పోయెస్ గార్డెన్‌కు దీప, దీపక్! ఏం జరగబోతుంది?, భారీగా మోహరించిన పోలీసులు
దివంగత సీఎం జయలలిత మేనల్లుడు దీపక్, మేన కోడలు దీప పోయెస్ గార్డెన్ లోని వేద నిలయం వద్దకు వస్తున్నారన్న వార్తలు వెల్లువెత్తడంతో పోలీసులు వెంటనే అప్రమత్తమయ్యారు.
చెన్నై: తమిళ దివంగత సీఎం జయలలిత మరణం తర్వాత ఆమె రాజకీయ వారసులం మేమంటే మేమంటూ పలు అనూహ్య పరిణామాలు చోటు చేసుకున్న సంగతి తెలిసిందే. రాజకీయాల సంగతెలా ఉన్నా.. ఆమె ఆస్తులు ఎవరికి దక్కుతాయన్న దానిపై ఇప్పటికీ స్పష్టత లేదు.
సీఎంగా ఉన్న సమయంలో జయలలిత నివాసం పోయెస్ గార్డెన్ ను స్మారక కేంద్రంగా మారుస్తానని పన్నీర్ సెల్వం ప్రకటించగా.. ప్రస్తుతం పోయెస్ గార్డెన్ శశికళ బంధువర్గమైన మన్నార్ గుడి మాఫియా చేతుల్లో ఉన్న సంగతి తెలిసిందే.

జయ మరణం తర్వాత అనూహ్యంగా బలం పుంజుకుంటూ వస్తున్న ఆమె మేనకోడలు దీప జయకుమార్, మేనత్త ఆస్తులు తమకే దక్కుతాయని పలుమార్లు వ్యాఖ్యానించారు. జయ మేనల్లుడు దీపక్ సైతం అన్నాడీఎంకెలో శశికళ నాయకత్వానికి మద్దతు ప్రకటించినా.. ఆస్తుల విషయం వచ్చేసరికి మాత్రం మాట మార్చేశాడు.
జయలలిత ఆస్తులు ఎట్టి పరిస్థితుల్లోను తమకే చెందాలని దీపక్ గత నెల 23న స్పష్టం చేశారు. ఇప్పటిదాకా మాటలకే పరిమితమైన దీప, దీపక్.. ఇప్పుడు నేరుగా పోయెస్ గార్డెన్ ను స్వాధీనం చేసుకోవడానికి రంగంలోకి దిగుతున్నట్లుగా తెలుస్తోంది. వీరిద్దరు పోయెస్ గార్డెన్ లోని వేద నిలయం వద్దకు వస్తున్నారన్న వార్తలు వెల్లువెత్తడంతో పోలీసులు వెంటనే అప్రమత్తమయ్యారు.
భారీ సంఖ్యలో పోలీసులు ప్రస్తుతం పోయెస్ గార్డెన్ వద్ద మోహరించారు. వేదనిలయం లోపల, బయట మొత్తం పోలీసులే కనిపిస్తున్నారు. అయితే దీప, దీపక్ అక్కడకు వస్తున్నట్లు తమకెటువంటి సమాచారం లేదని, ఓ లాయర్ సోషల్ మీడియా ద్వారా ఈ విషయాన్ని వెల్లడించడంతో భారీ భద్రతను మోహరించాల్సి వచ్చిందని ఓ పోలీస్ అధికారి చెప్పినట్లు సమాచారం.
-
తమిళనాడు, బెంగాల్, అసోం, కేరళలో గెలిచేది వీళ్లే? ఆత్మసాక్షి సర్వేలో..! -
లబ్దిదారులకు రెండు ఉచిత వంటగ్యాస్ సిలిండర్లు, రూ. 2,500 రీఛార్జ్ రేషన్ కార్డ్ -
బంగారం ధరల్లో వరస్ట్ డౌన్ ఫాల్- 2008 తర్వాత -
40 దేశాల్లో.. అండర్ వరల్డ్ డాన్‌గా జూనియర్ ఎన్టీఆర్ విశ్వరూపం -
కోట్లకు పడగెత్తిన విజయ్ రైట్ హ్యాండ్ -
సిమెంట్- స్టీల్ ధరలు భారీగా పెంపు, ఇక నుంచి..!? -
ఏపీ ప్రభుత్వం మరో ఎన్నికల హామీ అమలు, రేపే ప్రారంభం..!! -
తిరుపతిలో ఎయిర్ పోర్టును తలదన్నేలా..!! -
ఏపీ ప్రజలకు డిసెంబర్ లోగా మరో బహుమానం.. ఫిక్స్ చేసిన సీఎం చంద్రబాబు -
బిగ్ షాక్: ఏప్రిల్ 1 నుంచి పెరగనున్న పెట్రోల్, డీజిల్ ధరలు.. -
రాహుల్ గాంధీతో డేటింగ్ కోరిక తీరలేదు - బాలీవుడ్ స్టార్ -
అనుష్క కొత్త సినిమా ట్రైలర్ రిలీజ్.. ప్రభాస్ బాహుబలిని మించి !!












Click it and Unblock the Notifications