టన్నుల కొద్దీ లిథియం నిల్వలు: దశ-దిశ మారిపోవడం ఖాయం: దేశంలోనే తొలిసారిగా..

జమ్మూ కాశ్మీర్ లో భారీగా లిథియం నిల్వలు బయటపడ్డాయి. రియాసీ జిల్లాలోని సలాల్‌ కోట్ లో వీటిని అధికారులు గుర్తించారు. బాక్సైట్ మిశ్రమంతో లిథియం ఉన్నట్లు నిర్ధారించారు.

శ్రీనగర్: జమ్మూ కాశ్మీర్‌ భారీ ఎత్తున అత్యంత విలువైన లిథియం నిల్వలను అధికారులు గుర్తించారు. లిథియం నిల్వలు బయటపడటం దేశంలో ఇదే తొలిసారి కావడం ప్రాధాన్యతను సంతరించుకుంది. జమ్మూ కాశ్మీర్‌ లోని రియాసీ జిల్లాలోని సలాల్‌ కోట్ ప్రాంతంలో ఈ నిల్వలు భారీగా ఉన్నట్లు జియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా అధికారులు తెలిపారు. 5.9 మిలియన్‌ టన్నుల మేర ఈ నిల్వలు ఉన్నాయని చెప్పారు.

సెల్‌ ఫోన్లు, ఎలక్ట్రిక్‌ వాహనాల బ్యాటరీల్లో లిథియాన్ని వినియోగిస్తారు. ప్రస్తుతం దేశంలో ఎలక్ట్రిక్ వాహనాల తయారీ, వాటి వినియోగానికి కేంద్ర ప్రభుత్వం అధిక ప్రాధాన్యత ఇస్తోన్న నేపథ్యంలో- ఈ లిథియం నిల్వలు బయటపడటం చర్చనీయాంశమౌతోంది. సలాల్ కోట్ లో జియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా అధికారులు సుమారు అయిదారేళ్లుగా తవ్వకాలు జరుపుతున్నారు. ఇదివరకే వాళ్లు ఈ ప్రాంతంలో బాక్సైట్ నిల్వలను గుర్తించారు.

Huge Lithium deposits found in Jammu Kashmirs Salalkote in Reasi, GSI was working on it

ఇప్పుడు తాజాగా బాక్సైట్ మిశ్రమంలో గల లిథియం నిల్వలు భారీగా ఉన్నట్లు నిర్ధారించారు. 5.9 మిలియన్ టన్నుల వరకు లిథియం నిల్వలు ఉంటాయని పేర్కొన్నారు. లిథియం నిల్వలను గుర్తించిన తరువాత జీఎస్ఐ అధికారులు ఈ ప్రాంతాన్ని రాష్ట్ర ప్రభుత్వానికి అప్పగించింది. ఈ ప్రాంతాన్ని జీఎస్ఐ అధికారులు తమకు అప్పగించినట్లు రియాసీ జిల్లా కలెక్టర్ తెలిపారు. లిథియంతో పాటు బంగారానికి సంబంధించి 51 మినరల్‌ బ్లాకులు కూడా తమకు బదలాయించినట్లు వివరించారు.

Huge Lithium deposits found in Jammu Kashmirs Salalkote in Reasi, GSI was working on it

మొత్తం 51లో అయిదు బ్లాక్‌ లు బంగారానికి సంబంధించినవని, మిగిలినవి పొటాషియం, మాలిబ్డినం, బేస్‌ మెటల్స్‌ కు చెందినవని పేర్కొన్నారు. ఈ 51 బ్లాకులను బదలాయించిన రాష్ట్రాల్లో జమ్మూ కాశ్మీర్‌ తో పాటు ఆంధ్రప్రదేశ్‌, ఛత్తీస్‌గఢ్‌, గుజరాత్‌, జార్ఖండ్‌, కర్ణాటక, మధ్యప్రదేశ్‌, ఒడిశా, రాజస్థాన్‌, తమిళనాడు, తెలంగాణ ఉన్నాయి. జియోలాజికల్‌ సర్వే ఆఫ్‌ ఇండియా వ్యూహాత్మక ఖనిజాలపై 115 ప్రాజెక్టులు, ఎరువుల ఖనిజాలపై 16 ప్రాజెక్టులను ఏర్పాటు చేసింది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+