మోడీ ప్రధాని అవుతారని : అప్పట్లోనే బిల్ గేట్స్ కంప్యూటర్ కనుగొన్నారేమో..!
ప్రధాని నరేంద్ర మోడీ డిగ్రీలపై రగడా ఇంకా కొనసాగుతోంది. ముందునుంచి మోడీ విద్యార్హతలపై ఆరోపణలు గుప్పిస్తున్న ఆమ్ ఆద్మీ పార్టీ.. తాజాగా అమిత్ షా బయటపపెట్టిన మోడీ డిగ్రీలను నకిలీవని ఆరోపిస్తున్న విషయం తెలిసిందే. దీన్ని ఆధారాలతో సహా చూపించే ప్రయత్నంలో మోడీకి కొన్ని ప్రశ్నలు సంధిస్తున్నారు ఆప్ నేతలు.
తాజాగా ఇదే విషయంపై మాట్లాడిన ఆప్ నేత అశుతోష్.. అసలు మోడీ ఢిల్లీ యూనివర్సిటీలో చదువుకున్న 1978 కాలంలో కంప్యూటర్లు ఉన్నాయా అని ప్రశ్నిస్తున్నారు. అంతేకాదు, ఢిల్లీ యూనివర్సిటి ఇచ్చిన మోడీ డిగ్రీ పట్టాలోను పలు తప్పిదాలున్నాయని అంటున్నారు. మోడీ మార్కుల షీట్ లో తేడాలున్నాయని చెప్పిన అశుతోష్, 1978లో ఢిల్లీ యూనివర్సిటీ నుంచి పట్టా అందుకున్నవారి పేర్లు, మార్క్ షీట్లు చేతి రాతతో ఉండగా, మోడీకి ప్రధానం చేసిన డిగ్రీ పట్టాలో మాత్రం వర్సిటీ లోగో ఆధునిక ఫాంట్ లో ఎలా ఉంటుందన్నారు.

ఒరిజినల్ డిగ్రీ పాత ఫాంట్ లో ఉంటే, మోడీ డిగ్రీ ఆధునిక ఫాంట్ లో ఉండడాన్ని బట్టి ఆయనది నకిలీ డిగ్రీనేనని స్పష్టం చేశారు. మోడీ డిగ్రీలపై మొత్తం 8 ప్రశ్నలు సంధించిన ఆప్ నేతలు, మోడీ డిగ్రీలో కంప్యూటర్ మార్క్ షీట్ వచ్చి చేరడాన్ని పాయింట్ అవుట్ చేశారు. 2014 లో మోడీ భారత్ కు ప్రధాని అవుతాడని గుర్తించిన బిల్ గేట్స్ 1978 లోనే కంప్యూటర్ తయారుచేశారేమోనని ఎద్దేవా చేశారు.
టైమ్స్ నౌ ఛానెల్ లోను మోడీ డిగ్రీలపై జరిగిన చర్చ సందర్భంగా.. ఢిల్లీ యూనివర్సిటీ రిజిస్ట్రార్ మోడీ డిగ్రీకి సంబంధించి తప్పుడు నమోదిత నంబరును ప్రస్తావించడంపై అనుమానాలు లేవనెత్తారు. మోడీ డిగ్రీపై cc5544/74 నమోదిత నంబరు ఉండగా.. రిజిస్ట్రార్ మాత్రం cc1594 నంబర్ మోడీ డిగ్రీపై నమోదైనట్టుగా తప్పుడు సమాచారాన్ని చదివారు.
అది రిజిస్ట్రార్ తప్పు కాదని, మోడీని వ్యతిరేకించే ధైర్యం లేకపోతే.. రిజిస్ట్రార్ తన బాధ్యతను తాను నిర్వర్తిస్తే సరిపోతుందని తెలియజేశారు ఆప్ నేతలు.
-
రేషన్ కార్డుల లబ్దిదారులకు శుభవార్తలు.. కొత్త రేషన్ షాపులే కాదు ఏప్రిల్ లో మరో పండుగ! -
ఏపీ, తెలంగాణలో రెండు కొత్త ఎయిర్‌పోర్ట్‌లకు గ్రీన్ సిగ్నల్ - ఈ ప్రాంతాల్లోనే..!! -
PDS Kerosene: మళ్లీ రేషన్ షాపుల్లో కిరోసిన్-కేంద్రం అత్యవసర ఆదేశాలు..! -
చిన్న సినిమా పెద్ద హిట్ అంటే ఇదే..! -
50 వేల కొత్త ఉద్యోగాలు.. AI శిక్షణకు పెద్దపీట! -
మహిళలకు నెలకు రూ.3వేలు.. అస్సాంలో బీజేపీ మ్యానిఫెస్టో రిలీజ్ -
విజయ్ పార్టీకి త్రిష శాపం? రెండు చోట్ల ఓటమి ఖాయం! -
వాస్తు ప్రకారం బాత్రూంలో ఉప్పు పెట్టమని ఎవరైనా చెప్పారా? -
కొత్త పెన్షన్ల పై ప్రభుత్వం కీలక నిర్ణయం: పంపిణీ ముహూర్తం, మార్గదర్శకాలు..!! -
విజయ్ సేతుపతి 'కాట్టన్' రివ్యూ: ఇదేం స్టోరీ బాబోయ్.. పిచ్చెక్కిస్తోంది..!! -
రూట్ మార్చిన ఫరియా.. ఊర మాస్ పాత్రలో హిట్ కొట్టేనా ?? -
బంగాళాఖాతంపై ఉపరితల ఆవర్తనం- నేడు ఏపీలోని ఈ జిల్లాల్లో వర్షాలు












Click it and Unblock the Notifications