వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఎట‌కారం అట‌కెక్క‌..! మ‌ర్రి చెట్టుకి రావి చెట్టుకి పెళ్లి.. ! 2వేల మంది అతిధులు..!!

|
Google Oneindia TeluguNews

కోల్‌కతా/హైద‌రాబాద్ : కొంద‌రు చేసే కొన్ని ప‌నులు చూస్తుంటే న‌వ్వు ఎంత ఆపుకుందామ‌నుకున్నా ఆగ‌దు సుమీ..! కోల్‌కతాకు 15 కిలో మీటర్ల దూరం ఉండే సోద్పూర్‌ ప్రాంతంలో జరిగిన ఓ పెళ్లి అందరినీ ఆశ్చర్య చకితులను చేస్తోంది. ఆ గ్రామ ప్రజలు రెండు చెట్లకు ఘనంగా పెళ్లి చేశారు. ఈ వివాహ వేడుకకు అతిథులుగా 2,000 మంది హాజరయ్యారు. సోమనాగ్ అనే వ్యక్తి 12 ఏళ్ల క్రితం ఓ మర్రి మొక్కను నాటారు. దానికి ప్రణయ్‌ అని పేరు పెట్టారు. రెండేళ్ల క్రితం ఆ చెట్టు పక్కనే ఓ రావి చెట్టు పెరగడం మొదలు పెట్టింది. ఆ రెండు చెట్లకు పెళ్లి చేయాలని నిర్ణయం తీసుకున్న గ్రామస్థులు‌.. ఇటీవల పెళ్లి పత్రికలు ముద్రించి దాదాపు 2,000 మందికి ఆహ్వానం పంపాు. ఉదయం నుంచే సన్నాయి మేళాలు ప్రారంభమయ్యాయి.

How crazy..! Married to the banyan and peepal tree..! 2 thousand guests .. !!

మర్రిచెట్టును పెళ్లి కొడుకుా తయారు చేసి దానికి ధోతి, కుర్తా కట్టారు. రావి చెట్టుకు బనారసీ చీర కట్టి ముస్తాబు చేశారు. పెళ్లి జరుగుతున్న సమయంలో శంఖం కూడా ఊదారు. పురోహితుడు మంత్రాలు చదువుతుండగా, మంగళ వాయిద్యాల మధ్య ఈ రెండు చెట్లకు పెళ్లి చేశారు. బెంగాలీ సంప్రదాయ పద్ధతిలో ఈ పెళ్లి ముగిశాక చాలా మంది ఈ కొత్త దంపతులతో సెల్ఫీలు, ఫొటోలు దిగారు.

అలా చేరారు..ఇలా బయటికి వచ్చేశారు: టీడీపీ కండువాను విసిరికొట్టిన మాజీ ఎంపీ అలా చేరారు..ఇలా బయటికి వచ్చేశారు: టీడీపీ కండువాను విసిరికొట్టిన మాజీ ఎంపీ

ఈ పెళ్లిలో పెళ్లి కూతురు రావి చెట్టు తల్లిదం్రులుగా సునితి సర్కార్‌, కమల్‌ అనే దంపతులు వ్యవహరించారు. పెళ్లి కొడుకు తల్లిదండ్రులు చేయాల్సిన కార్యక్రమాలను సోమ, సుప్రకాశ్‌ నాగ్‌ చేశారు. మామూలు పెళ్లికి ఏ మాత్రం తీసి పోకుండా క్యాటరింగ్‌కు ఆర్డర్‌ ఇచ్చారు. వధూవరులను ముస్తాబు చేయడానికి బ్యూటీషియన్లను, పెళ్లి వీడియో తీయడానికి వీడియో గ్రాఫర్‌లను కూడా పిలిపించారు. ఇటువంటి పెళ్లిళ్లు చేయడం వల్ల చెటలకు, మనుషులకు మధ్య సంబంధాలు బలపడతాయని నిర్వాహకులు చెప్పుకు రావ‌డం మ‌రో వింత‌..!

English summary
The people of the village marryed two trees. 2,000 guests attended the wedding ceremony. A man named Somanag planted a banyan tree 12 years ago. It is named Pranai. Two years ago, the Peepal tree started to grow. The villagers who decided to marry the two trees. wedding cards were recently printed out and invited to some 2,000 people.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X