Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

Illegal affair: ప్రియుడికి రిజర్వేషన్, భర్తకు వెయిటింగ్ లిస్ట్, తట్టుకోలేక థ్రిల్లర్ సినిమా స్కెచ్ !

చెన్నై/ తిరుప్పూర్/ మదురై: భర్తతో సంతోషంగా కాపురం చేస్తున్న భార్య పక్కదోవ పట్టింది. 10 సంవత్సరాలు భర్తతో కాపురం చేసిన భార్య ఇద్దరు పిల్లలకు తల్లి అయ్యింది. ఉదయం నిద్రలేస్తున్న భర్త ఇంట్లో టిఫిన్ చేసి ఉద్యోగానికి వెళ్లిపోతున్నాడు. రాత్రి ఉద్యోగం ముగించుకని క్వాటర్ బిగించి ఇంటికి వస్తున్న భర్త ఫుల్ మీల్స్ లాగించి గురకపెట్టి నిద్రపోతున్నాడు. ఇది భర్త దినచర్య. ఇక భార్య ఇద్దరు పిల్లలను స్కూల్ దగ్గర వదిలి పెట్టి, సాయంత్రం మళ్లీ స్కూల్ దగ్గరకు వెళ్లి వారిని ఇంటికి పిలుచుకుని వస్తోంది. భార్య దినచర్యలో మద్యలో ఓ కథ జరిగింది. రానురాను భార్య ఆమె భర్త విషయంలో నిర్లక్షంగా వ్యవహరించడం మొదలు పెట్టింది. కట్టుకున్న భార్య తీరులో మార్పులు రావడంతో అంత వరకు క్వాటర్ తాగుతున్న భర్త మరో 90 ఎక్కువగా తాగడం మొదలు పెట్టాడు. కాలం గడిచే కొద్ది భార్య ఆమె ప్రియుడితో ఎంజాయ్ చెయ్యడం ఎక్కువ అయ్యింది. ప్రియుడికి రిజర్వేషన్ కేటాయించిన భార్య ఆమె భర్తను వెయిటింగ్ లిస్ట్ లో పెట్టింది. ఇకలాభం లేదని డిసైడ్ అయిన భర్త థ్రిల్లర్ సినిమా స్కెచ్ తో ఆన్ డ్యూటీలో ఉంటూ భార్యను చంపేశాడు. మళ్లీ డ్యూటీకి వెళ్లిన భర్త పక్కింటోళ్లకు ఫోన్ చేశాడు. పక్కింటోళ్లు ఇచ్చిన సమాచారం మేరకు ఇంటికి వచ్చిన భర్త అయ్యో నా భార్యను ఎవరో చంపేశారు అంటూ అస్కార్ నటుడి టైపులో నటించాడు. అయితే పోలీసులు ఇచ్చిన ట్రీట్ మెంట్ తో భర్త జరిగిన సినిమా స్టోరీ మొత్తం చెప్పడంతో పోలీసులతో పాటు స్థానికుల మైండ్ బ్లాక్ అయ్యింది.

హ్యాపీలైఫ్ లో ఇద్దరు కూతుర్లు

హ్యాపీలైఫ్ లో ఇద్దరు కూతుర్లు

తమిళనాడులోని తిరుప్పూర్ జిల్లాలోని అవినాశిలోని కామరాజ్ రోడ్డులో విజయ్ (35) అనే వ్యక్తి నివాసం ఉంటున్నాడు. 10 సంవత్సరాల క్రితం ప్రియా (30) అనే యువతితో విజయ్ వివాహం జరిగింది. సంతోషంగా కాపురం చేసిన విజయ్, ప్రియా దంపతులకు హాసిని (7), షాలిని (6) అనే ఇద్దరు కుమార్తెలు ఉన్నారు.

ఎక్స్ పోర్టు గార్మెంట్స్ ఫ్యాక్టరీలో ఉద్యోగం

ఎక్స్ పోర్టు గార్మెంట్స్ ఫ్యాక్టరీలో ఉద్యోగం

భర్త విజయ్ అవినాశి సమీపంలోని ప్రముఖ రెడీమేడ్ ఎక్స్ పోర్టు రెడీమేడ్ గార్మెంట్స్ ఫ్యాక్టరీలో మంచి ఉద్యోగం చేస్తున్నాడు. ఉదయం నిద్రలేస్తున్న భర్త ఇంట్లో టిఫిన్ చేసి ఉద్యోగానికి వెళ్లిపోతున్నాడు. ఉద్యోగం చేస్తున్న విజయ్ నెలనెల జీతం సంపాధించి అతని భార్య ప్రియాతో పాటు ఇద్దరు కూతుర్లను పెంచిపోషిస్తున్నాడు.

