మస్ట్ రీడ్ : భారత పౌరసత్వ సవరణ బిల్లు అస్సాం ఒప్పందంను ఎలా సవాల్ చేస్తోంది ?

పార్లమెంటులో పౌరసత్వ సవరణ బిల్లు ఆమోదం పొందడంతో ఈశాన్య రాష్ట్రాలు భగ్గుమన్నాయి. ముఖ్యంగా అస్సాం రాష్ట్రంలో ప్రజలు విద్యార్థి సంఘాలు రోడ్లపైకొచ్చి నిరసన గళాన్ని వినిపించాయి. ఆందోళనలు మిన్నంటడంతో పరిస్థితి కాస్త హింసాత్మకంగా మారింది. అయితే పౌరసత్వ సవరణ బిల్లు 1985 అస్సాం ఒప్పందంకు తూట్లు పొడిచేలా ఉందనే వాదన తొలి నుంచి వినిపిస్తోంది. అస్సాం ఒప్పందంను కొత్తగా వచ్చిన పౌరసత్వ సవరణ బిల్లు ఎలాంటి సవాల్‌ను విసురుతోంది..? పౌరసత్వ సవరణ బిల్లుకు అస్సాం ఒప్పందంకు సంబంధం ఏమిటి..?

 భారత పౌరసత్వ చట్టం ఎలా విబేధిస్తోంది..?

భారత పౌరసత్వ చట్టం ఎలా విబేధిస్తోంది..?

ప్రస్తుతం వివాదాస్పదంగా మారిన పౌరసత్వ సవరణ బిల్లులో పొరుగుదేశాల నుంచి వచ్చిన ముస్లింయేతర వలసదారులకు భారత పౌరసత్వం కల్పిస్తున్నట్లుగా బిల్లులో కేంద్రం పొందుపర్చింది. మతప్రాతిపదికన పౌరసత్వం కల్పించడంపై విమర్శలు వస్తున్నాయి. ఇది ఒక్క అస్సాంకే పరిమితం కాదు, దేశవ్యాప్తంగా ఇదే జరుగుతుంది. అయితే అస్సాం రాష్ట్రం కేంద్ర ప్రభుత్వం మధ్య ఒప్పందం ఉన్నట్లుగా ఇతర రాష్ట్రాల మధ్య ఎలాంటి ఒప్పందం లేదు.

 కటాఫ్ తేదీ 43 ఏళ్లకు పొడిగింపు

కటాఫ్ తేదీ 43 ఏళ్లకు పొడిగింపు

ఇక కొత్తగా సవరణ చేసిన పౌరసత్వ బిల్లులో మార్చి 24, 1971గా ఉన్న కటాఫ్ తేదీని డిసెంబర్ 31,2014 వరకు పొడిగించారు. అంటే 43 ఏళ్లు 9 నెలల ఏడు రోజులు పాటు పొడిగించారు. దీన్నే ఆందోళనకారులు తప్పుపడుతున్నారు. అస్సాం సంస్కృతిని అస్సాం రాష్ట్రానికి ఉన్న ప్రత్యేక గుర్తింపును కేంద్రం తొక్కేస్తోందనే భావన వారిలో ఉంది. అస్సాం ఒప్పందంలోని క్లాజ్ 5 విదేశాల నుంచి అక్రమ వలసదారుల అంశాన్ని ప్రస్తావిస్తుండగా క్లాజ్ 6 అస్సాం ఔన్నత్యాన్ని చాటుతోంది.

అస్సాం ఒప్పందంలోని క్లాజ్ 6 ఏం చెబుతోంది..?

అస్సాం ఒప్పందంలోని క్లాజ్ 6 ఏం చెబుతోంది..?

అస్సాం ఒప్పందంలో 6వ క్లాజ్ కూడా పౌరసత్వ సవరణ బిల్లును సవాల్ చేసేలా ఉంది. రాజ్యాంగం, చట్టపరమైన, పాలనాపరంగా ఎలాంటి ఇబ్బందులు రాకుండా కేంద్రం చూసుకుంటుందనేది క్లాజ్ 6లో ఉంది. అంటే అస్సాం రాష్ట్ర సంస్కృతిని పరిరక్షించడం, ప్రమోట్ చేయడం, సామాజికంగాను, భాషాపరంగాను ప్రత్యేక గుర్తింపును ఇవ్వడం, అస్సా ప్రజల యొక్క వారసత్వాన్ని కాపాడటం వంటివి కేంద్ర ప్రభుత్వం తన భుజాలపై మోస్తుందని అస్సాం ఒప్పందంలోని క్లాజ్ 6 చెబుతోంది. అయితే కొత్తగా పార్లమెంటు ఆమోదం తెలిపిన భారత పౌరసత్వ సవరణ బిల్లులో మాత్రం వీటి గురించిన ప్రస్తావన లేదని ఆందోళనకారులు చెబుతున్నారు. అయితే అస్సాం ఒప్పందంలో ఉన్న క్లాజ్ 6ను భారత పౌరసత్వ సవరణ బిల్లుకు ఎలాంటి సంబంధం లేదని చర్చ సందర్భంగా అమిత్ షా చెప్పారు.

అక్రమ వలసదారులనుంచి అస్సాంకు విముక్తి కల్పించండి

అక్రమ వలసదారులనుంచి అస్సాంకు విముక్తి కల్పించండి

అమిత్ షా ఇచ్చిన సమాధానం కానీ, ప్రధాని మోడీ ఇచ్చిన వివరణ కానీ అస్సాం ముఖ్యమంత్రి శరబానంద్ సోనోవాల్ ఇచ్చిన స్పష్టత కానీ ఆందోళనకారులను ప్రభావితం చేయలేదు. అక్రమవలసదారులు ఎట్టి పరిస్థితుల్లో తమ రాష్ట్రంలో ఉండేందుకు వీలు లేదు అని మాత్రం గట్టిగా చెబుతున్నారు. అక్రమ వలసదారుల నుంచి అస్సాంకు విముక్తి కల్పించాలన్నది వారి ఏకైక డిమాండ్‌గా ఉంది. అస్సాం ఒప్పందం అమలు చేయాల్సిన బాధ్యత కేంద్రానిదే అని ఆందోళనకారులు తమ గళాన్ని వినిపిస్తున్నారు. ఎందుకంటే భారత పౌరసత్వ సవరణ బిల్లు తీసుకొచ్చింది కేంద్రమే కాబట్టి అస్సాం ఒప్పందంను అమలు చేయాల్సిన బాధ్యత కూడా కేంద్రానిదే అని ఆందోళనకారులు చెబుతున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+