మోడీ ఎఫెక్ట్: సీఎంకే సమాచారం లేదు, చేతులు ఎత్తేశారు, అందుకే ఐటీ సోదాలు, ఏం చేస్తారు !
కర్ణాటక హోం శాఖ, ఇంటిలిజెన్స్ వర్గాలు చేతులు ఎత్తేయడంతోనే ఆ రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి డీకే. శివకుమార్ కు కష్టాలు ఎదురైనాయని తెలిసింది. కర్ణాటకలో పవర్ ఫుల్ మంత్రి అనే పేరు ఉన్న డీకే.
బెంగళూరు: కర్ణాటక హోం శాఖ, ఇంటిలిజెన్స్ వర్గాలు చేతులు ఎత్తేయడంతోనే ఆ రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి డీకే. శివకుమార్ కు కష్టాలు ఎదురైనాయని తెలిసింది. కర్ణాటకలో పవర్ ఫుల్ మంత్రి అనే పేరు ఉన్న డీకే. శివకుమార్ తన ఇంటి మీద ఐటీ శాఖ అధికారులు దాడి చేస్తారని కనీసం పసిగట్టలేకపోయారు.
కర్ణాటకలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో ఉంది. హోం శాఖ, ఇంటిజెన్స్ శాఖలు సైతం సీఎం సిద్దరామయ్య చేతుల్లో ఉన్నాయి. అయితే డీకే. శివకుమార్ ఇంటి మీద ఐటీ శాఖ అధికారులు దాడులు చేస్తారు అనే విషయం ఇంటిలిజెన్స్ వర్గాలు పసిగట్టలేకపోయాయి.

ఇంటిలిజెన్స్ వర్గాల వైఫల్యం వలనే డీకే. శివకుమార్ కు సినిమా కష్టాలు మొదలైనాయని తెలిసింది. డీకే. శివకుమార్ ఇంటి మీద ఐటీ శాఖ దాడులు చేసిన నేపథ్యంలో కర్ణాటక సీఎం సోషల్ మీడియాలో స్పందించారు. కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ అధికార దుర్వినియోగం చేసిందని ఆరోపించారు.
ఐటీ శాఖ దాడులు చేసే సమయంలో స్థానిక పోలీసుల సహకారం తీసుకోవాలని, ఆ నియమాలు పక్కన పెట్టి సీఆర్ పీఎఫ్ సిబ్బందిని భద్రతా ఏర్పాట్లకు నియమించుకుని నియమాలు ఉల్లంఘించారని సీఎం సిద్దరామయ్య సోషల్ మీడియాలో కేంద్ర ప్రభుత్వం మీద మండిపడ్డారు.












Click it and Unblock the Notifications