద్దలను కాదని బ్రిజ్ భూషణ్ శరణ్ సింగ్ ను రెజ్లింగ్ సమాఖ్య పదవి నుంచి తప్పించడం సాధ్యమయ్యేలా లేదు. ఢిల్లీలో మహిళా రెజ్లర్ల నిరసనతో బీజేపీ పరువు పోతున్నా బ్రిజ్ భూషణ్ ను మాత్రం తప్పించేందుకు కేంద్రం సిద్ధం కాకపోవడం వెనుక పెద్ద కారణమే ఉంది మరి..

2017లో గోవా అసెంబ్లీకి జరిగిన ఎన్నికల్లో అధికారంలో ఉన్న బీజేపీ ఓడిపోయింది. ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ అత్యధిక సీట్లు గెల్చుకుంది. దీంతో మహారాష్ట్రకు పొరుగున కీలకమైన గోవా చేజారిపోయిందన్న బాధలో బీజేపీ అధిష్టానం ఉంది. ఆ సమయంలో యూపీలో బీజేపీ ఎంపీగా ఉన్న బ్రిజ్ భూషణ్ శరణ్ సింగ్ రంగంలోకి దిగాడు. గోవాలో బీజేపీకి ఎక్కువ సీట్లు రాకపోయినా దగ్గరుండి అధికారం ఇప్పించాడు. ఈ మ్యాజిక్ వెనుక ఏం జరిగిందనేది ఇప్పటికీ బీజేపీకి గుర్తుంటుంది.
2017లో జరిగిన గోవా ఎన్నికల్లో బీజేపీకి 13, కాంగ్రెస్ కు 17 సీట్లు వచ్చాయి. దీంతో కాంగ్రెస్ ఇతర పార్టీలతో కలిసి ప్రభుత్వ ఏర్పాటు చేస్తుందని అంతా భావించారు. కానీ అలా జరగలేదు. మూడు ఎమ్మెల్యే సీట్లు గెల్చుకున్న స్ధానిక పార్టీ జీఎఫ్పీ అధినేతగా ఉన్న విజయ్ సర్దేశాయ్ అప్పటికే గోవాలోని ప్రోగ్రెసివ్ రెజ్లింగ్ అసోసియేషన్ కు ఛీఫ్ గా ఉన్నారు. దీంతో రెజ్లింగ్ సమాఖ్య అధ్యక్షుడిగా ఉన్న బ్రిజ్ భూషణ్ సర్దేశాయ్ ను బీజేపీకి మద్దతిచ్చేలా ఒప్పించగలిగారు.

అప్పటివరకూ అమిత్ షా, గడ్కరీ వంటి వారు ఎంత ఒత్తిడి తెచ్చినా అంగీకరించని సర్దేశాయ్.. బ్రిజ్ భూషణ్ మాట్లాడటంతో బీజేపీకి మద్దతిచ్చేందుకు ఒప్పుకున్నారు. దీంతో గోవాలో కాంగ్రెస్ ను వెనక్కి నెట్టి, మరో మిత్రపక్షం మహారాష్ట్రవాదీ గోమంతక్ పార్టీ సాయంతో బీజేపీ ప్రభుత్వం ఏర్పాటు చేసింది.
అయితే ఈ ఆపరేషన్ లో ట్విస్ట్ ఏంటంటే అప్పట్లో బ్రిజ్ భూషణ్ బీజేపీ ప్రభుత్వ ఏర్పాటులో ఎలా కీలకంగా మారారన్నది ఆ పార్టీలో కింది స్ధాయిలో ఉన్న వారికి సైతం తెలియదు. తాజాగా ఆన్ లైన్ వెబ్ సైట్ "ది ప్రింట్" అడిగితే బీజేపీ గోవా అధ్యక్షుడు అయిన సదానంద్ తనవాడే ఈ విషయం చెప్పారు. సర్దేశాయ్ మాత్రం అప్పుట్లో మనోహర్ పారికర్ సీఎం అవుతున్నందునే తాను బీజేపీకి మద్దతిచ్చినట్లు తెలిపారు. కాంగ్రెస్ నేతలు మాత్రం బ్రిజ్ భూషణ్-సర్దేశాయ్ ఒప్పందాన్ని నిర్ధారించారు.












Click it and Unblock the Notifications