టీనేజర్లకు కరోనా వ్యాక్సిన్ - ఎలా పొందాలంటే : రిజిస్ట్రేషన్ ప్రాసెస్ ఇలా..!!
ప్రపంచ వ్యాప్తంగా టెన్షన్ పెంచుతున్న ఒమిక్రాన్..ఇప్పుడు దేశంలోని పలు రాష్ట్రాల్లో వ్యాపిస్తోంది. అనేక రాష్ట్రాలు ఇప్పటికే రాత్రి కర్ఫ్యూతో పాటుగా ఆంక్షలు అమలు చేస్తున్నాయి. కేంద్రం సైతం దీనికి సంబంధించి రాష్ట్రాలను అప్రమత్తం చేస్తోంది. తాజాగా, ప్రధాని మోదీ సైతం ఒమిక్రాన్ ప్రబలటం పైన ఆందోళన అవసరం లేదని చెబుతూనే..అప్రమత్తంగా ఉండాలని సూచించారు. అదే సమయంలో దేశ వ్యాప్తంగా ఇప్పటి వరకు 18 ఏళ్ల వయసు దాటిన వారికి వ్యాక్సినేషన్ రెండు డోసులు అమలు చేస్తున్నారు.

టీనేజర్లకు వ్యాక్సిన్ నిర్ణయం
ఇప్పుడు వైరస్ విస్తరిస్తున్న వేళ..వ్యాక్సినేషన్ ద్వారా నియత్రించగలుగుతామని నిపుణులు స్పష్టం చేస్తున్నారు. మాస్కు తప్పని సరిగా వినియోగిస్తూ..సామాజిక దూరం పాటించాలని సూచిస్తున్నారు. ఇక, దేశ వ్యాప్తంగా వచ్చే నెల 3వ తేదీ నుంచి 15-18 ఏళ్ల మధ్య వయసు వారికి కరోనా టీకాలను పొందేందుకు కేంద్రం మార్గదర్శకాలు విడుదల చేసింది. ఈ వయసు వారికి జనవరి 1 నుంచి కొవిన్ యాప్, వెబ్‌సైట్‌లో రిజిస్ట్రేషన్లు ప్రారంభమవనున్నట్లు వెల్లడించింది. విద్యాసంస్థల ఐడీ కార్డులతోనూ రిజిస్ట్రేషన్‌కు అవకాశం కల్పిస్తున్నట్లు వివరించింది.

1వ తేదీ నుంచి రిజిస్ట్రేషన్
ఇక 60 ఏళ్ల వయసు దాటి, ఇతరత్రా ఆరోగ్య సమస్యలున్నవారికి వైద్యుల సలహాపై 'ముందు జాగ్రత్త (ప్రికాషన్) డోసు' టీకా అందించనున్నామని, ఆరోగ్య విభాగ సిబ్బంది, ఫ్రంట్‌లైన్ వర్కర్లకు దీన్ని జనవరి 10 నుంచి వేయనున్నట్లు ఇప్పటికే ప్రధాని మోదీ ప్రకటించారు.
15 నుంచి 18 ఏళ్ల టీనేజర్లు వ్యాక్సిన్ కోసం రిజిస్ట్రేషన్ చేసుకునే ఏర్పాట్లు చేసినట్లు కోవిన్ ప్లాట్‌ఫామ్ చీఫ్ డాక్టర్ ఆర్ఎస్ శర్మ తెలిపారు. వీరంతా కోవిన్ యాప్‌లో జనవరి ఒకటో తేదీ నుంచి రిజిస్ట్రేషన్ చేసుకోవాలని సూచించారు. అయితే.. వ్యాక్సిన్ రిజిస్ట్రేషన్‌ను స్టూడెంట్ ఐడీ కార్డుతో చేసుకునేలా వెసులుబాటు కల్పించినట్లు డాక్టర్ శర్మ తెలిపారు.

కోవిన్ ప్లాట్‌ఫామ్‌లో పూర్తి వివరాలతో
కోవిన్ ప్లాట్‌ఫామ్‌లో అదనంగా టెన్త్ ఐడీ కార్డు రిజిస్ట్రేషన్‌ను యాడ్ చేసినట్లు ఆయన వివరించారు. ఆధార్ కార్డు లేని వారికి ఈ ఆప్షన్ వర్తింస్తుందని.. అందరూ గమనించాలని సూచించారు. ఇందులో దరఖాస్తు దారుడు తమ దగ్గరిలోని సెంటర్ ను ఎంపిక చేసుకొనే క్రమంలోనే..అందుబాటులో ఉన్న వ్యాక్సిన్ కేంద్రాలను సూచిస్తుంది.
అదే విధంగా సమయం సైతం ఎంపిక చేసుకొనే అవకాశం ఉంటుంది. అందులోని వివరాలు పూర్తి చేసిన తరువాత మొబైల్ కు వచ్చే ఓటీపీతో మిగిలిన వివరాలు నమోదు చేయాలి. ఆ తరువాత స్లాట్ ఖారారు చేస్తూ మొబైల్ కు మెసేజ్ వస్తుంది. దాని ఆధారంగా వ్యాక్సినేషన్ నిర్ణేశించిన సమయానికి వెళ్లి... టీకా తీసుకోవచ్చని కేంద్రం స్పష్టం చేసింది.












Click it and Unblock the Notifications