ప్రియుడితో భార్య రాసలీలల్లో, పథకం ప్రకారం పట్టుకొన్న భర్త

భర్త చెప్పినా ప్రియుడితో సంబంధాలు వదల్లేదు. ఈ సంబంధాలను వదులుకోవాలని చెప్పినందుకు భర్తను వదిలేసి పుట్టింటికి వెళ్ళింది. అయితే ప్రియుడితో భార్య కలసి ఉన్న సమయంలో రెడ్ హ్యాండెడ్ గా పట్టించాడు భర్త, ఈ ఘట

చెన్నై: భర్త చెప్పినా ప్రియుడితో సంబంధాలు వదల్లేదు. ఈ సంబంధాలను వదులుకోవాలని చెప్పినందుకు భర్తను వదిలేసి పుట్టింటికి వెళ్ళింది. అయితే ప్రియుడితో భార్య కలసి ఉన్న సమయంలో రెడ్ హ్యాండెడ్ గా పట్టించాడు భర్త, ఈ ఘటన తమిళనాడు రాష్ట్రంలో చోటుచేసుకొంది.

తమిళనాడు రాష్ట్రంలోని ముక్కనూరు గ్రామానికి చెందిన కుమార్ కు కొన్నేళ్ళ క్రితం వివాహమైంది.అయితే వీరికి ఐదేళ్ళ కుమార్తె కూడ ఉంది. వివాహమైన కొద్దిరోజుల్లోనే కుమార్ సింగపూర్ కు వెళ్ళాడు.అయితే భర్త సింగపూర్ కు వెళ్ళగానే భార్యకు అదే ప్రాంతానికి చెందిన దేవేంద్రన్ తో వివాహేతర సంబంధం ఏర్పడింది.

Husband catched when his wife having extramarital affair with lover

ఈ వ్యవహారం కుమార్ తల్లిదండ్రులకు తెలిసింది. దీంతో సింగపూర్ లోని తన కుమారుడికి విషయాన్ని చేరవేశారు. స్వంత గ్రామానికి వచ్చిన కుమార్ ప్రియుడితో ఉన్న సంబంధాన్ని వదులుకోవాలని భార్యన హెచ్చరించాడు. అయినా ఆమెలో మార్పు రాలేదు. దీంతో భార్య, భర్తల మధ్య గొడవలు జరిగాయి.

ఈ గొడవల కారణంగా భార్య తన పుట్టింటికి వెళ్ళింది.అయితే భార్యను తీసుకువచ్చేందుకు భర్త కుమార్ వెళ్ళలేదు.కుమార్ సింగపూర్ కు వెళ్ళకుండా సేలంలోని బేకరీలో పనికి కుదిరాడు.

అదే సమయంలో కుక్కనూరు నుండి దేవేంద్రన్ తరచూ విలగనత్తంకు వెళుతూ వచ్చాడు. ఈ వ్యవహారం కుమార్ కు తెలిసింది.దీంతో ప్రియుడితో భార్య ఉన్న సమయంలో రెండ్ హ్యాండెడ్ గా పట్టుకోవాలని ప్లాన్ చేశాడు.

ఆదివారం నాడు దేవేంద్రన్ పై కుమార్ నిఘా ఉంచాడు. రాత్రి 11 గంటల సమయంలో తన భార్య ఇంట్లోనే దేవేంద్రన్ ఉన్న విషయాన్ని కుమార్ తెలుసుకొన్నాడు. వెంటనే ఆయన అక్కడికి చేరుకొన్నాడు. ఇంటి బయటనే తలుపులకు తాళం వేసి కేకలు వేశాడు.స్థానికులు రాగానే వారి సమక్షంలోనే తలుపులు తెరిచాడు. స్థానికులు వారిని పోలీసులకు అప్పగించారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+