• search
  • Live TV
చెన్నై వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  

blackmail: భార్య నగ్న వీడియోలు వేలం, రెండో భర్తకు అర్దకేజీ నగలు, రూ. 20 లక్షలు, ఫ్యామిలీ !

|

విజయవాడ/ నెల్లూరు/ చెన్నై: మొదటి భర్త మోసం చేశాడని భార్య అతనికి దూరం అయ్యింది. మహిళ దగ్గర భారీ మొత్తంలో బంగారు నగలు, డబ్బులు ఉన్నాయని తెలుసుకున్న శ్రీనివాసరెడ్డి అనే వ్యక్తి ఆమెను నమ్మించాడు. ఆవేదనతో ఉన్న లేడీ అకౌంటెంట్ తో దగ్గరైన శ్రీనివాసరెడ్డి తాను మొదటి భార్యకు విడాకులు ఇచ్చానని ఆమెను పెళ్లి చేసుకున్నాడు. తరువాత శ్రీనివాసరెడ్డి మొదటి భార్య, అతని తల్లి, బావమరిది కలిసి రెండో భార్య స్నానం చేస్తున్న సమయంలో నగ్న వీడియోలు తీసి ఆమె శీలాన్ని రూ. 20 లక్షలకు వేలం పెట్టారు. అప్పటికే అర్దకేజీ నగలు, బియ్యం వ్యాపారం కోసం రూ. 14 లక్షలు తీసుకున్నాడు. మొదటి భార్యకు విడాకులు ఇవ్వడానికి రూ. 6 లక్షలూ లూటీ చేసిన శ్రీనివాసరెడ్డి ఫ్యామిలీ ఇప్పుడు నగ్న వీడియోలతో బ్లాక్ మెయిల్ చెయ్యడంతో పోలీసులు రంగంలోకి దిగారు.

TikTok: డబుల్ బెడ్ రూమ్ హౌస్, తల్లి టీ 20, కూతురు వన్ 'డే'మ్యాచ్ లు, ఇంట్లోనే లవర్స్, చివరికి !

 లేడీ అకౌంటెంట్, కాంట్రాక్టర్

లేడీ అకౌంటెంట్, కాంట్రాక్టర్

తమిళనాడులోని నెలై జిల్లాకు చెందిన 35 ఏళ్ల మహిళ, అదే జిల్లాకు చెందిన వ్యక్తి 2006లో వివాహం చేసుకున్నారు. ఈ దంపతులకు 12 ఏళ్ల కుమారుడు ఉన్నాడు. మహిళ అకౌంటెంట్ గా, భర్త కాంట్రాక్టర్ గా పని చేస్తున్నారు. కొడుకు చదువుతున్న స్కూల్ టీచర్ తో ఆ కాంట్రాక్టర్ అయిన భర్త అక్రమ సంబంధం పెట్టుకున్నాడు. భార్యను పట్టించుకోకుండా స్కూల్ టీచర్ తో భర్త ఎంజాయ్ చెయ్యడం మొదలుపెట్టాడు. లేడీ అకౌంటెంట్, కాంట్రాక్టర్ దంపతులు చెన్నైలోని నివాసం ఉంటున్నారు. తన భర్త తన కొడుకు చదువుతున్న స్కూల్ లో టీచర్ తో అక్రమ సంబంధం పెట్టుకున్నాడని తెలుసుకున్న భార్య గొడవపెట్టుకునింది. ఈ గొడవ పెద్దది కావడంతో నువ్వు స్కూల్ టీచర్ తోనే చచ్చిపోరా అంటూ లేడీ అకౌంటెంట్ భర్తకు దూరం అయ్యింది.

 శ్రీనివాసరెడ్డి ఎంట్రీ

శ్రీనివాసరెడ్డి ఎంట్రీ

భర్తకు దూరం అయిన లేడీ అకౌంటెంట్, కొడుకుతో కలిసి చెన్నైలోనే వేరుగా నివాసం ఉంటున్నది. భర్తకు దూరం అయిన లేడీ అకౌంటెంట్ వ్యాపారపరంగా భర్త కాంట్రాక్టు పనుల అకౌంట్స్ మాత్రం చూసుకుంటున్నది. అదే సమయంలో ఆంధ్రప్రదేశ్ లోని నెల్లూరు జిల్లా చంద్రయ్యపాళ్యంకు చెందిన శ్రీనివాసరెడ్డి అనే వ్యక్తితో లేడీ అకౌంటెంట్ కు పరిచయం అయ్యింది.

