హిమాచల్ ప్రదేశ్ కోర్టు సంచలన తీర్పు: 'ఆ రైలును రైతులకిచ్చేయండి'
న్యూఢిల్లీ: హిమాచల్ ప్రదేశ్ కోర్టు ఇచ్చిన ఆదేశాలు అమలైతే దేశ చరిత్రలోనే తొలిసారిగా ఇద్దరు రైతులు ఢిల్లీ-ఉనా జనశతాబ్ది రైలుకు యజమానులు అయ్యే గొప్ప అవకాశాన్ని సొంతం చేసుకోనున్నారు. వివరాల్లోకి వెళితే, మీలా రామ్, మదన్ లాల్ అనే ఇద్దరు రైతులు ఉనా-అంబా పట్టణాల మధ్య రైల్వే ట్రాక్ నిర్మాణం కోసం 1998లో రైల్వే శాఖకు భూములు ఇచ్చారు.
అయితే రైతుల నుంచి భూమిని స్వాధీనం చేసుకున్న రైల్వే శాఖ వారికి తిరిగి పరిహారం చెల్లించలేదు. ఈ కేసుని విచారించిన ఉనా జిల్లా అదనపు జడ్జి ముకేష్ భన్సాల్, రైల్వే శాఖ తీరుని తప్పుబడుతూ, ఈ నెల 15లోగా పరిహారం చెల్లించకుంటే, ఢిల్లీ-ఉనా జనశతాభ్ది రైలును ఆటాచ్ చేయాలని ఆదేశించారు.

రైతులు మీలా రామ్, మదన్ లాల్‌లకు చెల్లించాల్సిన రూ. 35 లక్షలను 15తేదీలోగా చెల్లించాలని, అలా చేయని పక్షంలో 16వ తేదీ ఉదయాన్నే రైల్వే స్టేషన్‌లో రైతుల ఆపేసి స్వాధీనం చేసుకోవచ్చని జడ్జి తీర్చినిచ్చారు. రైల్వే శాఖ పరిహారం కింద రామ్‌కు రూ. 8.91 లక్షలు, మదన్ లాల్‌కు రూ. 26.53 లక్షలు చెల్లించాల్సి ఉంది.
గతంలో 2013లో ఈ కేసుని విచారించిన హిమాచల్ హైకోర్టు సైతం రైతులకు పరిహారాన్ని ఆరు వారాల్లో చెల్లించాలని తీర్పుని వెల్లడించిన, రైల్వే అధికారులు నిమ్మకు నీరెత్తినట్లు ప్రవర్తించారు.












Click it and Unblock the Notifications