Kerala: మళ్లీ ప్రమాదకరంగా కరోనా వ్యాప్తి -వరుసగా రెండో రోజూ 22వేల కొత్త కేసులు -11.3పాజిటివిటీ రేటు

దక్షిణాది రాష్ట్రం కేరళలో కరోనా మహమ్మారి మళ్లీ ప్రమాదకర స్థాయిలో వ్యాపిస్తున్నది. దేశంలో తొలి కేసు నమోదైన కేరళ.. తొలి, రెండో వేవ్ లోనూ ముందుగా ఎఫెక్ట్ అయింది. ప్రస్తుత సినారియో చేస్తే, దేశంలో కరోనా మూడో వేవ్ మొదలైందనే సంకేతాలు వెలువడినట్లేనని నిపుణులు అంటున్నారు.

కేరళలో వరుసగా రెండో రోజు కొత్త కేసులు 22 వేల పైచిలుకు నమోదయ్యాయి. గత రెండు నెలలుగా ప్రతి రోజూ పది వేలకుపైగా పాజిటివ్ కేసులు, వందల సంఖ్యలో మరణాలు రికార్డవుతున్నాయి. అయితే మంగళవారం ఈ సంఖ్య 22వేలు దాటగా, బుధవారం నాడు రాష్ట్ర ఆరోగ్య శాఖ తాజా గణాంకాలు విడుదల చేసింది..

https://telugu.oneindia.com/news/india/14-dead-4-missing-floods-in-himachal-pradesh-298625.html

కేరళలో గడిచిన 24 గంటల్లో కొత్తగా 22,056 కరోనా పాజిటివ్ కేసులు, 131 మరణాలు నమోదయ్యాయి. దీంతో ఆ రాష్ట్రంలో మొత్తం కరోనా కేసుల సంఖ్య 33,27,301కు, మొత్తం మరణాల సంఖ్య 16,457కు పెరిగింది. ప్రస్తుతం రాష్ట్రంలో పాజిటివిటీ రేటు అత్యధికంగా 11.3శాతంగా ఉంది. నిన్న ఒక్కరోజే 17,761 మంది కొవిడ్ నుంచి కోలుకున్నారు. దీంతో మొత్తం రికవరీల సంఖ్య 31,60,804కు చేరుకున్నది.

కేరళలో ప్రస్తుతం 1,49,534 యాక్టివ్ కరోనా కేసులున్నాయి. కాగా, దేశంలో కరోనా హాట్‌స్పాట్‌గా కేరళ కొనసాగుతున్నది. దేశ వ్యాప్తంగా కేసులు తగ్గుతున్నా, కేరళలో మాత్రం రెట్టింపు సంఖ్యలో కొత్త కేసులు వస్తుండటంపై కేంద్రం ఆందోళన వ్యక్తం చేసింది. బీజేపీ నేతలైతే ఇదే అదననుగా పినరయి విజయన్ సర్కారుపై విమర్శలు గుప్పిస్తున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+