భార్య మద్యం తాగొచ్చిందని.. నేలకేసి కొట్టి చంపిన భర్త!
ఝార్ఖండ్‌లోని పలాము జిల్లాలో దారుణం చోటుచేసుకుంది. మద్యం మత్తులో ఉన్న భార్యాభర్తల మధ్య వాగ్వాదం తీవ్రం కావడంతో తన భార్యను ఎత్తి నేలపై బలంగా కొట్టడంతో ఆమె అక్కడికక్కడే ప్రాణాలు విడిచింది. ఈ ఘటనకు సంబంధించి పోలీసులు భర్తను అరెస్ట్ చేశారు.
పోలీసులు వెల్లడించిన వివరాల ప్రకారం.. జార్ఖండ్‌లోని పలాము జిల్లా రామ్‌గఢ్ పోలీస్ స్టేషన్ పరిధిలోని దాతమ్ బడి ఝరియాలో ఉపేంద్ర పరియా(25), శిల్పి దేవి(22)లు నివసిస్తున్నారు. సోమవారం రాత్రి ఉపేంద్ర పరియా తన ఇంట్లో మద్యం మత్తులో ఉన్నాడు. అదే సమయంలో అతని భార్య శిల్పిదేవి కూడా మద్యం సేవించి ఇంటికి తిరిగి వచ్చింది.

భార్య మద్యం తాగి ఇంటికి రావడాన్ని చూసి ఉపేంద్ర కోపంతో ప్రశ్నించాడు. దీంతో ఇద్దరి మధ్య తీవ్ర వాగ్వాదం మొదలైంది. వాగ్వాదం మరింత తీవ్రం కావడంతో ఉపేంద్ర ఆవేశంతో శిల్పిని కొట్టడం ప్రారంభించాడు. అనంతరం ఒక్కసారిగా ఆమెను పైకి ఎత్తివేసి, నేలపై బలంగా విసిరి కొట్టాడు. తీవ్ర గాయాలపాలైన శిల్పి దేవి అక్కడికక్కడే మరణించింది.
నిందితుడైన భర్త ఉపేంద్ర పరియాను పోలీసులు మంగళవారం మధ్యాహ్నం అరెస్ట్ చేశారు.: శిల్పి దేవి మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం మేదినిరాయ్ మెడికల్ కాలేజ్ అండ్ హాస్పిటల్‌కు తరలించారు. ఉపేంద్ర పరియా, శిల్పి దేవిలకు మూడేళ్ల క్రితం వివాహమైంది. ఈ దంపతులకు ఒక చిన్నారి కూడా ఉన్నట్లు పోలీసులు వెల్లడించారు.












Click it and Unblock the Notifications