 మాయ చేసి రెండో పెళ్లికి స్కెచ్

మాయ చేసి రెండో పెళ్లికి స్కెచ్

భర్తను వదిలేసి నువ్వు ఎంతకాలం ఒంటరిగా ఉంటావని, నిన్ను, నీ కొడుకు నేను పువ్వులో పెట్టుకుని చూసుకుంటానని శ్రీనివాసరెడ్డి లేడీ అకౌంటెంట్ ను నమ్మించాడు. అదే సమయంలో తాను స్కూల్ టీచర్ స్నేహం వదిలేశానని, నీతోనే జీవితాంతం ఉంటానని, నన్ను నమ్మాలని ఆమె మొదటి భర్త వెళ్లాడు. మొదటి భర్తతో ఉండటానికి లేడీ అకౌంటెంట్ నిరాకరించింది. ఇదే మంచి అవకాశం అంటూ శ్రీనివాసరెడ్డి రెండో పెళ్లి చేసుకోవడానికి సిద్దం అయ్యాడు.

 అర్దకేజీ నగలు, రూ. 14 లక్షలు

అర్దకేజీ నగలు, రూ. 14 లక్షలు

తాను మొదటి భార్యకు విడాకులు ఇచ్చానని లేడీ అకౌంటెంట్ ను నమ్మించిన శ్రీనివాసరెడ్డి 2018లో కుటుంబ సభ్యుల సమక్షంలో లేడీ అకౌంటెంట్ ను రెండో పెళ్లి చేసుకుని చెన్నైలోని తిరువోట్టియూర్ ప్రాంతంలో కాపురం పెట్టాడు. పెళ్లి సమయంలో శ్రీనివాసరెడ్డికి 480 గ్రాముల బంగారు నగలు, బియ్యం వ్యాపారం చేసుకోవడానికి రూ. 14 లక్షల నగదును లేడీ అకౌంటెంట్ ఇచ్చింది.

 నేను లేను.... నువ్వు గర్బవతి ఎలా అయ్యావు ?

నేను లేను.... నువ్వు గర్బవతి ఎలా అయ్యావు ?

గత ఏడాది లేడీ అకౌంటెంట్ మూడు నెలల గర్బవతి అయ్యింది. తాను రెండు నెలలు ఇంట్లో లేనని, వ్యాపారం మీద బయటకు వెళ్లానని, ఇలాంటి సమయంలో నువ్వు గర్బవతి ఎలా అయ్యావు ? అంటూ శ్రీనివాసరెడ్డి రెండో భార్యతో గొడవ పెట్టుకున్నాడు. రెండో భార్యకు అబార్షన్ కావడానికి మందులు ఇవ్వడంతో ఆమె గర్బం పోయింది. తరువాత శ్రీనివాసరెడ్డి రెండో భార్య ఇంటికి వెళ్లకుండా తప్పించుకుని తిరిగాడు. లేడీ అకౌంటెంట్ అనుమానం వచ్చి ఆరా తియ్యగా మొదటి భార్య పద్మావతి, తల్లి చంద్రకళ, బావమరిది కిశోర్ తో కలిసి చెన్నైలోని మాధవరంలో శ్రీనివాసరెడ్డి కాపురం ఉంటున్నాడని వెలుగు చూసింది.

