Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

Flashback: హౌడీ మోడీ నుంచి నమస్తే ట్రంప్ వరకు: మోదీ-ట్రంప్ మ్యాజిక్..!!

Trump-Modi Friendship:అమెరికా అధ్యక్ష ఎన్నికలు ముగిశాయి.. ఫలితాలు వెలువడ్డాయి. అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఈ సారి అధ్యక్ష ఎన్నికల్లో ఘనవిజయం సాధించి శ్వేతసౌధంలోకి అధికారికంగా మరోసారి అధ్యక్ష హోదాలో అడుగుపెట్టనున్నారు. అమెరికాలో ట్రంప్ సర్కార్‌ రావడం, భారత్‌లో మోదీ సర్కార్ ఉండటం ఇరు దేశాలకు శుభపరిణామంగా అభివర్ణిస్తున్నారు అంతర్జాతీయ రాజకీయ విశ్లేషకులు. మోదీ-ట్రంప్ ద్వయంతో భారత్‌కు ఎలాంటి మేలు చేకూరుతుంది..?

అగ్రరాజ్యం అమెరికా 47వ అధ్యక్షుడిగా డొనాల్డ్ ట్రంప్ బాధ్యతలు తీసుకోనున్నారు. అధికారికంగా బాధ్యతలు చేపట్టేందుకు జనవరి 20 వరకు వేచిచూడాల్సిందే. ట్రంప్ రాకతో భారత్‌కు కూడా మంచి కాలం ఉండనున్నట్లు విశ్లేషకులు చెబుతున్నారు. ఇందుకు కారణం ట్రంప్ -మోదీ స్నేహమే. ట్రంప్ విజయం ఖరారు కాగానే మోదీ అగ్రరాజ్యం పెద్దన్నను అభినందించేందుకు ఎంతో సమయం తీసుకోలేదు. తనతో గతంలో పనిచేసిన అనుభవాలను ఈ సందర్భంగా గుర్తు చేస్తూ ఇరు దేశాల ప్రజల క్షేమం కోసం, దేశం కోసం, ప్రపంచ శాంతి కోసం, స్థిరత్వం కోసం పనిచేద్దామని ప్రధాని మోదీ పిలుపునిచ్చారు.

How Howdy Modi and Namaste Trump Cemented U S -India Relations

మోదీ-ట్రంప్ మధ్య దృఢమైన బంధం

ప్రధాని నరేంద్ర మోదీ ఏదైనా సమస్య వస్తే చర్చల ద్వారానే వాటిని పరిష్కరించగలిగే సత్తా ఉన్న నేతగా గుర్తింపు ఉంది. ట్రంప్ 2016 నుంచి 2020 వరకు అమెరికా అధ్యక్షుడిగా ఉన్న సమయంలో భారత్ అమెరికా దేశాల మధ్య మంచి సంబంధాలు కొనసాగాయి.ఇరు దేశాధిపతులు రక్షణ రంగం, భద్రతాపరమైన అంశాలపై సంబంధాలను బలోపేతం అయ్యేలా అడుగులు ముందుకువేశారు.ముఖ్యంగా ఉగ్రవాదాన్ని అణిచివేయడం, ప్రాంతీయంగా శాంతి నెలకొనేందుకు చర్యలు తీసుకున్నారు. పాకిస్తాన్ తీరును ట్రంప్ ఎప్పటికప్పుడు ఖండిస్తూ వస్తూనే భారత్‌కు అండగా నిలిచారు. ఇక ఇండో-పసిఫిక్ దేశాలపై చర్చ సందర్భంగా మోదీ-ట్రంప్ ద్వయం ఒకే మాటపై నిలబడి ఇద్దరూ మరింత దగ్గరయ్యారు. ఈ నిర్ణయంతో ఇరు దేశాల మధ్య రక్షణ రంగం బలోపేతమైంది అదే సమయంలో ఇరుదేశాలు సంయుక్తంగా మిలటరీ విన్యాసాలను నిర్వహించారు. క్వాడ్ కూటమిలో భారత్ పాత్ర కీలకంగా మారింది.

