ఆ రోజే శపథం చేసిన మోడీ, మీకు రోజులు దగ్గర పడ్డాయి, నేనూ చూస్తా, అయ్యో పాపం చిదంబరం!
న్యూఢిల్లీ: ప్రధాని నరేంద్ర మోడీ ఆరోజే శపథం చేశారు. కాంగ్రెస్ పార్టీకి చెందిన అవినీతి నాయకులు ఎంత కాలం బెయిల్ మీద బెయిల్ తీసుకుని బయట తిరుగుతారో నేనూ చాస్తాను, మీరు ఏదో ఒక రోజు కచ్చితంగా జైలుకు పోతారు, ఆరోజులు దగ్గర పడ్డాయని గత లోక్ సభ ఎన్నికల ప్రచారం సమయంలో ప్రధాని నరేంద్ర మోడీ పరోక్షంగా కేంద్ర మాజీ హోం మంత్రి చిదంబరం మీద మండిపడ్డారు. అనుకున్నట్లే ఇప్పుడు చిదంబరం అరెస్టు అయ్యారు.

మోడీ శపథం ఫలించింది
ఆ రోజు ప్రధాని నరేంద్ర మోడీ చేసిన శపథం నేడు ఫలించింది. బుధవారం రాత్రి కేంద్ర మాజీ హోం శాఖా మంత్రి పి. చిదంబరంను సీబీఐ అధికారులు అరెస్టు చేశారు. గత లోక్ సభ ఎన్నికల ప్రచారం సమయంలోనే కేంద్ర మాజీ హోం మంత్రి చిదంబరం మీద పరోక్షంగా ప్రధాని నరేంద్ర మోడీ తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. త్వరలోనే చిదంబరం అరెస్టు అవుతారని ప్రధాని నరేంద్ర మోడీ పరోక్షంగా అన్నారు.

ఆ పదవిలో చిదంబరమా ?
అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న వ్యక్తి (చిదంబరం) కాంగ్రెస్ పార్టీ ఎన్నికల ప్రచార ప్రణాళిక సంఘం కమిటి వ్యవహారాలు చూస్తున్నారని, ఈ విషయం తెలిసిన వెంటనే తాను షాక్ కు గురైనానని, ఇలాంటి వాళ్లు అధికారంలోకి వచ్చి దేశాన్ని ఏం ఉద్దారిస్తారని గత లోక్ సభ ఎన్నికల ప్రచారం సమయంలో నరేంద్ర మోడీ విమర్శలు చేశారు.

ఏం చెప్తారో నేనూ చాస్తా
బెయిల్ మీద బెయిల్ తీసుకుని బయట తిరుగుతున్న ఆ వ్యక్తి (చిదంబరం) ఈ రోజు తన మీద విమర్శలు చేస్తున్నారని ప్రధాని నరేంద్ర మోడీ విరుచుకుపడ్డారు. మీ అవినీతి బండారం మొత్తం బయటపెడుతాం, ఆ రోజు ప్రజలకు మీరు ఏం సమాధానం చెబుతారో నేను చూస్తానని ప్రధాని నరేంద్ర మోడీ కేంద్ర మాజీ మంత్రి చిదంబరంను ఉద్దేశించి అన్నారు.

మీకు రోజులు దగ్గర పడ్డాయి!
ఎన్ని రోజులు మీరు బెయిల్ మీద బయట తిరుగుతారో నేనూ చూస్తాను, మీరు అరెస్టు అయ్యే రోజులు దగ్గర పడ్డాయి, జైలుకు వెళ్లడానికి సిద్దంగా ఉండండి అంటూ కాంగ్రెస్ పార్టీ నాయకులతో పాటు కేంద్ర మాజీ హోం మంత్రి చిదంబరంను ఉద్దేశించి ప్రధాని నరేంద్ర మోడీ విమర్శలు చేశారు.

సలహా ఇచ్చిన చిదంబరం
ప్రధాని నరేంద్ర మోడీ విమర్శలను కేంద్ర మాజీ హొం శాఖా మంత్రి చిదంబరం తిప్పికొట్టారు. ప్రధాని నరేంద్ర మోడీకి ఎవరైన చట్టం గురించి పాఠాలు చెప్పాలని వ్యంగంగా అన్నారు. తన కేసు విషయంలో సుప్రీం కోర్టు స్పష్టంగా చెప్పిందని చిదంబరం అన్నారు. తాను జైలుకు వెళ్లే చాన్స్ లేదని ఎన్నికల ప్రచారం సమయంలో చిదంబరం ధీమా వ్యక్తం చేశారు.అయితే సీన్ తారుమారు కావడంతో సీబీఐ అధికారులు చిదంబరంను అరెస్టు చేశారు.
-
ఉగాది ఎప్పుడు చేసుకోవాలి 19 లేక 20 తేదీనా - వరుస సెలవులపై తాజా నిర్ణయం..!! -
ఏపీ మీదుగా బెంగళూరు, చెన్నై ప్రత్యేక రైళ్లు.. ఇకపై: హాల్ట్ స్టేషన్లు -
విజయ్- త్రిష పెళ్లికి త్రిష తల్లి గ్రీన్ సిగ్నల్..? -
West Bengal Survey: బెంగాల్లో అనూహ్య ఫలితాలు?-తేల్చేసిన మ్యాట్రిజ్ సర్వే..! -
LPG కొరతకు చెక్.. భారత్ మార్కెట్ లోకి DME Fuel !! -
ఏప్రిల్ నెలలో మేషరాశి, వృషభ రాశి జాతక ఫలం -
వైసీపీలోకి సీనియర్ నేత రీ ఎంట్రీ, అదే బాటలో..!! -
కుప్పకూలుతున్న పసిడి ధరలు- భారీగా క్రాష్ -
అందుకే.. విజయ్ జన నాయగన్ డిలే అయింది: పవన్ కల్యాణ్ -
మాస్కోలోని పుతిన్ నివాసంలో తలదాచుకున్న ఇరాన్ సుప్రీం లీడర్..?? -
బంగారం ధరలకు పూర్వవైభవం- పరుగులు -
ఉత్తరాభాద్ర నక్షత్రంలో శని సంచారం: కుంభరాశితో పాటు వీరికి సకల సంపదలు!












Click it and Unblock the Notifications