వీరజవాన్లు: 'బారాముల్లా' దాడిని ఇలా చిత్తు చేశారు!
న్యూఢిల్లీ: బారాముల్లాలో ఆదివారం రాత్రి ఉగ్రవాదులు దాడికి పాల్పడ్డారు. ఇద్దరు వీర జవాన్లు, ఇంటెలిజెన్స్ నివేదికలు లేకుంటే పెద్ద ప్రమాదం జరిగేదని అంటున్నారు. బారాముల్లా శివారుల్లోని జన్‌బాజ్‌పోరా వద్ద సరిహద్దు భద్రతాదళం 40వ బెటాలియన్ ఉంది.
ఇక్కడ సెంట్రీ విధులు నిర్వహిస్తున్న జవాన్ ఆదివారం రాత్రి బహిరంగ వంటశాల ప్రాంతంలో అనుమానాస్పద కదలికను గుర్తించాడు. ఉగ్రవాదులు శిబిరంలోకి ప్రవేశించి ఉండవచ్చన్న అనుమానంతో కాల్పులు ప్రారంభించాడు. ఈ కాల్పుల శబ్దంతో సమీపంలో ఉన్న సైనిక శిబిరంలో కలకలం చెలరేగింది.

ఆ శిబిరంలో 46 రాష్ట్రీయ రైఫిల్స్ సైనికులున్నారు. అనుమానిత ఉగ్రవాదులు ప్రవేశించారని భావిస్తున్న దిశగా వారు కూడా కాల్పులు ప్రారంభించారు. అన్ని వైపుల నుంచి కాల్పులు కొనసాగాయి. ఉగ్రవాదులు లోపలికి ప్రవేశించారా లేదా బయటి నుంచే కాల్పులు వస్తున్నాయా అన్నది స్పష్టం కాలేదు.
గంటన్నర కాల్పుల అనంతరం పరిసరాల్లో వెలుగులు చిమ్మే ఇల్యుమినేటర్లను ఉపయోగించారు. అయినా ఉగ్రవాది ఎవరూ కనిపించలేదు. అప్పటికే వారు చీకట్లో కలిసిపోయారు.
కాల్పుల్లో బీఎస్‌ఎఫ్ కానిస్టేబుళ్లు నితిన్, పుల్విందర్ గాయపడ్డారు. ఈ దాడికి ఉగ్రవాదులు షూట్ అండ్ స్కూట్ వ్యూహాన్ని అనుసరించారంటున్నారు. అంటే ఒకచోట కాల్పులు జరిపి అక్కడి నుంచి వెంటనే మరో చోటుకు తరలిపోవడం.
-
సీఎం చంద్రబాబుకు అల్లు అర్జున్ క్షమాపణలు... పోస్ట్ వైరల్ !! -
ఉగాదికి ముందే వారి కల నెరవేరుస్తున్న చంద్రబాబు.. మాట నిలబెట్టుకున్నారుగా! -
డిప్యూటీ సీఎం ఆఫర్ వేళ విజయ్, బీజేపీకి అన్నాడీఎంకేేే బిగ్ షాక్..! -
మూడు ముక్కల్లో ఉస్తాద్ రివ్యూ ఇచ్చిన అన్నయ్య: ట్వీటు పెడితే హీటు పెరిగినట్టే -
Putta Mahesh: టీడీపీ నుంచి ఏలూరు ఎంపీ సస్పెన్షన్ - షర్మిల షాకింగ్ ..! -
పెన్షన్లు పెంపు, మహిళలకు నెలకు రూ 2,500 - అమలు ముహూర్తం..!! -
today rashiphalalu: నేడు మీన సంక్రాంతితో ఈ రాశులవారికి తిరుగులేని అదృష్టం! -
గ్యాస్ బుకింగ్, డెలివరీ ఇక నుంచి ఇలా చేస్తేనే - తాజా మార్గదర్శకాలు..!! -
ఉక్కిరిబిక్కిరి చేస్తోన్న బంగారం ధరలు -
తెలంగాణ దశను మార్చే బిగ్గెస్ట్ రైల్వే ప్రాజెక్ట్ -
Sunrisers: సన్ రైజర్స్ ను ఆదుకున్న పాకిస్తాన్ క్రికెట్ బోర్డు ..! విమర్శల వేళ..! -
పెట్రోల్, డీజిల్ రేట్లపై కేంద్రం రివ్యూ?












Click it and Unblock the Notifications