వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

అసభ్యకరంగా వీడియో తీశాడు: భర్తని రోడ్డుపై పరుగెత్తించి కొట్టింది

By Srinivas
|
Google Oneindia TeluguNews

లక్నో: తనను అసభ్యకరంగా వీడియో తీసి దారుణంగా ప్రవర్తిస్తున్నాడని ఓ భార్య తన భర్తను చితకబాదింది. ఈ సంఘటన ఉత్తర ప్రదేశ్ రాష్ట్రంలోని బిజ్నోర్‌లో జరిగింది.

స్థానిక జిల్లా మాజీ కాంగ్రెస్ అధ్యక్షుడు అల్లుడు ఆకాశ్ వర్మ ఓ రెస్టారెంటులో భోజనం చేస్తున్నాడు. ఇంతలో ఉన్నట్టు ఉండి ఆకాశ్ భార్య, ఆమె తల్లి, సోదరుడు అక్కడకు వచ్చారు.

ఆకాశ్ చొక్క పట్టుకొని అందరిముందు చితకబాదారు. అంతేకాదు, రోడ్డు పైన పరుగెత్తించి కొట్టారు. అనంతరం పోలీసులకు అప్పగించారు.

బాధితురాలు పోలీసులకు తెలిపిన వివరాల ప్రకారం.. గత కొన్ని రోజులుగా భర్త ఆమెను కట్నం కోసం వేధిస్తున్నాడు. కట్నం ఇవ్వనందుకు అసభ్యకర వీడియోలు చిత్రీకరించాడని ఫిర్యాదులో పేర్కొంది.

 husband beaten by wife in uttar pradesh

శతాబ్ది ఎక్స్‌ప్రెస్ ఢీకొని ఆరుగురు మృతి

పశ్చిమ బెంగాల్‌లోని మాల్దా జిల్లాలో శతాబ్ది ఎక్స్‌ప్రెస్ రైలు ఢీకొని ఆరుగురు వ్యక్తులు మృతిచెందారు. రైల్వే లెవల్ క్రాసింగ్ వద్ద పట్టాలు దాటుతుండగా ఈ ప్రమాదం చోటుచేసుకుంది.

ముంబై - పుణె ఎక్స్‌ప్రెస్ హైవేపై విరిగిపడ్డ కొండచరియలు

ముంబై - పుణె ఎక్స్‌ప్రెస్ హైవేపై కొండచరియలు విరిగిపడ్డాయి. అదోషి టన్నెల్ వద్ద గతంలో ఇదే ప్రాంతంలో కొండచరియలు విరిగిపడిన ఘటనలు చోటుచేసుకున్నాయి. ఈ ప్రమాదంలో వాహనదారులెవరూ గాయపడలేదు.

వాహనాల రాకపోకలు నిలిచిపోయాయి. దీంతో అధికారులు పాత హైవే మార్గం గుండా వాహనాల మళ్లింపును చేపట్టారు. రహదారి పునరుద్ధరణకు అధికారులు ఇటాలియన్ ఇంజనీరింగ్ నిర్మాణ నైపుణ్యంలో కొండచరియల పటిష్టతకు చర్యలు చేపట్టారు.

English summary
husband beaten by wife in uttar pradesh
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X