Human sacrificer: మంత్రగాడు నరరూప రాక్షసుడు, నరబలికి ముందే హోటల్ లేడీస్ ను?

కొచ్చి/తిరువనంతపురం: కేరళ మహిళల నరబలి కేసులో పచ్చి నిజాలు ఒక్కొక్కటి బయటకు వస్తున్నాయి. ఇప్పటికే నాటు వైద్యుడు డాక్టర్ భగవాల్ సింగ్, లైలా దంపతులు, మంత్రగాడు మోహమ్మద్ షఫీని పలీసులు విచారణ చేసి వేర్వేరుగా స్టేట్ మెంట్లు తీసుకుంటున్నారు. పోలీసుల విచారణలో మంత్రగాడు మోహమ్మద్ షఫీ చెప్పిన సమాచారంతో పోలీసులు షాక్ అయ్యారని తెలిసింది. నరబలి ఇవ్వక ముందే ఇద్దరు మహిళలను హోటల్ కు పిలుచుకుని వెళ్లి వారి మీద అత్యాచారం చేశానని మంత్రగాడు మోహమ్మద్ షఫీ అంగీకరించాడని పోలీసు అధికారులు అంటున్నారు.

మహిళలను హోటల్ లో రేప్ చేసే సమయంలో మరో వ్యక్తి ఉన్నాడు ? అని వెలుగు చూడటంతో అతను ఎవరు ? అని పోలీసులు ఆరా తీస్తున్నారు. మంత్రగాడు మోహమ్మద్ షఫీ గురించి అనేక సంచలన విషయాలు వెలుగు చూశాయి.

కేరళలో నరబలి కలకలం

కేరళలో నరబలి కలకలం

కేరళలోని పతనంమిట్టలోని తిరువళ్లలో నివాసం ఉంటున్న నాటు వైద్యుడు భగవాల్ సింగ్ అలియాస్ డాక్టర్ భగవాల్ సింగ్ కు లైలా దంపతుల ఇంట్లో లాటరీ టిక్కెట్లు విక్రయించే పధ్మా, రోసలిన్ అనే ఇద్దరు మహిళలను నరబలి ఇచ్చారు. కేరళలో మహిళలను నరబలి ఇచ్చారని వెలుగు చూడటంతో దేశం మొత్తం కలకలం రేపింది.

హోటల్ లో మహిళలపై మంత్రగాడు?

హోటల్ లో మహిళలపై మంత్రగాడు?

గత జులై నెలలో రోసిలిన్ ను ఓ హోటల్ కు పిలుచుకుని వెళ్లిన మంత్రగాడు మోహమ్మద్ షఫీ ఆమె మీద అత్యాచారం చేసి కామం తీర్చుకున్నాడని పోలీసులు అంటున్నారు. తరువాత రోసలిన్ ను లొంగదీసుకుని ఆమెతో సరసాలు ఆడిన తరువాత అదే నెలలో నాటు వైద్యుడు భగవాల్ సింగ్ ఇంటిలో నరబలి ఇచ్చారని తెలిసింది.

పధ్మాను కూడా వదల్లేదు..... మంచానికి కట్టేసి?

పధ్మాను కూడా వదల్లేదు..... మంచానికి కట్టేసి?

సెప్టెంబర్ నెలలో పధ్మాను సైతం హోటల్ కు పిలుచుకుని వెళ్లి ఆమె మీద తాను అత్యాచారం చేశానని మంత్రగాడు మోహమ్మద్ షఫీ అంగీకరించాడని పోలీసులు అంటున్నారు. పధ్మాను భగవాల్ సింగ్, లైలాలు హత్య చేసే సమయంలో ఆమె ప్రైవేట్ పార్ట్స్ తాను కోసేశానని మోహమ్మద్ షఫీ అంగీకరించాడని పోలీసు అధికారులు అంటున్నారు.

సెక్స్ సినిమాల్లో చాన్స్ లు ఇప్పిస్తా

సెక్స్ సినిమాల్లో చాన్స్ లు ఇప్పిస్తా

మళయాలం రొమాన్స్ సినిమాలకు దేశవ్యాప్తంగా మంచి క్రేజ్ ఉన్న విషయం తెలిసిందే. షకీలా టైపు సెక్స్ సినిమాల్లో మీకు చాన్స్ ఇప్పిస్తానని రోసలిన్, పధ్మాలకు మోహమ్మద్ షఫీ ఆశ చూపించాడని పోలీసులు అంటున్నారు. సినిమా షూటింగ్ అని చెప్పి రోసలిన్, పధ్మాలను మంచాలకు కట్టేసి వారిని లైంగిక వేధింపులకు గురి చేశానని మోహమ్మద్ షఫీ అంగీకరించాడని పోలీసు అధికారులు అంటున్నారు.

 రేప్ కేసులో జైలుకు వెళ్లిన మంత్రగాడు

రేప్ కేసులో జైలుకు వెళ్లిన మంత్రగాడు

అనేక మంది సెక్స్ వర్కర్లతో మంత్రగాడు మోహమ్మద్ షఫీకి సంబంధాలు ఉన్నాయని పోలీసుల విచారణలో వెలుగు చూసింది. మహిళలతో నిత్యం ఎంజాయ్ చేస్తున్న మోహమ్మద్ షఫీ 72 ఏళ్ల మహిళ మీద అత్యాచారం చేసి జైలుకు వెళ్లి బెయిల్ మీద బయటకు వచ్చాడని ఓ సీనియర్ పోలీసు అధికారి స్థానిక మీడియాకు చెప్పారు.

బ్యాంక్ అకౌంట్ లేదు

బ్యాంక్ అకౌంట్ లేదు

డబ్బు కోసం మంత్రగాడు మోహ్మద్ షఫీ పధ్మా, రోసలిన్ అనే ఇద్దరు మహిళలను నరబలి ఇచ్చాడని పోలీసులు అన్నారు. నాటు వైద్యుడు భగవాల్ సింగ్ తో మోహమ్మద్ షఫీ భారీ మొత్తంలో డబ్బులు తీసుకున్నాడని పోలీసులు చెప్పారు. అయితే మంత్రగాడు మోహమ్మద్ షఫీకి ఇంత వరకు ఒక్క బ్యాంక్ అకౌంట్ కూడా లేదని పోలీసులు అన్నారు.

సోషల్ మీడియా అకౌంట్

సోషల్ మీడియా అకౌంట్

మంత్రగాడు మోహమ్మద్ షఫీ ఇంతకాలం అందరి దగ్గర చేతికే డబ్బులు తీసుకుంటున్నాడని, మొత్తం నగదు లావాదేవీలు చేస్తున్నాడని పోలీసు అధికారులు అంటున్నారు. బ్యాంక్ అకౌంట్ లేని మోహమ్మద్ షఫీ ఫేస్ బుక్ లో శ్రీదేవి పేరుతో నకిలి అకౌంట్ ప్రారంభించాడని, అతను ఇంతకాలం చేసిన నేరాలు ఒక్కొక్కటి అంగీకరిస్తున్నాడని కేరళ పోలీసులు తెలిపారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+