సూపర్ టేస్టీ 'మామిడికాయ పులిహోర'.. ఇదొక్కటి యాడ్ చేస్తే టేస్ట్ అదుర్స్..!
ప్రస్తుతం వేసవి సీజన్ లో మామిడిపండ్లు ఎక్కడపడితే అక్కడ కనిపిస్తుంటాయి. అటు మామిడి పండ్లతో పాటు పచ్చి మామిడి కాయలు కూడా అధికంగా కొనుగోలు చేస్తుంటారు. పచ్చి మామిడికాయతో పప్పు, పచ్చడి చేసుకోవడం చాలామందికి అలవాటే.. కానీ మామిడికాయతో పులిహోర కూడా చాలా టేస్టీగా ఉంటుంది. అయితే మామిడికాయ పులిహోర అందరికీ సరిగ్గా రాదు. చాలామందికి పులుపుగానో లేక చప్పగానో వస్తుంది. అయితే ఫర్ ఫెక్ట్ కొలతలతో మామిడికాయ పులిహోర చేస్తే ఆ టేస్ట్ చాలా అద్భుతంగా ఉంటుంది. మరి సూపర్ టేస్టీ మామిడికాయ పులిహోరను ఎలా తయారు చేసుకోవాలి..? కావాల్సిన పదార్థాలు ఏంటి..? తక్కువ పదార్థాలతో ఈ వంటకాన్ని ఎలా తయారు చేసుకోవాలి..? తదితర పూర్తి వివరాలు ఇక్కడ చూద్దాం..
మామిడికాయ పులిహోర తయారీకి కావాల్సిన పదార్థాలు చూస్తే.. బియ్యం రెండు కప్పులు, మామిడికాయ తురుము ఒక కప్పు, పల్లీలు పావు కప్పు, మినప్పప్పు ఒక టేబుల్ స్పూన్, శనగపప్పు ఒక టేబుల్ స్పూన్, ఆవాలు ఒక టీ స్పూన్, జీలకర్ర ఒక టీ స్పూన్, పసుపు పావు టీ స్పూన్, ఎండు మిర్చి ఆరు నుంచి ఎనిమిది, కరివేపాకు ఒక రెప్ప, కరివేపాకు ఒక రెబ్బ, ఇంగువ పావు టీ స్పూన్, నూనె నాలుగు టేబుల్ స్పూన్ లు, ఉప్పు తగినంత తీసుకోవాలి.
మామిడికాయ పులిహోర తయారీ విధానం చూస్తే ముందుగా బియ్యం ఉడికించుకోవాలి. బియ్యాన్ని శుభ్రంగా కడిగి మొత్తగా కాకుండా ఉడికించుకోవాలి. ఆ తర్వాత చల్లారనివ్వాలి. కడాయిలో నూనె వేడి చేసి ఆవాలు, జీలకర్ర, మినప్పప్పు, శనగపప్పు, పల్లీలు వేసి బంగారు రంగు వచ్చేంత వరకూ వేయించుకోవాలి. ఇప్పుడు ఎండుమిరపకాయలు, కరివేపాకు, ఇంగువ వేసి కొద్దిగా వేయించుకోవాలి. ఆ తర్వాత తరిగిన మామిడికాయ, పసుపు, ఉప్పు వేసి మూతపెట్టి రెండు నుంచి మూడు నిమిషాలు మరిగించుకోవాలి.

ఇప్పుడు చల్లారిన బియ్యాన్ని అందులో వేసి బాగా కలపాలి. అలా తక్కువ మంటపై మూడు నుంచి నాలుగు నిమిషాలు ఉంచాలి. ఇప్పుడు అన్నీ బాగా కలిసిన తర్వాత స్టవ్ ఆఫ్ చేయాలి. అంతే ఘుమఘుమలాడే మామిడికాయ పులిహోర రెడీ అయినట్టే..












Click it and Unblock the Notifications