 రాజీకి రావాలని నగ్న వీడియోలు తీశారు

రాజీకి రావాలని నగ్న వీడియోలు తీశారు

నువ్వు మొదటి భార్య పద్మావతికి విడాకులు ఇవ్వకుండా నన్ను మోసం చేశావని, తన దగ్గర తీసుకున్న అర్దకేజీ బంగారు నగలు, రూ. 14 లక్షలు తిరిగి ఇవ్వాలని, లేదంటే పోలీసు కేసు పెడుతానని లేడీ అకౌంటెంట్ శ్రీనివాసరెడ్డిని హెచ్చరించింది. నీతో మాట్లాడాలని, రాజీ చేసుకుందామని శ్రీనివాసరెడ్డి తల్లి చంద్రకళ లేడీ అకౌంటెంట్ ను నమ్మించి మాధవరంలోని ఇంటికి పిలిపించుకుంది. తరువాత తన కొడలు పద్మావతికి రూ. 8 లక్షలు ఇస్తే ఆమె శ్రీనివాసరెడ్డికి విడాకులు ఇవ్వడానికి సిద్దంగా ఉందని, తరువాత నువ్వు, నాకొడుకు హ్యాపీగా ఉంటారని చంద్రకళ లేడీ అకౌంటెంట్ ను నమ్మించింది. రెండో భర్త శ్రీనివాసరెడ్డి తల్లి మాయమాటలు చెప్పడంతో లేడీ అకౌంటెంట్ కొన్ని రోజులు మాధవరం లోని వారి ఇంటిలోనే ఉండిపోయింది. ఆ సమయంలో లేడీ అకౌంటెంట్ బాత్ రూమ్ లో స్నానం చేస్తున్న సమయంలో శ్రీనివాసరెడ్డి బావమరిది కిశోర్ ఆమె నగ్న వీడియోలు తీశాడు.

 రూ. 20 లక్షలకు నగ్న వీడియోలు వేలం

రూ. 20 లక్షలకు నగ్న వీడియోలు వేలం

శ్రీనివాసరెడ్డికి అతని మొదటి భార్య విడాకులు ఇవ్వడానికి రూ. 6 లక్షలు ఇచ్చిన లేడీ అకౌంటెంట్ తరువాత ఆమె ఇంటికి వెళ్లిపోయింది. తరువాత కిశోర్ లేడీ అకౌంటెంట్ కు నగ్న వీడియోలను వాట్సాప్ లో పంపించి రూ. 20 లక్షలు ఇవ్వాలని, లేదంటే ఈ వీడియోలు సోషల్ మీడియాలో పోస్టు చేస్తానని బెదిరించాడు. ఇదే సమయంలో రూ. 20 లక్షలు ఇవ్వాలని రెండో భర్త శ్రీనివాసరెడ్డి, అతని మొదటి భార్య పద్మావతి, అతని తల్లి చంద్రకళ, బావమరిది కిశోర్ బ్లాక్ మెయిల్ చెయ్యడం మొదలు పెట్టారు. నన్ను నిలువునా ముంచేశారని గుర్తించిన లేడీ అకౌంటెంట్ చెన్నై పోలీసులకు ఫిర్యాదు చేసింది. విషయం తెలుసుకున్న శ్రీనివాసరెడ్డి ,అతని మొదటి భార్య పద్మావతి, తల్లి చంద్రకళ, బావమరిది కిశోర్ మాయం అయ్యారు.

 ఆంధ్రాలో 20 కేసులు

ఆంధ్రాలో 20 కేసులు

ఆంధ్రప్రదేశ్ లోని తిరుపతి, నెల్లూరు, ఒంగోలు, ఉదయగిరి తదితర పోలీస్ స్టేషన్ లో శ్రీనివాసరెడ్డి మీద వ్యభిచారం చేయిస్తున్నాడని, అమ్మాయిలను బ్లాక్ మెయిల్ చేశాడని, మహిళలను మోసం చేశాడని 20కి పైగా కేసులు ఉన్నాయని చెన్నై పోలీసుల విచారణలో వెలుగు చూసింది. చిత్తూరు, తిరుపతి, నెల్లూరు, ఒంగోలు పోలీసుల సహాయంతో శ్రీనివాసరెడ్డి అతని కుటుంబ సభ్యుల కోసం చెన్నై సిటీ పోలీసులు గాలిస్తున్నారు.

English summary
Husband blackmail: Woman threatened by second husband's family by taking her bathing video in Chennai. Police searches second husband's family.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X