వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

పాము కుబుసంలా.. వింత వ్యాధితో బాధపడుతున్న అమ్మాయి..

వ్యాధి ప్రభావంతో ప్రతీ 45రోజులకోసారి షాలిని చర్మం.. పొలుసుల మాదిరి ఊడిపోతుంది. పాము తన కుబుసాన్ని విడిచిన తరహాలో.. షాలిని చర్మం కూడా వలిచేసినట్టుగా పొరలుపొరలుగా శరీరం నుంచి విడివడుతుంది.

|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీ: క్షణ క్షణం నరకం అన్న మాటలను 16ఏళ్లుగా ఆ అమ్మాయి ప్రత్యక్షంగా అనుభవిస్తోంది. పుట్టుకతో వచ్చిన చర్మవ్యాధి నిత్యం వేదనకు గురిచేస్తుంటే.. మౌనంగా బాధను భరిస్తూ కాలం వెళ్లదీస్తోంది.

మెరుగైన చికిత్స చేయించుకునేంత స్థోమత లేదు.. మామూలు వైద్యులు తమవల్ల కాదని చేతులెత్తేశారు.. ధీనంగా.. అందరి వింత చూపుల ముందు నిస్సహాయంగా బ్రతుకీడుస్తున్న 16ఏళ్ల షాలిని అనుభవిస్తున్న వేదన గురించి ఎంత చెప్పినా తక్కువే.

'Human snake' girl sheds her skin every two months because of ultra-rare condition

రెడ్ మ్యాన్ సిండ్రోమ్ గా పరిగణించే ఎరిథ్రోడెర్మా అనే వ్యాధితో షాలిని బాధపడుతోంది. వ్యాధి ప్రభావంతో షాలిని శరీరంలో నీటిశాతం ఎప్పటికప్పుడు పడిపోతూనే ఉంటుంది. ఆ వెంటనే చర్మాన్ని నీటితో తడపాలి. ప్రతీ మూడు గంటలకొకసారి మాయిశ్చరైజ్ చేయాలి.

వ్యాధి ప్రభావంతో ప్రతీ 45రోజులకోసారి షాలిని చర్మం.. పొలుసుల మాదిరి ఊడిపోతుంది. పాము తన కుబుసాన్ని విడిచిన తరహాలో.. షాలిని చర్మం కూడా వలిచేసినట్టుగా పొరలుపొరలుగా శరీరం నుంచి విడివడుతుంది.

షాలిని చిన్నప్పటి నుంచి ఈ వ్యాధితో తీవ్ర వేదనకు గురవుతోందని తల్లి దేవ్ కున్వర్ తెలిపారు. షాలిని తండ్రి రాజ్ బహదూర్ ఓ సాధారణ కూలీ కావడంతో మెరుగైన చికిత్స అందించేంత స్థోమత వారికి లేదు.

తలభాగం నుంచి కాలి చిటికెన వేలు వరకు.. చర్మం పొలుసులు పొలుసులుగా ఊడిపోతుంటే.. కుమార్తె బాధను చూడలేకపోతున్నానని రాజ్ బహదూర్ కన్నీళ్లు పెట్టుకున్నారు. వ్యాధితో బాధపడుతున్న షాలిని మాటలు ప్రతీ ఒక్కరిని చలింపజేసేవిగా ఉన్నాయి. తనకు చదువుకోవాలన్న ఆశ ఉన్నప్పటికీ.. వ్యాధి కారణంగా స్కూల్ కు రానివ్వడం లేదని షాలిని చమర్చిన కళ్లతో చెబుతోంది.

నేనేం పాపం చేశానని నాకెందుకీ శిక్ష.. ఇలా ఇంకెంత కాలం.. నాకూ బతకాలని ఉంది.. వీలైతే ఎవరైనా సహాయం చేయండి? అంటూ షాలిని కన్నీటిపర్యంతమవుతోంది. షాలిని బాధను చూసిన వారు ఆమెకు మెరుగైన వైద్యం అంది సాధారణ జీవితాన్ని గడపాలని ఆశిస్తున్నారు.

English summary
A teenage girl who sheds her skin every two months because of an ultra-rare condition has been cruelly likened to a 'human snake.'
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X