వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

జమ్ముకశ్మీర్‌లో ఆంక్షలు ఎత్తివేసేందుకు ఎన్నిరోజులు కావాలి.. కేంద్రంపై సుప్రీంకోర్టు ఆగ్రహం

|
Google Oneindia TeluguNews

జమ్ముకశ్మీర్, లడాఖ్ కేంద్రపాంత్ర పాలిత ప్రాంతాలుగా విభజించి కర్ఫ్యూ నీడన ఉంచడంపై విమర్శలు వ్యక్తమవుతున్న సంగతి తెలిసిందే. ఆగస్ట్ 5వ తేదీ నుంచి కశ్మీర్ లోయలో భద్రతా బలగాలు పహరా కాస్తున్నాయి. ఈ క్రమంలో కశ్మీర్‌లో సాధారణ పరిస్థితి పునరుద్ధరించేందుకు చర్యలు తీసుకోవాలని అన్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టులో పిటిషన్లు దాఖలయ్యాయి. ఆయా పిటిషన్లను సుప్రీంకోర్టు గురువారం విచారణ చేపట్టింది.

కశ్మీర్, లడాఖ్ కేంద్రప్రాంత పాలిత ప్రాంతాలుగా విభచించి దాదాపు రెండునెలలవుతోంది. ఇంకెన్ని రోజులు కశ్మీర్‌లో ఆంక్షలు అమల్లో ఉంటాయని కేంద్రప్రభుత్వాన్ని సుప్రీంకోర్టు ప్రశ్నించింది. సాధారణ పరిస్థితులు పునరుద్ధరించేందుకు ఇంకా ఎన్ని రోజులు కావాలి అని అడిగింది. సున్నితమైన సమస్యపై మీరు స్పష్టతతో రవాలని జస్టిస్ ఎన్వీ రమణ నేతృత్వంలోని ధర్మాసనం స్పష్టంచేసింది.

how many days you want on jk restrictions sc asks to centre

కశ్మీర్ లోయలో ఆంక్షలు సరికాదని సర్వోన్నత ధర్మాసనం అభిప్రాయపడింది. ఇప్పటివరకు విధించిన ఆంక్షలపై ఓసారి పునరాలోచించాలని కోరింది. అయితే కశ్మీర్‌లో విధించిన ఆంక్షలను 90 శాతం సడలించామని కేంద్ర ప్రభుత్వం సుప్రీంకోర్టుకు తెలిపింది. ఇప్పటికే కశ్మీర్‌లో ఇంటర్నెట్ సేవలను నిలిపివేశామని గుర్తుచేసింది. ప్రజా రవాణాను సడలించామని గుర్తుచేసింది. ఈ కేసులో ఇరుపక్షాల వాదనలు విన్న సుప్రీంకోర్టు ధర్మాసనం తదుపరి విచారణను నవంబర్ 5వ తేదీకి వాయిదావేసింది.

ఆర్టికల్ 370 రద్దుచేసి.. జమ్ముకశ్మీర్, లడాఖ్ కేంద్రపాలిత ప్రాంతాలుగా ఆగస్ట్ 5వ తేదీన కేంద్రప్రభుత్వం విభజించిన సంగతి తెలిసిందే. అప్పటినుంచి కశ్మీర్‌లో ఆంక్షలు కొనసాగుతున్నాయి. జమ్ముకశ్మీర్ విభజనకు సంబంధించి పార్లమెంట్‌లో ప్రవేశపెట్టిన బిల్లుకు ఉభయ సభలు ఆమోదం తెలిపి.. రాష్ట్రపతి రాజముద్ర పడింది. ఈ నెల 31వ తేదీన వల్లభాయ్ పటేల్ జయంతి సందర్భంగా కశ్మీర్, లడాఖ్ కేంద్రపాలిత ప్రాంతాలుగా మనుగడలోకి రానున్నాయి.

English summary
supreme court thursday asked central government that how long it intends to continue with the restrictions in jammu kashmir following the abrogation of article 370 in the region in august.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X