భర్తకు డైలీ నైట్ క్వాటర్ మందు కావాలి

భర్తకు డైలీ నైట్ క్వాటర్ మందు కావాలి

ఉదయం ఇంటి నుంచి బాగానే ఉద్యోగానికి వెలుతున్న భర్త విజయ్ రాత్రి ఉద్యోగం ముగించుకని క్వాటర్ మందు బిగించి ఇంటికి వెళ్లి ఫుల్ మీల్స్ లాగించి గురకపెట్టి నిద్రపోతున్నాడు. ఇది భర్త విజయ్ దినచర్య. ఇక భార్య ప్రియా ఆమె ఇద్దరు కూతుర్లను అవినాశిలోని ఎయిడెడ్ స్కూల్ దగ్గర వదిలి పెట్టి, సాయంత్రం మళ్లీ స్కూల్ దగ్గరకు వెళ్లి వారిని ఇంటికి పిలుచుకుని వస్తోంది.

ప్రియాకు ప్రియమైన ప్రియుడు

ప్రియాకు ప్రియమైన ప్రియుడు

విజయ్ ఉద్యోగానికి వెళ్లిన తరువాత ఇంట్లో ఖాళీగా ఉంటున్న ప్రియా స్థానికంగా నివాసం ఉంటున్న యువకుడితో పరిచయం పెంచుకుంది. ప్రియా, ఆమెకు పరిచయం అయిన సెల్వా అనే యువకుడు రానురాను చనువుగా ఉంటూ అక్రమ సంబంధం పెట్టుకున్నారు. రాత్రి పీకలదాక మద్యం సేవించి ఇంటికి వచ్చి నిద్రపోతున్న భర్త విజయ్ ఇవ్వలేని పడక సుఖాన్ని అతని భార్య ప్రియా ఆమె ప్రియుడు సెల్వాతో తీర్చుకుంటున్నది.

క్వాటర్ లిమిట్ దాటి 90 ఎక్కువ అయ్యింది

క్వాటర్ లిమిట్ దాటి 90 ఎక్కువ అయ్యింది

భార్య ప్రియా ఆమె ప్రియుడు సెల్వా కథ రవసత్తరంగా జరిగింది. రానురాను భార్య ప్రియా ఆమె భర్త విజయ్ విషయంలో నిర్లక్షంగా వ్యవహరించడం మొదలు పెట్టింది. కట్టుకున్న భార్య ప్రియా తీరులో మార్పులు రావడంతో అంత వరకు క్వాటర్ తాగుతున్న భర్త విజయ్ మరో 90 ఎక్కువగా తాగడం మొదలు పెట్టాడు. కాలం గడిచే కొద్ది భార్య ప్రియా ఆమె ప్రియుడు సెల్వాతో ఎంజాయ్ చెయ్యడం ఎక్కువ అయ్యింది.

బైక్ లో తిరుగుతున్న భార్య

బైక్ లో తిరుగుతున్న భార్య

భర్త విజయ్ ఉద్యోగానికి వెళ్లిన తరువాత ఇద్దరు కూతుర్లకు ఆన్ లైన్ లో చదువుకోమని చెబుతున్న ప్రియా ఇంటి నుంచి బయటకు వెళ్లి ఆమె ప్రియుడు సెల్వా బైక్ లో తిరగడం మొదలు పెట్టింది. బయట ప్రియుడు సెల్వాతో బైక్ లో తిరగడమే కాకుండా అతన్ని ఇంటికి పిలిపించుకుని పిల్లలను ఆడుకోమని బయటకు పంపించి అతనితో ప్రియా పిచ్చపాటిగా ఎంజాయ్ చేసింది. ఈ విషయం ప్రియా భర్త విజయ్ కు స్థానికులు చెప్పేశారు.

ప్రియుడికి రిజర్వేషన్..... భర్తకు వెయిటింగ్ లిస్ట్

ప్రియుడికి రిజర్వేషన్..... భర్తకు వెయిటింగ్ లిస్ట్

నువ్వు ఎవరితో బయట తిరుగుతున్నావు అంటూ విజయ్ అతని భార్య ప్రియాతో గొడవ పెట్టుకోవడం మొదలు పెట్టాడు. రాత్రి ఫుల్ గా మద్యం సేవించి ఇంటికి వెళ్లి ప్రియాను పట్టుకుని చితకబాదేశాడు. ఇదే సమయంలో ఉద్యోగం చేస్తున్న భర్త విజయ్ ఎప్పుడు ఫోన్ చేసినా అతని భార్య ప్రియా ఫోన్ గంటలు గంటలు ఎంగేజ్ వచ్చింది. ఎవరితో ఫోన్ లో గంటల గంటలు మాట్లాడుతున్నావు అని విజయ్ ప్రశ్నిస్తే నేను ఎవ్వరితోనూ ఫోన్ లో మాట్లాడలేదు, నీ ఫోన్ ప్రాబ్లమ్ ఉంటుంది చూసుకో అంటూ ఎదురు తిరగడం మొదలుపెట్టింది.

