Illegal affair: ప్రియుడితో లేచిపోయిన భార్య, సెల్ ఫోన్ టవర్ ఎక్కిన భర్త, నా పెళ్లామ్ నాకు !
చెన్నై/ సేలం: లారీ డ్రైవర్ గా పని చేస్తున్న యువకుడు ఓ యువతిని వివాహం చేసుకుని జీవనం సాగిస్తున్నాడు. ఇద్దరు పిల్లలు పుట్టిన తరువాత భార్యకు మెదడులో పురుగు దూరినట్లు ఉందోమో ఆమె తప్పుదోవ పట్టింది. లారీ డ్రైవర్ అయిన భర్త నెలలో రెండు మూడు వారాలు బయట తిరుగుతున్నాయి. ఇదే సమయంలో ఇంట్లో పిల్లలతో కలిసి ఉంటున్న భార్య 24 గంటలు అందుబాటులో ఉండే ఓ యువకుడికి దగ్గర అయ్యింది. లారీ తీసుకుని బయటకు వెళ్లి పోతున్న భర్త ఆ లారీని తోలుకుంటున్నాడు. అందుబాటులో ఉంటున్న ప్రియుడు అతని భార్యతో ఎంజాయ్ చేస్తున్నాడు.
బయటకు వెలుతున్న భర్త తిరిగిరావడానికి వారాలు వారాలు పట్టడంతో ఇంట్లో విరహంతో ఉంటున్న భార్య ఆమె ప్రియుడితో మస్త్ మజా చేసింది. భర్త కంటే ప్రియుడు ఎక్కువ సుఖపెడుతున్నాడని అనుకున్న భార్య నెల రోజుల క్రితం భర్త, ఇద్దరు పిల్లలను వదిలేసి ప్రియుడితో జెండా ఎత్తేసింది. తన భార్య కనపడటం లేదని భర్త కేసు పెట్టాడు. నెల రోజులు అయినా పోలీసులు తన భార్య ఆచూకి కనిపెట్టలేదని రగిలిపోయిన భర్త ఇంంజనీరింగ్ కాలేజ్ పక్కనే ఉన్న సెల్ ఫోన్ టవర్ ఎక్కి పోలీసు అధికారులకు, స్థానికులకు చుక్కలు చూపించాడు.
Illegal affair: ప్రియుడికి రిజర్వేషన్, భర్తకు వెయిటింగ్ లిస్ట్, తట్టుకోలేక థ్రిల్లర్ సినిమా స్కెచ్ !

ఎంజాయ్ చెయ్యాలని పెళ్లి చేసుకున్నాడు
తమిళనాడులోని సేలంలోని కరుప్పూర్ సమీపంలోని సామినాయన్ పట్టి ప్రాంతంలో విజయ్ కుమార్ అనే వ్యక్తి నివాసం ఉంటున్నాడు. కొన్ని సంవత్సరాల క్రితం కుటుంబ సభ్యులు చూపించిన సంధ్యా అనే యువతిని విజయ్ కుమార్ వివాహం చేసుకున్నాడు. విజయ్ కుమార్, సంధ్యా దంపతులకు ఇద్దరు పిల్లలు ఉన్నారు.

భర్త లారీ డ్రైవర్
విజయ్ కుమార్ లారీ డ్రైవర్ గా పని చేస్తున్నాడు. సంధ్యాను వివాహం చేసుకోక ముందునుంచే విజయ్ కుమార్ లారీ డ్రైవర్. భార్య సంధ్యాతో పాటు ఇద్దరు పిల్లలను పోషించడానికి విజయ్ కుమార్ ఎక్కువగా డ్యూటీలు చేస్తున్నాడు. ఇద్దరు పిల్లలు పుట్టిన తరువాత భార్య సంధ్యాకు మెదడులో పురుగు దూరినట్లు ఉందోమో ఆమె తప్పుదోవ పట్టింది.

భర్తకు డ్యూటీలు..... 24 గంటలు అందుబాటులో ప్రియుడు
లారీ డ్రైవర్ అయిన భర్త విజయ్ కుమార్ నెలలో రెండు మూడు వారాలు బయట తిరుగుతున్నాడు. ఇదే సమయంలో ఇంట్లో పిల్లలతో కలిసి ఉంటున్న భార్య సంధ్యా 24 గంటలు అందుబాటులో ఉండే ఓ రాజేష్ అనే యువకుడికి దగ్గర అయ్యింది. లారీ తీసుకుని బయటకు వెళ్లి పోతున్న భర్త విజయ్ కుమార్ ఆ లారీని తోలుకుంటున్నాడు. అందుబాటులో ఉంటున్న ప్రియుడు రాజేష్ విజయ్ కుమార్ భార్య సంధ్యాతో ఎంజాయ్ చేస్తున్నాడు.

ప్రియుడితో మజా చేయ్యాలని జెండా ఎత్తేసిన భార్య
లారీని తీసుకుని ఎక్కువగా బయట రాష్ట్రాలకు వెలుతున్న భర్త విజయ్ కుమార్ తిరిగిరావడానికి వారాలు వారాలు పట్టడంతో ఇంట్లో విరహంతో ఉంటున్న అతని భార్య సంధ్యా ఆమె ప్రియుడు రాజేష్ తో మస్త్ మజా చేసింది. భర్త విజయ్ కుమార్ కంటే ప్రియుడు ఎక్కువ సుఖపెడుతున్నాడని అనుకున్న భార్య సంధ్యా నెల రోజుల క్రితం భర్త, ఇద్దరు పిల్లలను గాలికి వదిలేసి ప్రియుడు రాజేష్ తో జెండా ఎత్తేసింది.

