అర్ధరాత్రి ఫోన్ కాల్.. యుద్ధంపై ట్రంప్ కు నెతన్యాహు డెడ్లీ కండిషన్స్!

సుదీర్ఘ కాలంగా తీవ్ర ఉద్రిక్తతలకు కారణమవుతున్న ఇరాన్ వివాదానికి ముగింపు పలికే దిశగా అమెరికా, ఇరాన్ దేశాల మధ్య ఒక వ్యూహాత్మక అవగాహన ఒప్పందం (MOU) రూపుదిద్దుకుంటోంది. ఈ తాజా పరిణామాలపై ఇజ్రాయెల్ ప్రధానమంత్రి బెంజమిన్ నెతన్యాహు స్పందించారు. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌తో ఫోన్‌లో మాట్లాడిన నెతన్యాహు.. ఇరాన్‌తో చర్చల ప్రక్రియను ముందుకు తీసుకెళ్లేందుకు సిద్ధమవుతున్న ఈ అవగాహన ఒప్పందాన్ని స్వాగతించారు. అమెరికా తీసుకుంటున్న ఈ చొరవపై ఆయన అభినందనలు వ్యుక్తం చేశారు.

ఈ అవగాహన ఒప్పందంలో ఇజ్రాయెల్ నేరుగా భాగస్వామి కాకపోయినప్పటికీ, ఇజ్రాయెల్ రక్షణకు సంబంధించిన కీలక అంశాలను ఇందులో చేర్చడంపై నెతన్యాహు హర్షం వ్యక్తం చేశారు. చర్చల ముగింపులో కుదిరే తుది ఒప్పందంలో ఇరాన్ వద్ద ఉన్న సమృద్ధ యురేనియం (Enriched Material) తొలగింపు, క్షిపణుల తయారీపై ఆంక్షలు, ఇరాన్ అణు మౌలిక సదుపాయాల పూర్తిగా రద్దు చేయడం వంటి అంశాలు ఉండాలని ట్రంప్ స్పష్టం చేయడాన్ని నెతన్యాహు కొనియాడారు. వీటితో పాటు మధ్యప్రాచ్యంలో ఉగ్రవాద ప్రాక్సీ సంస్థలకు ఇరాన్ అందిస్తున్న మద్దతును పూర్తిగా నిలిపివేయాలనే నిబంధనను కూడా ఈ ఒప్పందంలో చేర్చడంపై ఇజ్రాయెల్ ప్రధాని కార్యాలయం ఒక ట్వీట్ ద్వారా సంతోషం వ్యక్తం చేసింది.

Trump Talks To Netanyahu On Great Iran Settlement Deal Strait Of Hormuz To Reopen Post Signed Treaty
మోదీ నా ఫ్రెండే.. గతంలో భారత్ మమ్మల్ని వాడుకుంది!: ట్రంప్
మోదీ నా ఫ్రెండే.. గతంలో భారత్ మమ్మల్ని వాడుకుంది!: ట్రంప్

తెరుచుకోనున్న హార్ముజ్ జలసంధి

అంతకుముందు అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మాట్లాడుతూ.. ఇరాన్‌తో వివాదానికి ముగింపు పలికే ఒక 'గొప్ప పరిష్కారం' లభించిందని, ఒప్పందం దాదాపు ఖరారైందని ప్రకటించారు. ఐరోపాలో జరిగే ఈ చారిత్రాత్మక ఒప్పంద సంతకాల కార్యక్రమానికి అమెరికా తరఫున వైస్ ప్రెసిడెంట్ జేడీ వాన్స్ హాజరవుతారని తెలిపారు. ఈ ఒప్పందంపై సంతకాలు పూర్తి కాగానే, అంతర్జాతీయ వాణిజ్యానికి అత్యంత కీలకమైన 'స్ట్రెయిట్ ఆఫ్ హార్ముజ్' (హార్ముజ్ జలసంధి) అధికారికంగా తిరిగి తెరుచుకుంటుందని ట్రంప్ ఆశాభావం వ్యక్తం చేశారు.

నెతన్యాహు నరమేధం: 31 మంది మృతి, హమాస్ కొత్త చీఫ్ ఖతం
నెతన్యాహు నరమేధం: 31 మంది మృతి, హమాస్ కొత్త చీఫ్ ఖతం

అవన్నీ కేవలం ఊహాగానాలేనన్న ఇరాన్!

అయితే, ఒప్పందం పూర్తిగా ఖరారైందన్న అమెరికా ప్రకటనలను ఇరాన్ విదేశాంగ శాఖ తోసిపుచ్చింది. అమెరికాతో తుది ఒప్పందం కుదిరిందంటూ వస్తున్న వార్తలు కేవలం 'ఊహాగానాలు' మాత్రమేనని ఇరాన్ విదేశాంగ మంత్రిత్వ శాఖ ప్రతినిధి ఎస్మాయిల్ బఘేయ్ స్పష్టం చేశారు. చర్చల విషయంలో మొదటి నుండి తాము స్పష్టమైన వైఖరితోనే ఉన్నామని, మెజారిటీ టెక్స్ట్ కూడా సిద్ధమైందని.. కానీ అమెరికానే పదే పదే తన నిర్ణయాలను మారుస్తూ వస్తోందని ఆయన ఆరోపించారు. ప్రస్తుతానికైతే తాము ఈ ఒప్పందంపై ఎలాంటి తుది నిర్ణయం తీసుకోలేదని ఇరాన్ స్పష్టం చేయడంతో ఈ ఒప్పందం ఎంతవరకు ముందుకు సాగుతుందనేది ఆసక్తికరంగా మారింది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+