బ్లాక్ మనీ: ట్యాక్సీ డ్రైవర్ అకౌంట్ లో రూ. 9,806 కోట్లు !

బ్లాక్ మనీ: ట్యాక్సీ డ్రైవర్ అకౌంట్ లో రూ. 9,806 కోట్లు !

చండీగఢ్: ట్యాక్సీ డ్రైవర్ గా పని చేస్తున్న వ్యక్తి అకౌంట్ లో రూ.9,806 కోట్లు జమ అయిన ఘటన పంజాబ్ లో జరిగింది. పంజాబ్ లో బల్వీందర్ సింగ్ నివాసం ఉంటున్నారు. ఈయనకు స్టేట్ బ్యాంక్ ఆఫ్ పాటియాలలో జనధన్ యోజన కింద ఒక అకౌంట్ ఉంది.

ఇటీవల బల్వీందర్ సింగ్ అకౌంట్ లో రూ. 9,806 కోట్లు డిపాజిట్ అయ్యింది. తన అకౌంట్ లో ఇంత పెద్ద మొత్తంలో నగదు డిపాజిట్ అయ్యిందని ఆయన మొబైల్ లో ఎప్ఎంఎస్ చూసి సంబరపడిపోయారు. పదేపదే ఆ ఎస్ఎంఎస్ చూసుకుని ఆనందంలో మునిగిపోయాడు.

How a taxi driver got Rs.9,806 crore in his Jan Dhan account ?

అయితే రెండు రోజుల తరువాత ఆయన అకౌంట్ లో ఉన్న రూ. 9,806 కోట్ల నగదు మాయం అయ్యింది. వెంటనే వెళ్లి బ్యాంకు మేనేజర్ రవీందర్ కుమార్ ను ఏమి జరిగింది అని అడిగారు. ఆయన నీ అకౌంట్ లో పొరపాటున ఇలా నగదు డిపాజిట్ అయ్యిందని సమాధానం ఇచ్చారు

ఈ విషయంపై లీడ్ బ్యాంక్ మేనేజర్ సందీప్ గార్గ్ వివరణ ఇచ్చారు. పొరపాటున అసిస్టెంట్ మేనేజర్ బ్యాంకుకు చెందిన 11 అంకెల ఇంటర్నెట్ బ్యాంకింగ్ జనరల్ లెడ్జర్ అకౌంట్ నెంబర్లు కూడా కలపడం వలనే ఇలా జరిగిందని వివరణ ఇచ్చారు. ఈ పొరపాటును వెంటనే గుర్తించి మళ్లీ సరిచేశామని ఆయన చెప్పారు.

బ్యాంకు ఖాతాల విషయంలో ఇలాంటి తప్పులు అధికారులు చేస్తున్నారని ఆదాయ పన్ను శాఖ డిప్యూటీ కమిషనర్ భూపీందర్ సింగ్ రాయ్ చెప్పారు. భూపిందర్ సింగ్ తన అకౌంట్ లో రూ. 3,000 ఉంటుందని ఆయన అన్నారు. అయితే భూపిందర్ సింగ్ అకౌంట్ లో కేవలం రూ. 200 మాత్రం ఉన్నాయని బ్యాంకు అధికారులు చెప్పారు. ఈ విషయంపై ఆదాయం పన్ను శాఖ అధికారులు దర్యాప్తు చేస్తున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+