మండల పూజ వేళ శబరిమల ఆలయం కీలక ప్రకటన..!!

శబరిమల అయ్యప్ప దేవాలయానికి భక్తులు పోటెత్తారు. ఈ నెల డిసెంబర్ 19న ఒక్క రోజునే ఆలయానికి 96 వేలకు పైగా భక్తులు దర్శనం చేసుకున్నారు. నవంబర్ 15 నుంచి డిసెంబర్ 19 వరకు మొత్తం 4,46130 మంది భక్తులు స్పాట్​ బుకింగ్ చేసుకున్నట్లు అధికారులు వెల్లడిం చారు. ఇక, ఈ నెల 26న శబరిమలలో మండల పూజ జరగనుంది. దీంతో పాటుగా వరుస సెలవు ల కారణంగా రద్దీ మరింత పెరిగే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. ఈ క్రమంలో ఆలయ అధికారులు కీలక ప్రకటన చేసారు.

రికార్డు స్థాయిలో దర్శనం
శబరిమల అయ్యప్ప ఆలయంలో ఈ సీజన్​లో అత్యధికంగా గురువారం ఒక్కరోజులోనే 96,007 మంది భక్తులు తరలి వచ్చారు. వారిలో 70,000 మంది వర్చువల్ బుకింగ్స్, స్పాట్ బుకింగ్స్ ద్వారా 22,121 మంది, పుల్మేడ్​ మీదుగా 3,016 మంది, ఎరుమేలి అటవీ మార్గం నుంచి 504 మంది భక్తులు వచ్చినట్లు ప్రకటనలో పేర్కొన్నారు. నవంబరు 16న ప్రారంభమైన మండల పూజ సీజన్, డిసెంబరు 26న సన్నిధానంలో జరిగే ప్రత్యేక పూజతో ముగియనుంది. ఈ క్రమంలో తొలు త అయ్యప్ప స్వామిని 'తంకా అంకి'తో అలంకరించిన తర్వాత, పవిత్రమైన బంగారు వస్త్రాన్ని ఉత్సవ ఊరేగింపుతో ఆలయానికి తీసుకొస్తారు. తర్వాత మండల పూజ నిర్వహిస్తారు.

Huge rush is expected as the sabarimala Mandala Puja to be held on 26th Dec

మండల పూజ వేళ
అయ్యప్ప స్వామి మండల పూజకు శబరిమల సిద్దం అవుతోంది. ఈ నెల 22న ఉదయం 7గంటలకు ప్రారంభంకానున్న తంగఅంకి రథం.. 25న సాయంత్రానికి శబరిమల సన్నిధానాన్ని చేరుకుంటుంది. పెరుగుతున్న రద్దీ కారణంగా మారకుట్టం వద్ద క్యూలైన్‌ను 2-3 గంటలపాటు నిలిపివేయాల్సి వచ్చిందన్నారు. క్రిస్మస్‌ సెలవుల నేపథ్యంలో కేరళీయులు కూడా మండల పూజకు వచ్చే అవకాశాలు ఉన్నాయి. మండల పూజ ముగిసే వరకూ ఎస్డీఆర్ఎఫ్ టీంలను మోహరించాలని అధికారులు నిర్ణయించారు. అదనపు పోలీసు బందోబస్తుతో పాటుగా తెలుగు, తమిళం, హిందీ సహా పలు భాషల్లో డిజిటల్‌ డిస్‌ప్లే బోర్డులను ఏర్పాటు చేస్తున్నారు.

అందరికీ దర్శనం
ఇక.. వృద్ధులు, చిన్నారుల సౌకర్యార్థం నడపండల్‌ వద్ద ప్రత్యేక క్యూలైన్లను ఏర్పాటు చేసి వారికి శీఘ్ర దర్శనానికి అనుమతించాలని నిర్ణయించారు. ఈ మండల పూజ సందర్భంగా డిసెంబర్ 22 నుంచి అయ్యప్ప దర్శనానికి దాదాపు లక్ష మందికిపైగా భక్తులు వచ్చే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. భక్తులు ప్రశాంతంగా అయ్యప్పను దర్శించుకునేలా ఏర్పాట్లు చేస్తున్నారు.భక్తుల సంఖ్య పెరిగినప్పటికీ, ఎలాంటి అదనపు ఆంక్షలు విధించకుండా భక్తులకు దర్శనం చేసుకునే లా ఏర్పాట్లు చేసినట్లు సన్నిధానం అధికారులు వెల్లడించారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+