సెల్ ఫోన్ టవర్ ఎక్కిన భర్త
తన భార్య సంధ్యా ఆమె ప్రియుడితో పారిపోయిందని, ఆమెను వెతికి పట్టుకుని తనకు అప్పగించాలని విజయ్ కుమార్ భార్యా పారిపోయిన రెండు మూడు రోజుల్లోనే పోలీసులకు ఫిర్యాదు చేశాడు. సంధ్యా ఆచూకి కనిపెట్టలేదని విజయ్ కుమార్ పోలీసుల మీద రగిలిపోయాడు. అంతే బుధవారం రాత్రి సేలంలోని ఇంజనీరింగ్ కాలేజ్ సమీపంలోని సెల్ టవర్ ఎక్కేశాడు.

చెమటలు పట్టించిన భర్త
తన భార్య సంధ్యా ఎక్కడ ఉన్నా పట్టుకుని వచ్చి తనకు అప్పగించాలని, లేదంటే సెల్ ఫోన్ టవర్ మీద నుంచి దూకి ఆత్మహత్య చేసుకుంటానని విజయ్ కుమార్ నానా హంగామా చేశాడు. విజయ్ కుమార్ సెల్ ఫోన్ టవర్ ఎక్కడంతో ఆ ప్రాంతంలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. విషయం తెలుసుకున్న సూరమంగళం అసిస్టెంట్ పోలీసు కమీషనర్ నాగరాజన్, ఇన్స్ పెక్టర్ శివకుమార్ తదితరులు సంఘటనా స్థలానికి చేరుకుని రెండు రోజుల్లో నీ భార్య సంధ్యాను కచ్చితంగా పట్టుకుంటామని విజయ్ కుమార్ కు నచ్చ చెప్పడానికి ప్రయత్నించారు.

భార్య కోసం థ్రిల్లర్ సినిమా చూపించిన భర్త
రెండు గంటల పాటు విజయ్ కుమార్ కు నచ్చచెప్పిన పోలీసు అధికారులు చివరికి అగ్నిమాపక సిబ్బంది సహాయంతో అతన్ని క్షేమంగా కిందకు దించారు. విజయ్ కుమార్ ను పోలీస్ స్టేషన్ కు తీసుకెళ్లి కౌన్సలింగ్ ఇస్తున్నామని సూరమంగళం అసిస్టెంట్ పోలీసు కమీషనర్ నాగరాజన్, మొత్తం మీద సెల్ ఫోన్ టవర్ ఎక్కిన విజయ్ కుమార్ సుమారు మూడు గంటల పాటు స్థానికులు, పోలీసులకు లైవ్ లో థ్రిల్లర్ సినిమా చూపించాడు. అయితే ప్రియుడితో పాటు లేచిపోయిన సంధ్యా ఎక్కడ ఉందో అనే విషయం గురించి ఇంతకాలం ఆరా తీసినా చిక్కడం లేదని, మా ప్రయత్నాలు మేము చేస్తున్నామని పోలీసులు అంటున్నారు. నా భార్య ప్రియుడిని నేను కచ్చితంగా చంపేస్తానని, నా భార్యను దూరం చేసిన వాడిని నేను ప్రాణఆలతో వదిలిపెట్టనని లారీ డ్రైవర్ విజయ్ కుమార్ ఆవేశంతో ఊగిపోతున్నాడు. విజయ్ కుమార్ కు కౌన్సిలింగ్ ఇచ్చిన పోలీసులు అతన్ని కొన్ని రోజులు జాగ్రత్తగా చూసుకోవాలని అతని కుటుంబ సభ్యులకు సూచించారు. మొత్తం మీద భార్య సంధ్యా కోసం ఆమె భర్త విజయ్ కుమార్ నానా హంగామా చెయ్యడం ఇప్పుడు సేలంలో హాట్ టాపిక్ అయ్యంది.
-
మూడు పండుగలకు రెగ్యులర్ గా మూడు ఉచిత సిలిండర్ల పంపిణీ + రూ.2,000 -
Tamil Nadu Polls: సర్వేల షాక్ తో విజయ్ బిగ్ టర్న్..! తుది దశలో తాజా ప్లాన్..! -
ఎన్నికల వేళ విజయ్ సమర్థతను తేల్చేసిన పవన్..!! -
ఇలా చేస్తే అమరావతి గొడవ క్లోజ్..! మావిగన్ వేళ చంద్రబాబుకు సాయిరెడ్డి ఐడియా..! -
Amaravati: సాయిరెడ్డి సలహాపై స్పందించిన టీడీపీ..! బహిరంగ లేఖ..! -
ఆర్టీసీ బస్సు ఛార్జీల్లో మార్పులు, కొత్త రేట్లు ఇలా..!! -
అలిపిరి నుంచిప్రత్యేకంగా 11 లేన్ల రహదారి- టోల్ గేట్ సమూల పునరుద్ధరణ? -
పసిడికి భారీ డిమాండ్: కుప్పలు తెప్పలుగా -
రైతులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్, పథకాలు ఇక నుంచి..!! -
సమ్మర్ లో ఈ హిల్ స్టేషన్ కు వెళ్తే.. మళ్లీ తిరిగి రావాలనిపించదు..! -
US Blockade: అమెరికాకు బిగ్ షాక్..! తేలిపోయిన హార్ముజ్ దిగ్బంధం..! -
జగన్, షర్మిల సహా వారికి చంద్రబాబు లేఖ - కీలక విజ్ఞప్తి..!!












Click it and Unblock the Notifications