డ్యూటీలో భార్యను పక్లాప్లాన్ తో చంపేసిన భర్త

డ్యూటీలో భార్యను పక్లాప్లాన్ తో చంపేసిన భర్త

ఇకలాభం లేదని డిసైడ్ అయిన భర్త విజయ్ సినిమా స్కెచ్ తో ఆమె భర్త ప్రియాను చంపేయాలని డిసైడ్ అయ్యాడు. ఈనెల 25వ తేదీన విజయ్ ఎప్పటి లాగే డ్యూటీకి వెళ్లాడు. డ్యూటీ మద్యలో ఇంటికి వెళ్లిన విజయ్ అతని భార్య ప్రియాతో గొడవ పెట్టుకున్నాడు. తరువాత కత్తి తీసుకున్న విజయ్ అతని భార్య ప్రియాను దారుణంగా పొడిచి చంపేశాడు. కేసు నుంచి తప్పించుకోవాలని ప్రియా శరీరం మీద ఉన్న 25 తులాల బంగారం, ఆమె కాలిలో వేసుకున్న వెండి గజ్జెలు, బీరువాలో ఉన్న కొంత నగదు ఎత్తుకుని వెళ్లి అతని బైక్ లో దాచి చెప్పాడు. ప్రియాను ఎవరో దొంగలు చంపేసినట్లు చిత్రీకరించాడు. తరువాత నేరుగా కంపెనీకి వెళ్లిన విజయ్ ఉద్యోగంలో ఉన్నట్లు నటించాడు.

డౌట్ రాకుండా పక్కింటోళ్లకు ఫోన్

డౌట్ రాకుండా పక్కింటోళ్లకు ఫోన్

మద్యాహ్నం కావాలనే విజయ్ అతని భార్య ప్రియా మొబైల్ నెంబర్ కు ఐదు సార్లు ఫోన్ చేశాడు. నా భార్య ప్రియా ఫోన్ తియ్యడం లేదని, మీరు వెళ్లి చూడాలని పక్కింటిలో నివాసం ఉంటూ చిల్లరఅంగడి నిర్వహిస్తున్న చిత్రా అనే మహిళకు ఫోన్ చేసి చెప్పాడు. చిత్రా వెళ్లి చూడగా వంట గదిలో ప్రియా శవమై కనిపించింది. వెంటనే చిత్రా విజయ్ కి ఫోన్ చేసి నీ భార్య ప్రియాను ఎవరో హత్య చేశారని చెప్పింది.

Recommended Video

    Prime Minister Narendra Modi on Tuesday spoke to Russian President Vladimir Putin on Afghanistan
    భలే నటించిన మొగుడు..... బెండ్ ఎత్తిన పోలీసులు

    భలే నటించిన మొగుడు..... బెండ్ ఎత్తిన పోలీసులు

    పక్కింటోళ్లు ఇచ్చిన సమాచారం మేరకు ఇంటికి వచ్చిన భర్త విజయ్ అయ్యో నా భార్య ప్రియాను ఎవరో చంపేశారు అంటూ అస్కార్ నటుడి టైపులో నటించాడు. అయితే పోలీసులకు విజయ్ మీద అనుమానం పెరిగిపోయి అతన్ని అదుపులోకి తీసుకుని ట్రీట్ మెంట్ ఇచ్చారు. పోలీసుల దెబ్బతో భర్త విజయ్ అతని భార్య ప్రియాను ఎలా చంపేశాడో అనే విషయం మొత్తం సినిమా స్టోరీ లాగా చెప్పడంతో పోలీసులతో పాటు స్థానికుల మైండ్ బ్లాక్ అయ్యింది.

    More From
    Prev
    Next
    Notifications
    Settings
    Clear Notifications
    Notifications
    Use the toggle to switch on notifications
    • Block for 8 hours
    • Block for 12 hours
    • Block for 24 hours
    • Don't block
    Gender
    Select your Gender
    • Male
    • Female
    • Others
    Age
    Select your Age Range
    • Under 18
    • 18 to 25
    • 26 to 35
    • 36 to 45
    • 45 to 55
    • 55+