వ్యక్తిగతంగా మంచి మిత్రులు

మోదీ ట్రంప్ ఇద్దరూ వ్యక్తిగతంగా మంచి స్నేహితులు.ఇద్దరూ ఒకే వేదికను పలుమార్లు పంచుకున్నారు. ఆయాదేశ ప్రజలనుద్దేశించి ప్రసంగించారు.2019లో అమెరికాలో జరిగిన హౌడీ మోడీ కార్యక్రమం ద్వారా అక్కడి భారతీయులను మోదీ పలకరించి మాట్లాడారు. ఆ సమయంలో ట్రంప్ కూడా ఆ వేదికపై ఉన్నారు.ఆప్‌కీ బార్ ట్రంప్ సర్కార్ అనే నినాదం మోదీ అక్కడ కూడా ఇచ్చారు. ఇక 2020లో నమస్తే ట్రంప్ పేరుతో మోదీ అప్పటి అధ్యక్షుడిగా ఉన్న ట్రంప్‌కు ఘనస్వాగతం పలికారు. మోదీ-ట్రంప్ మధ్య వ్యక్తిగతంగా కూడా మంచి సంబంధాలు ఉన్నాయని చెప్పేందుకు ఈ రెండు కార్యక్రమాలే నిదర్శనం.

How Howdy Modi and Namaste Trump Cemented U S -India Relations

ఆర్థిక సంబంధాలు-వాణిజ్య అంశాలు

ఇరు దేశాల మధ్య సుంకంపై కొన్ని విబేధాలు వచ్చినప్పటికీ,పలు సవాళ్లు ఎదురైనప్పటికీ ట్రంప్ మోదీ మధ్య స్నేహం మాత్రం చెరిగిపోలేదు.ఇరు నేతలు రెందు దేశాల ఆర్థిక వ్యవస్థ బలోపేతానికి కృషి చేశారు. ట్రంప్ తీసుకున్న విధానపరమైన నిర్ణయం "అమెరికా ఫస్ట్" ఇతర దేశాలను కాస్త ఇబ్బంది పెట్టినప్పటికీ మోదీ మాత్రం ఎంతో చాకచక్యంగా వ్యవహరిస్తూ భారత ప్రయోజనాలకు ఎక్కడా భంగం కలగకుండా చూసుకున్నారు. వాణిజ్య సంబంధాలు బలోపేతంతో పాటు భారత్‌ ఆర్థికశక్తిగా ఎదగడంలో ఇరు దేశాధినేతల ఆలోచనలు,నిర్ణయాలు చక్కగా పనిచేశాయి.

ఆరోగ్య రంగంలో...

కరోనా సమయంలో ప్రపంచం ఎంతలా అతలాకుతలమైందో అందరికీ తెలిసిందే. ముఖ్యంగా అమెరికాలో మాత్రం అది గడ్డుకాలమే అని చెప్పొచ్చు. ఆర్థికంగా అమెరికా కుదేలైంది. లాక్‌డౌన్‌లతో ప్రజలు చాలా ఇబ్బంది పడ్డారు. బయటకు అడుగుపెడితే ఈ మహమ్మారి బారిన పడి ప్రాణాలు వదలక తప్పదనే పరిస్థితికి వచ్చేశారు.ఆ సమయంలో భారత్ అమెరికాకు అండగా నిలిచింది. ప్రజల ఇబ్బందులను దృష్టిలో ఉంచుకుని వెంటనే హైడ్రాక్సీ క్లోరోక్విన్‌ను అమెరికాకు రవాణా చేసి మంచి మనసు చాటుకుంది.అమెరికా కొంత కోలుకోగానే.. భారత్‌కు కూడా తిరిగి సహాయం చేసింది.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+