సిద్దూ పంచ్: నిరహార దీక్ష చేస్తా.. చన్నీకి చుక్కలు చూపిస్తోన్న పీసీసీ చీఫ్

మొన్నటి వరకు అమరీందర్ సింగ్‌ను నిద్రపోనివ్వలేదు సిద్దూ.. ఇప్పుడు సీఎం చరణ్ జిత్ సింగ్‌కు కూడా కొరకరానీ కొయ్యగా మారాడు. ఏదో అంశం పేరుతో నిద్రపట్టనివ్వడం లేదు. ఎన్నికల సమీపిస్తోన్న వేళ.. కాంగ్రెస్ హై కమాండ్ చూసి చూడనట్టు వదిలేయగా.. చన్నీని ఇబ్బంది పెడుతున్నాడు. తాజాగా తమ ప్రభుత్వంపై విరుచుకుపడ్డారు.

 బహిర్గతం చేయండి..

బహిర్గతం చేయండి..

గురు గ్రంథ్ సాహిబ్‌ను అపవిత్రం చేయడం, మాదక ద్రవ్యాల మాఫియాపై నివేదికలను తక్షణమే చరణ్ జీత్ సింగ్ చన్నీ ప్రభుత్వం బహిర్గతం చేయాలని డిమాండ్ చేశారు. లేదంటే నిరాహార దీక్ష చేస్తానని హెచ్చరించారు. మోగాలోని బాఘ పురానాలో కాంగ్రెస్ కార్యకర్తలను ఉద్దేశించి గురువారం ప్రసంగించారు. డ్రగ్ మాఫియాపై కఠిన చర్యలు తీసుకుంటామని రెండు నెలల క్రితం సీఎం చన్నీ చెప్పారని సిద్ధూ గుర్తు చేశారు.

కొత్తేమీ కాదు

కొత్తేమీ కాదు

సొంత పార్టీపై సిద్ధూ విమర్శలు చేయడం కొత్త కాదు. అమరీందర్‌ సింగ్‌ సీఎంగా ఉన్నప్పుడు కూడా పలు ఆరోపణలు చేశారు. సిద్ధూను పీసీసీ చీఫ్‌గా చేయడంతో ఆగ్రహించిన అమరీందర్‌ సింగ్‌ సీఎం పదవికి రాజీనామా చేయడంతోపాటు కాంగ్రెస్ పార్టీని వీడారు. అనంతరం చరణ్‌జిత్ సింగ్ చన్నీ సీఎం కాగా, ఆయనపైనా సిద్ధూ అసంతృప్తి వ్యక్తం చేశారు. తనకు సమాచారం ఇవ్వకుండా కీలక నిర్ణయాలు తీసుకోవడంపై ఆగ్రహిస్తూ పీసీసీ చీఫ్‌ పదవికి రాజీనామా చేశారు. అయితే సీఎం చన్నీతోపాటు పార్టీ హైకమాండ్ బుజ్జగింపులతో తన రాజీనామాను వెనక్కి తీసుకున్నట్లు సిద్ధూ ఇటీవల ప్రకటించిన విషయం తెలిసిందే.

కొరకరానీ కొయ్య

కొరకరానీ కొయ్య

కాంగ్రెస్ పార్టీకి సిద్దు కొరకరానీ కొయ్యగా మారాడు. సీఎం పదవీపై కన్నేసిన.. అతనికి ఇవ్వలేదు. పీసీసీ చీఫ్ పదవీ ఇచ్చి.. బుజ్జగించింది. అంతకుముందు అమరీందర్‌తో సిద్దూకు గొడవలు ఉండేవి. దీంతో సిద్దూ క్యాబినెట్ నుంచి బయటకు వచ్చారు. పీసీసీ పదవీకి కూడా రాజీనామా చేశారు. ఢిల్లీ వేదికగా రాజకీయాలు జరిగాయి. ఇద్దరు రాజీనామాలు చేయడంతో.. పరిణామాలే మారిపోయాయి. కానీ సిద్దు వెనక్కి తగ్గగా.. అమరీందర్ మాత్రం పార్టీకి రాజీనామా చేశారు. బీజేపీలో చేరక.. సొంతంగా పార్టీ పెడతానని చెప్పారు.

 పంజాబ్ ఎన్నికల గురించే..

పంజాబ్ ఎన్నికల గురించే..

ఇప్పుడు పంజాబ్ ఎన్నికల గురించి అంతా చర్చ జరుగుతుంది. విజయం కోసమే ప్రధాన పార్టీలు ఫోకస్ చేశాయి. వారిలో కాంగ్రెస్ ముందు వరసలో ఉండగా.. బీజేపీ కూడా ఛాన్స్ వదులుకోవడం లేదు. అందుకే వ్యవసాయ చట్టాలను వెనక్కి తీసుకుంటామని చెప్పింది. అమరీందర్ కూడా వెనక్కి తగ్గడం లేదు. వీరే కాక.. ఆప్ నుంచి కేజ్రీవాల్ కూడా ఫస్ట్ ప్లేస్‌లో ఉన్నారు. తమ పార్టీ మెజార్టీ సీట్లు సాధించడంపై ఫోకస్ చేశారు. అందుకే ఇటీవల అందరినీ కలుపుకొని వెళుతున్నారు. అందరిపై ప్రశంసలు కురిపిస్తున్నారు. సో పంజాబ్ ఎన్నికల రేసు ఇలా ఉంది. వచ్చే ఏడాది జరిగే పోరులో ఎవరూ విజయం సాధిస్తారో చూడాలీ మరీ.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+